Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఛీ.. ఛీ.. వీళ్లు మనుషులేనా..? భర్తలతో చేతులు కలిపిన భార్యలు.. కన్నతండ్రిని ఏం చేశారంటే..

ప్రపంచంలో ఎక్కడైనా కూతుళ్లు అంటే.. తండ్రికి ఎనలేని మమకారం ఉంటుంది. కొడుకుల కంటే ఎక్కువగా ప్రేమ చూపి అక్కున చేర్చుకుంటారు. కొడుకులు వృద్ధాప్యంలో ముద్ద పెట్టకున్నా.. కూతుళ్లు ఉంటే వాళ్ళైన చూస్తారని నానుడి ఉంది. కూతుళ్లు.. తల్లి కంటే తండ్రినే ఎక్కువగా ప్రేమిస్తారు. కానీ ఈ కూతుళ్లు జన్మనిచ్చిన తండ్రినే కిరాతకంగా హతమార్చారు.. అసలేం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..

Telangana: ఛీ.. ఛీ.. వీళ్లు మనుషులేనా..? భర్తలతో చేతులు కలిపిన భార్యలు.. కన్నతండ్రిని ఏం చేశారంటే..
Crime News
Follow us
M Revan Reddy

| Edited By: Shaik Madar Saheb

Updated on: Mar 25, 2025 | 12:59 PM

ప్రపంచంలో ఎక్కడైనా కూతుళ్లు అంటే.. తండ్రికి ఎనలేని మమకారం ఉంటుంది. కొడుకుల కంటే ఎక్కువగా ప్రేమ చూపి అక్కున చేర్చుకుంటారు. కొడుకులు వృద్ధాప్యంలో ముద్ద పెట్టకున్నా.. కూతుళ్లు ఉంటే వాళ్ళైన చూస్తారని నానుడి ఉంది. కూతుళ్లు.. తల్లి కంటే తండ్రినే ఎక్కువగా ప్రేమిస్తారు. కానీ ఈ కూతుళ్లు జన్మనిచ్చిన తండ్రినే కిరాతకంగా హతమార్చారు.. అసలేం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం మిర్యాల గ్రామానికి చెందిన మెంచు చక్రయ్య గౌడ్ కు ఐదుగురు కూతుళ్లు. ఎంతో అల్లారు ముద్దుగా ఐదుగురిని సాకి మంచి చదవించి.. ఘనంగా పెళ్ళిళ్ళు సైతం చేసాడు. పెళ్ళి తరవాత కూతుళ్లను వదిలి ఉండలేమోనని నలుగురు కూతుళ్లను సొంత ఊళ్ళోనే సంబంధాలు చూసి వివాహం చేసాడు. స్వతహాగా నాయకత్వ లక్షణాలు ఉండటంతో గ్రామంలో పెద్దమనిషిగా చెలామణి అవుతూ గ్రామ సర్పంచ్ గా పని చేశాడు చక్రయ్య గౌడ్. మరో దఫా అవకాశం రావడంతో మూడో కూతురు సునీతను సర్పంచ్ గా ఆమె భర్త వెంకన్నను పీఏసీఎస్ చైర్మన్ గా చేసి తన ఆధిపత్యాన్ని చాటుకున్నాడు.

రాజకీయ ఆధిపత్యం కోసం..

మామ ఆశయానికి అనుగుణంగానే మూడో అల్లుడు వెంకన్న సైతం రాజకీయంగా ఎదిగాడు. మండల నాయకుడిగా ఎదిగినా గ్రామానికి వచ్చే సరికి తన మామ చక్రయ్యకే ఎక్కువ ఫాలోయింగ్ ఉండటంతో వెంకన్న ఓర్చుకోలేక పోయాడు. మరోవైపు వెంకన్న భూ దందాలు, సెటిల్మెంట్లు చేయడం నచ్చని చక్రయ్య అల్లుడిని వారించాడు. మామకు వస్తున్న పేరు ప్రతిష్టలు.. అలాగే తన సెటిల్మెంట్లకు అడ్డు పడుతున్నాడన్న నెపంతో మామపై పగ పెంచుకున్నాడు వెంకన్న. మూడో అల్లుడు వెంకన్నకు తోడుగా 1, 5 వ అల్లుళ్ళు వారి వ్యక్తిగత జీవితాల్లో ఉన్న మనస్పర్థలు.. వీటన్నింటిని కలిసి మామను హత్య చేయాలని నిర్ణయించారు.

అయితే.. ముగ్గురు అల్లుళ్ళ నిర్ణయాన్ని కూతుళ్లు వ్యతిరేకించాల్సింది పోయి.. పేగు బంధాన్ని మరచి భర్తల పగలో చేతులు కలిపారు. మమకారాన్ని వదిలేసి జన్మనిచ్చిన బంధాన్ని మరచి స్కెచ్ వేసి కర్కశంగా హత్య చేశారు. కడుపున పుట్టిన కూతుళ్లపై ప్రేమ పెంచుకున్నందుకు.. అల్లుళ్ళు చేసే తప్పులను ప్రశ్నించి న్యాయం వైపు నిలబడ్డ పాపానికి పరిహారంగా ప్రాణాలు వదిలాడు..

కూతుళ్లు, అల్లుళ్ళు కలిసి చక్రయ్యను దారుణంగా హత మార్చడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అందరికి తలలో నాలుకగా ఉండి, సమస్యల పరిష్కారానికి అండగా నిలబడే చక్రయ్య హత్య గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. మంచి మనిషిని పొట్టన పెట్టుకున్నారని కూతుళ్లకు శాపనార్ధాలు పెట్టారు గ్రామస్థులు. మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు అనే పాట రచయిత మాటలకు నిదర్శనంగా గ్రామ పెద్ద చక్రయ్య హత్య ఉదంతం నిలిచింది.. కూతుళ్లు, అల్లుళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..