తెలంగాణలో కరోనాపై హైకోర్టులో విచారణ.. కేసులు తగ్గాయన్న ప్రభుత్వం.. ఎక్కడ తగ్గాయో చూపించాలని హైకోర్టు ప్రశ్న

Telangana Corona: తెలంగాణలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. రోజు మూడు వేల వరకు కేసులు నమోదు....

తెలంగాణలో కరోనాపై హైకోర్టులో విచారణ.. కేసులు తగ్గాయన్న ప్రభుత్వం.. ఎక్కడ తగ్గాయో చూపించాలని హైకోర్టు ప్రశ్న
Telangana High Court
Follow us
Subhash Goud

|

Updated on: Apr 23, 2021 | 3:02 PM

Telangana Corona: తెలంగాణలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. రోజు మూడు వేల వరకు కేసులు నమోదు కావడం ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ చేపట్టింది. విచారణకు హెల్త్‌ సెక్రటరీ రిజ్వీ హాజరయ్యారు. కరోనా కట్టడికి నైట్‌ కర్ఫ్యూ అమలు చేస్తుందని ఏజీ అన్నారు. అయితే నైట్‌ కర్ఫ్యూ వల్ల కరోనా కేసులు తగ్గాయని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. దీంతో స్పందించిన కోర్టు ఎక్కడ కేసులు తగ్గాయో చూపించాలని హైకోర్టు సూచించింది. బార్లు, సినిమా థియేటర్ల దగ్గర ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలుపాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది.

కుంభమేళా వెళ్లిన వారిని ఇతర రాష్ట్రాలు క్వారంటైన్‌లో పెడుతున్నాయని, తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రాష్ట్ర సరిహద్దుల్లో ఎలాంటి చర్యలు చేపట్టారని హైకోర్టు ప్రశ్నించింది. ఎన్నికల ర్యాలీలు, సభలను ఎందుకు నియంత్రణ చేయడం లేదని తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు మండిపడింది. అలాగే ఇతర దేశాల నుంచి వచ్చేవారిని ఆర్‌టీపీసీఆర్‌ టెస్ట్‌ ఎందుకు అడగడం లేదని ప్రశ్నల వర్షం కురిపించింది. అంతేకాదు ఆర్‌టీపీసీఆర్‌ టెస్ట్‌ రిపోర్టు 24 గంటల్లోపు ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలని, అదే వీఐపీలకు 24 గంటల్లోపే ఎందుకు ఇస్తున్నారని హైకోర్టు చురకలంటించింది. ప్రభుత్వం చెప్పిన వివరణపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

కాగా, తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. గత మొదటి వేవ్‌లో కేసుల సంఖ్య పెరిగి తగ్గుముఖం పట్టినా.. ఈ సెకండ్‌వేవ్‌లో అంతకంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. కరోనా కట్టడికి ఎన్ని చర్యలు చేపట్టినా.. ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా రాష్ట్రంలో రోజుకు మూడు వేలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. గతంలో జీహెచ్‌ఎంసీలో ఎక్కువగా ఇతర జిల్లా, మండల కేంద్రాల్లో పెద్దగా కేసులు ఉండేవి కాదు. కానీ ఈ సెకండ్‌వేవ్‌లో జీహెచ్‌ఎంసీతో పాటు ఇతర జిల్లాలు, మండలాలు, గ్రామీణ ప్రాంతాలను సైతం కరోనా మహమ్మారి వదలడం లేదు. అక్కడ వందల సంఖ్యలో కేసులు నమోదు కావడం, పదుల సంఖ్యలో మరణాలు సంభవిన్నాయి.

ఇవీ చదవండి: India Covid-19: భారత్‌లో కొనసాగుతున్న కరోనా విజృంభణ.. ఒక్క రోజే 2,263 మంది మృతి.. కేసులు ఎన్నంటే..?

Telangana Corona Cases: తెలంగాణలో కరోనా విలయ తాండవం.. రికార్డు స్థాయిలో నమోదవుతున్న కేసులు.. కొత్తగా 6,206 మందికి పాజిటివ్

ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!