Hyderabad: 100 స్పీడ్‌తో వచ్చి యువతిని డీకొట్టి పారిపోయేలోపే.. సీన్ రివర్స్..!
బాలానగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడంతోపాటు నిర్లక్ష్యంగా ప్రవర్తించిన అనిల్‌పై కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. సిసి టీవీ ఫుటేజీ ఆధారంగా పూర్తి ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. తీవ్రంగా గాయపడ్డ యువతిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

హైదరాబాద్ నగరంలో జరిగిన హిట్ అండ్ రన్ ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మేడ్చల్ జిల్లా కూకట్‌పల్లి పరిధి బాలానగర్‌లోని ఐడిపిఎల్ చౌరస్తా వద్ద వేగంగా వచ్చిన వాహనం నడుచుకుంటూ వెళ్తున్న సాయి కీర్తి (19) అనే యువతిని ఢీ కొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే కారు వేగంగా వెళ్లిపోయింది, అయితే ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించడంతో నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వాహనం నడిపిన వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కాగా ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ యువతిని ఆసుపత్రికి తరలించారు.
పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో, నిందితుడు బల్కంపేటకు చెందిన గొగం అనిల్ (35)గా పోలీసులు గుర్తించారు. అనిల్ సోమవారం రాత్రి మొయినాబాద్‌లోని ఓ ఫాం హౌస్‌లో విందులో పాల్గొని మద్యం సేవించినట్లు తెలిసింది. మంగళవారం(మార్చి 25) ఉదయం తిరిగి వస్తుండగా అతను నియంత్రణ కోల్పోయి ఈ ప్రమాదానికి కారణమయ్యాడని పోలీసులు తెలిపారు. ఐడిపిఎల్ చౌరస్తాలో యువతిని ఢీ కొట్టిన తర్వాత, అతను కారు ఆపకుండా ముందుకు వెళ్లిపోయాడు. అయితే ఫతేనగర్ సిగ్నల్ వద్ద ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి కారును ఆపి అనిల్‌ను అదుపులోకి తీసుకున్నారు.
ప్రస్తుతం బాలానగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడంతోపాటు నిర్లక్ష్యంగా ప్రవర్తించిన అనిల్‌పై కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. సిసి టీవీ ఫుటేజీ ఆధారంగా పూర్తి ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. బాధిత యువతి ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్న పోలీసులు, ఆమెకు మెరుగైన వైద్యం అందేలా చూస్తున్నారు. మరోవైపు ఘటనకు కారణమైన నిందితుడు అనిల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. తాగి వాహనం నడపడమే కాకుండా ఇతరుల ప్రాణాల మీదికి తెస్తున్నారు. ఇప్పటికే హిట్ అండ్ రన్ కేసులు పెరిగిపోతున్న నేపధ్యంలో పోలీసులు డ్రంకెన్ డ్రైవర్ల పై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..