Minister KTR: మంత్రి కేటీఆర్‌కు కరోనా.. స్వల్ప లక్షణాలతో హోం ఐసోలేషన్‌లో చికిత్స
మంత్రి కేటీరామారావు కూడా కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్ వేదికగా వెల్లడించారు.
Telangana minister KTR: తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. సాధారణ ప్రజలతో పాటు సినీ, రాజకీయ ప్రముుఖులు కూడా కోవిడ్ బారినపడుతున్నారు. ఇప్పటికే ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఎంపీ సంతోష్ కుమార్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా.. తాజాగా మంత్రి కేటీరామారావు కూడా కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్ వేదికగా వెల్లడించారు. తనకు స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని.. ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నానని పేర్కొన్నారు. ఇటీవల తనను కలిసిన వారంతా కోవిడ్ ప్రొటోకాల్స్ పాటిస్తూ.. కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
I’ve tested COVID positive with mild symptoms. Currently isolated at home
Those of you who have met me last few days, kindly follow the covid protocol, get tested & take care
— KTR (@KTRTRS) April 23, 2021
ఇదిలావుంటే, ఇటీవలే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. బుధవారం యశోదా ఆసుపత్రికి సీఎం కేసీఆర్‌ను పరీక్షల నిమిత్తం తరలించిన సమయంలో ఆయన వెంటే మంత్రి కేటీఆర్‌తో పాటు ఎంపీ సంతోష్ కూడా ఉన్నారు. ఇదే క్రమంలోనే గురువారం సంతోష్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా..ఇవాళ కేటీఆర్ సైతం కరోనా బారిన పడ్డారు.