దేశంలో కోవిడ్ పరిస్థితిపై నేడు మళ్ళీ సమీక్షించనున్న సుప్రీంకోర్టు, కేంద్రానికి కొత్త సూచనలు ?

దేశంలో కోవిడ్ సంక్షోభంపై సుప్రీంకోర్టు శుక్రవారం కూడా సమీక్షించనుంది. దీనిపై తనకు తానుగా విచారించనుంది. లాక్ డౌన్ ను ప్రకటించడానికి హైకోర్టులకు అధికారాలు ఉన్నాయా అన్న అంశాన్ని....

దేశంలో కోవిడ్ పరిస్థితిపై నేడు మళ్ళీ సమీక్షించనున్న సుప్రీంకోర్టు, కేంద్రానికి కొత్త సూచనలు ?
Supreme Court To Hear Suo Motu Case On Covid Situation
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Apr 23, 2021 | 8:05 AM

దేశంలో కోవిడ్ సంక్షోభంపై సుప్రీంకోర్టు శుక్రవారం కూడా సమీక్షించనుంది. దీనిపై తనకు తానుగా విచారించనుంది. లాక్ డౌన్ ను ప్రకటించడానికి హైకోర్టులకు అధికారాలు ఉన్నాయా అన్న అంశాన్ని కూడా అత్యున్నత న్యాయస్థానం పరిశీలిస్తుంది. సీజేఐ ఎస్.ఏ. బాబ్డే, ఎల్.నాగేశ్వర రావు, ఎస్.రవీంద్ర భట్ లతో కూడిన ధర్మాసనం నిన్న కేంద్రానికి కొన్ని సూచనలు చేసింది. కోవిడ్ రోగులకు ఆక్సిజన్, మందుల లభ్యత వంటి అంశాల పరిశీలనకు ఓ నేషనల్ పాలసీని రూపొందించాలని నిన్న కేంద్రానికి సూచించింది. దేశ వ్యాప్తంగా ఆసుపత్రులకు ఆక్సిజన్ లభించేలా చూడాలని కూడా కోరింది. ఢిల్లీ హైకోర్టు కూడా ఇలాగే కేంద్రానికి పలు సూచనలు చేసింది. ఆక్సిజన్ ను ఎలా తెస్తారో మీ ఇష్టం.. అడుక్కుని తెస్తారో, దొంగిలించి  తెస్తారో.. మొదట ఆసుపత్రులకు మాత్రం ఆక్సిజన్ లభించేలా చూడాలని చీవాట్లు పెట్టినంత పని చేసింది. ఇక సుప్రీంకోర్టు సీజేఐ బాబ్డే అయితే దేశంలో నేషనల్ ఎమర్జెన్సీ వంటి పరిస్థితి నెలకొందని వ్యాఖ్యానించారు.

కాగా-అలహాబాద్, లక్నో, వారణాసి, కాన్పూర్, గోరఖ్ పూర్ లలో లాక్ డౌన్ విధించాలని అలహాబాద్ హైకోర్టు ఈ నెల 19 న యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ఇలా ఆదేశాలు ఇచ్ఛే జ్యూడిషియల్ అధికారాలు హైకోర్టులకు ఉన్నాయా అన్న అంశాన్ని సుప్రీంకోర్టు పరిశీలించనుంది. అలహాబాద్ హైకోర్టు ఆదేశాలపై ఈ అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. కానీ  హైకోర్టులకు ఈ అధికారాలు ఉండాలని  సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ భావిస్తోంది. హైకోర్టులు లోకల్ గనుక వాటికి ఆయా రాష్ట్రాల లోని పరిస్థితులు తెలుస్తాయని, అందువల్ల వాటికి ఈ మేరకు జ్యూడిషియల్ అధికారాలు ఉండడం సముచితమని ఈ అసోసియేషన్ అభిప్రాయపడుతోంది.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!