TSPSC: Group 2 పరీక్షలపై సోమవారం క్లారిటీ ఇవ్వండి.. టీఎస్‌పీఎస్‌సీకి హైకోర్ట్ అదేశాలు..
Group 2 Exams: గ్రూప్ 2 అభ్యర్థులు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించిన కోర్టు సోమవారం లోపు పరీక్షలపై నిర్ణయాన్ని తెలపాలని సంబంధిత న్యాయవాదికి హైకోర్టు ఆదేశించింది. టిఎస్పిఎస్సి నోటిఫికేషన్ ప్రకారం ఆగస్టు 29, 30 తేదీలలో గ్రూప్ 2 పరీక్ష నిర్వహించేందుకు ఇప్పటికే ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా 1539 సెంటర్లలో గ్రూప్ 2 పరీక్ష నిర్వహించేందుకు స్కూళ్లు, కాలేజీలకు ప్రభుత్వం సెలవులు సైతం ప్రకటించింది. పరీక్షకు సుమారు 5.5 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే అందులో కేవలం..
తెలంగాణ న్యూస్, ఆగస్టు 11: గ్రూప్ 2 అభ్యర్ధుల ఉత్కంఠ సోమవారం వరకు కొనసాగనుంది. గ్రూప్ 2 పరీక్షలను మూడు నెలల పాటు వాయిదా వేయాలని కోరుతూ 150 మంది గ్రూప్ 2 అభ్యర్థులు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించిన కోర్టు సోమవారం లోపు పరీక్షలపై నిర్ణయాన్ని తెలపాలని సంబంధిత న్యాయవాదికి హైకోర్టు ఆదేశించింది. టిఎస్పిఎస్సి నోటిఫికేషన్ ప్రకారం ఆగస్టు 29, 30 తేదీలలో గ్రూప్ 2 పరీక్ష నిర్వహించేందుకు ఇప్పటికే ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా 1539 సెంటర్లలో గ్రూప్ 2 పరీక్ష నిర్వహించేందుకు స్కూళ్లు, కాలేజీలకు ప్రభుత్వం సెలవులు సైతం ప్రకటించింది. పరీక్షకు సుమారు 5.5 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే అందులో కేవలం 150 మంది అభ్యర్థులు మాత్రమే హైకోర్టును ఆశ్రయించారని టీఎస్పీఎస్సీ న్యాయవాది రాంగోపాల్ రావ్ కోర్టుకు చెప్పారు.
మరోవైపు పిటిషనర్ల తరఫున కాంగ్రెస్ లీగల్ సెల్ సీనియర్ కౌన్సిల్ గిరిధర్ రావు వాదించారు. ఈ సందర్భంగా ఏడు సంవత్సరాల పాటు గ్రూప్ 2 నోటిఫికేషన్ లేదని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఆగస్టు 2 నుండి ఆగస్టు 30 వరకు టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో 21 పరీక్షలు నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిందని ఆయన కోర్టుకు తెలిపారు. నోటిఫికేషన్లను కేవలం ఎన్నికల కోసమే ఇచ్చిందని పిటిషనర్ న్యాయవాది వాదించారు.. ఒకే నెలలో ఇన్ని పరీక్షలు నిర్వహిస్తే అభ్యర్థులు మెంటల్ స్ట్రెస్‌కు లోనవుతారని పిటీషనర్ల తరఫున ఆయన వాదించారు. అంతకు ముందు టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 అభ్యర్థులు ఆందోళన నిర్వహించారు. జూన్ 26, జులై 24 తేదీల్లో జరిగే గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయాలని కోరుతూ టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు అభ్యర్థులు.
అయితే టీఎస్పీఎస్సీ చైర్మన్‌కు వినతి పత్రం అందించి చాలా రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు గ్రూప్ 2 పరీక్షపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పిటిషనర్ న్యాయవాది గిరిధర్ రావు కోర్టుకు తెలిపారు. ఇదే నెలలో గురు కులాల టీచర్ పరీక్షలతో పాటు పాలిటెక్నిక్ జూనియర్ లెక్చరర్ పరీక్షలను కూడా టీఎస్పీఎస్సీ నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో దాదాపు 5.5 లక్షల మంది గ్రూప్ 2 కోసం దరఖాస్తు చేసుకోగా అందులో కేవలం 60 వేల మంది మాత్రమే గురుకులాల టీచర్ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారని టీఎస్పీఎస్సీ న్యాయవాది రాంగోపాల రావు వాదించారు. వాదోపవాదాలు విన్న తర్వాత.. అభ్యర్థులు ఇచ్చిన వినతి పత్రంపై ఇంకా ఎందుకు నిర్ణయం తీసుకోలేదని టిఎస్పిఎస్సిని హైకోర్ట్ ప్రశ్నించింది. సోమవారం లోపు అభ్యర్థుల అభ్యర్థనపై టీఎస్పీఎస్సీ నిర్ణయం చెప్పాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 14 హైకోర్టు వాయిదా వేసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..