India Covid-19: భారత్‌లో కొనసాగుతున్న కరోనా విజృంభణ.. ఒక్క రోజే 2,263 మంది మృతి.. కేసులు ఎన్నంటే..?

India Coronavirus updates: దేశంలో కరోనావైరస్ కరాళ నృత్యం చేస్తోంది. నిత్యం లక్షల్లో కోవిడ్-19 కేసులు, వేలల్లో మరణాలు నమోదవుతున్నాయి. దీంతోపాటు

India Covid-19: భారత్‌లో కొనసాగుతున్న కరోనా విజృంభణ.. ఒక్క రోజే 2,263 మంది మృతి.. కేసులు ఎన్నంటే..?
India corona latest updates
Follow us

|

Updated on: Apr 23, 2021 | 10:26 AM

India Coronavirus updates: దేశంలో కరోనావైరస్ కరాళ నృత్యం చేస్తోంది. నిత్యం లక్షల్లో కోవిడ్-19 కేసులు, వేలల్లో మరణాలు నమోదవుతున్నాయి. దీంతోపాటు ఈ రెండింటి సంఖ్య రోజురోజుకూ రికార్డు స్థాయిని దాటిపోతోంది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక కేసులు నమోదయ్యే జాబితాలో భారత్ చేరింది. తాజాగా గత 24 గంటల్లో (గురువారం) దేశవ్యాప్తంగా 3,32,730 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 2,263 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,62,63,695 (1.62 కోట్లు) కు పెరగగా.. మరణాల సంఖ్య 1,86,920 కి చేరింది. ప్రపంచంలో అత్యధికంగా భారత్‌లో కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. దేశంలో కోవిడ్ ప్రారంభం నాటినుంచి అత్యధిక కోవిడ్ -19 కేసులు, మరణాలు సంభవించడం ఇదే మొదటిసారి.

నిన్న కరోనా నుంచి 1,93,279 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1,36,48,159 కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 24,28,616 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 83.92 శాతం ఉండగా.. మరణాల రేటు 1.15 శాతం ఉంది.

ఇదిలాఉంటే.. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. వ్యాక్సినేషన్ ప్రారంభం నాటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా.. 13,54,78,420 డోసులను లబ్ధిదారులకు వేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

కాగా.. గురువారం దేశవ్యాప్తంగా 17,40,550 కరోనా నిర్థారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. వీటితో కలిపి ఏప్రిల్ 22 వరకు మొత్తం 27,44,45,653 కరోనా పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్స్ వెల్లడించింది.

Also Read:

Theif: సారీ.. అవి కరోనా వ్యాక్సిన్లు అని తెలియదు.. లెటర్ రాసి.. టీకాలను తిరిగిచ్చేసిన దొంగ..

దేశంలో కోవిడ్ పరిస్థితిపై నేడు మళ్ళీ సమీక్షించనున్న సుప్రీంకోర్టు, కేంద్రానికి కొత్త సూచనలు ?

Horoscope Today: ఆర్థిక, ఆరోగ్య సమస్యల నుంచి వారికి ఊరట..
Horoscope Today: ఆర్థిక, ఆరోగ్య సమస్యల నుంచి వారికి ఊరట..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే