Telangana Corona Cases: తెలంగాణలో కరోనా విలయ తాండవం.. రికార్డు స్థాయిలో నమోదవుతున్న కేసులు.. కొత్తగా 6,206 మందికి పాజిటివ్
తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ బీభత్సం సృష్టిస్తోంది. కొత్త కేసుల సంఖ్య అమాంతం పెరిగింది. ఎవరూ ఊహించనంత విధంగా కోవిడ్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది.
Telangana Corona Cases: తెలంగాణలో కరోనా సెకడ్ వేవ్ బీభత్సం సృష్టిస్తోంది. కొత్త కేసుల సంఖ్య అమాంతం పెరిగింది. ఎవరూ ఊహించనంత విధంగా కోవిడ్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. మరి గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో కొత్తగా 6,206 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ శుక్రవారం హెల్త్‌బులిటెన్‌లో పేర్కొంది. కరోనా రాకాసి బారిన పడి శుక్రవారం కొత్తగా 29 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మహమ్మారి నుంచి 3,052 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 52,726 యాక్టివ్ కేసులున్నాయని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది.
నిన్న ఒకే రోజు 1,05,602 మందికి కొవిడ్ పరీక్షలు చేసినట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది. ఇదిలావుండగా జీహెచ్‌ఎంసీ పరిధిలో రోజువారీ కేసులు వెయ్యి దాటాయి. 24 గంటల్లో 1,005 కరోనా కేసులు రికార్డయ్యాయని ఆరోగ్యశాఖ తెలిపింది. ఆ తర్వాత అత్యధికంగా మేడ్చల్‌లో 502, రంగారెడ్డి 373, నిజామాబాద్ 406, మహబూబ్‌నగర్ 271, జగిత్యాల 257, మంచిర్యాల 226, కామారెడ్డి 188 కొవిడ్ కేసులు రికార్డయ్యాయి.
భారత్‌లో కరోనా మరణాల రేటుతో పోల్చితే తెలంగాణ మెరుగ్గానే ఉంది. మన దేశ కరోనా మరణాల రేటు 1.1గా ఉంటే.. తెలంగాణలో మాత్రం 0.50గా ఉంది. జాతీయ రికవరీ రేటు 83.9గా ఉంటే తెలంగాణలో 58.59గా ఉంది.
ఇక జిల్లాల వారీగా నమోదై కరోనా పాజిటివ్ కేసులు ఇలా ఉన్నాయి…