AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఖాకీ వనంలో కలుపు మొక్క.. ఏకంగా సర్వీస్ రివాల్వర్‌నే అమ్మేసిన ఎస్‌ఐ.. విచారణలో షాకింగ్ నిజాలు!

హైదరాబాద్‌ మహానగరం పరిధిలోని అంబర్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న భానుప్రకాష్‌ వ్యవహారం ప్రస్తుతం పోలీసు వర్గాల్లో పెద్ద సంచలనంగా మారింది. దర్యాప్తు అధికారి చేయకూడని అక్రమాలకు పాల్పడటంతో మొత్తం శాఖ ప్రతిష్ట దెబ్బతిన్న పరిస్థితి నెలకొంది. 2020 బ్యాచ్‌కు చెందిన భానుప్రకాష్‌ విధి నిర్వహణలో చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.

ఖాకీ వనంలో కలుపు మొక్క.. ఏకంగా సర్వీస్ రివాల్వర్‌నే అమ్మేసిన ఎస్‌ఐ.. విచారణలో షాకింగ్ నిజాలు!
Si Bhanuprakash Arrested
Ranjith Muppidi
| Edited By: |

Updated on: Nov 26, 2025 | 7:20 PM

Share

హైదరాబాద్‌ మహానగరం పరిధిలోని అంబర్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న భానుప్రకాష్‌ వ్యవహారం ప్రస్తుతం పోలీసు వర్గాల్లో పెద్ద సంచలనంగా మారింది. దర్యాప్తు అధికారి చేయకూడని అక్రమాలకు పాల్పడటంతో మొత్తం శాఖ ప్రతిష్ట దెబ్బతిన్న పరిస్థితి నెలకొంది. 2020 బ్యాచ్‌కు చెందిన భానుప్రకాష్‌ ఇటీవల 4 తులాల బంగారం చోరీ కేసును విచారించాడు. రికవరీ చేసిన బంగారాన్ని బాధితులకు అప్పగించకుండా.. త్వరలో ఇస్తా అని నమ్మబలికి, లోక్‌ అదాలత్‌లో ఇరు వర్గాలతో మాట్లాడి కేసును క్లోజ్ చేయించాడు. కానీ కేసు మూసేసిన తర్వాత కూడా బాధితులకు బంగారం ఇవ్వకుండా.. తీసుకెళ్లి తాకట్టు పెట్టుకున్నట్టు విచారణలో తేలింది. విషయం పైస్థాయికి చేరడంతో అతడిపై కేసు నమోదు చేసి, సస్పెండ్‌ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

ఇంతటితో ఆగకుండా.. భానుప్రకాష్‌ మీద మరో పెద్ద షాకింగ్‌ ఆరోపణ వెలుగులోకి వచ్చింది. తనకు కేటాయించిన 9MM సర్వీస్‌ పిస్టల్‌ కనిపించడంలేదని ఇటీవల స్టేషన్‌కు వచ్చి గోల చేశాడు. అతని డ్రా చెక్ చేయగా బుల్లెట్లు మాత్రమే కనిపించాయి. గన్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. సీసీ కెమెరా ఫుటేజీని చెక్ చేస్తే.. రికవరీ చేసిన బంగారాన్ని డ్రాలో పెట్టి తర్వాత అక్కడి నుంచి తీసుకెళ్తున్న దృశ్యాలు స్పష్టంగా లభించాయి. అయితే గన్ సంగతి అడిగితే.. డ్రాలోనే పెట్టా, ఏమైందో తెలియడం లేదని అని భాను ప్రకాష్‌ విచారణలో చెబుతున్నట్టు సమాచారం.

ఇదిలావుంటే, విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బెట్టింగ్ వ్యసనానికి అలవాటు పడ్డ భాను ప్రకాష్ దాదాపు రూ.70–80 లక్షలు పోగొట్టుకున్నట్లు తెలుస్తోంది. అప్పుల భారం, ఆర్థిక ఇబ్బందులతోనే భానుప్రకాష్‌ ఈ అక్రమాలకు పాల్పడ్డాడని అనుమానిస్తున్నారు. ఈ లోపే ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-2 ఉద్యోగం వచ్చిందని స్టేషన్‌కు వచ్చి చెప్పి, వస్తువులు తీసుకెళ్లిన సందర్భంలోనే పిస్టల్‌ మిస్సింగ్‌ కథ వెలుగులోకి వచ్చింది. ఈ గన్‌ను రాయలసీమ లేదా ఇతర ప్రాంతాల ముఠాలకు అమ్మేశాడా? అన్న కోణంలో టాస్క్‌ఫోర్స్‌ ప్రత్యేక దర్యాప్తు కొనసాగిస్తోంది. ప్రస్తుతానికి రికవరీ సొత్తు దుర్వినియోగంపై భానుప్రకాష్‌పై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. పిస్టల్‌ మిస్సింగ్ మిస్టరీ ఇంకా వీడలేదు..!!

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us