Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పదో తరగతి పేపర్‌ లీకేజ్‌ వ్యవహారంలో డిబార్‌ అయిన హరీష్‌కు ఊరట.. కీలక నిర్ణయం ప్రకటించిన హైకోర్ట్‌.

పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజ్‌ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వరంగల్‌లో హిందీ పేపర్‌ లీకేజ్‌ అయిన వ్యవహారంలో.. హరీష్‌ అనే పదో తరగతి విద్యార్థిపై ఐదేళ్ల డిబార్ విధించారు. అయితే తానేమి తప్పు చేయలేదని ఎవరో వ్యక్తి పరీక్ష హాల్‌ కిటీకి...

పదో తరగతి పేపర్‌ లీకేజ్‌ వ్యవహారంలో డిబార్‌ అయిన హరీష్‌కు ఊరట.. కీలక నిర్ణయం ప్రకటించిన హైకోర్ట్‌.
10th Class Paper Leak
Follow us
Narender Vaitla

|

Updated on: Apr 08, 2023 | 3:59 PM

పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజ్‌ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వరంగల్‌లో హిందీ పేపర్‌ లీకేజ్‌ అయిన వ్యవహారంలో.. హరీష్‌ అనే పదో తరగతి విద్యార్థిపై ఐదేళ్ల డిబార్ విధించారు. అయితే తానేమి తప్పు చేయలేదని ఎవరో వ్యక్తి పరీక్ష హాల్‌ కిటీకి దగ్గరకు వచ్చి తనను క్వశ్చన్‌ పేపర్‌ ఇవ్వమని అడిగాడని, ఇవ్వకపోతే చంపేస్తానంటూ బెదిరించడంతోనే ఇచ్చానని హరీష్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. హరీష్‌ తల్లిదండ్రులు కూడా తన కొడుకు జీవితాన్ని నాశనం చేయొద్దంటూ డిబార్‌ ఎత్తివేసి పరీక్ష రాసే అవకాశం కల్పించాలని కన్నీటి పర్యంతమయ్యారు.

అయితే దీనిపై అధికారుల నుంచి స్పందన రాకవడంతో విద్యార్థి తండ్రి హైకోర్టును ఆశ్రయించాడు. తాజాగా శనివారం హైకోర్టు ఈ అంశంపై కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. హరీష్‌కు ఊరటినచ్చేలా తీర్పునిచ్చింది. హరీష్‌కు మిగతా పరీక్షలు రాసేలా అనుమతి ఇవ్వాలని కోర్టు తెలిపింది. హరీష్‌ సోమవారం నుంచి పరీక్షలకు హాజరుకావొచ్చని హైకోర్టు తెలిపింది. హరీష్‌కు పరీక్షలు రాసేందుకు అనుమతి ఇవ్వాలని హైకోర్టు అధికారులకు తెలిపింది. ఐదేళ్లు డిబార్‌ చేయడం వల్ల తన కొడుకి భవిష్యత్తుకు తీరని అన్యాయం జరుగుతుందని హరీష్‌ తండ్రి చేసిన విజ్ఞప్తి మేరకు కోర్టు ఈ నిర్ణయాన్ని తీసుకుంది. దీంతో హరీష్‌ సోమవారం నుంచి పరీక్షలు రాసే అవకాశం లభించనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

కదులుతున్న రైల్లో సెల్‌ఫోన్‌ చోరీకి యత్నం.. సీన్‌ కట్‌చేస్తే దొంగ
కదులుతున్న రైల్లో సెల్‌ఫోన్‌ చోరీకి యత్నం.. సీన్‌ కట్‌చేస్తే దొంగ
మార్స్‌పై మనిషి బతికేందుకు సరికొత్త మార్గం కనిపెట్టిన సైంటిస్ట్‌!
మార్స్‌పై మనిషి బతికేందుకు సరికొత్త మార్గం కనిపెట్టిన సైంటిస్ట్‌!
వాట్సాప్‌ కీలక అప్‌డేట్‌.. ఆండ్రాయిడ్‌ యూజర్లకు అదిరిపోయే ఫీచర్!
వాట్సాప్‌ కీలక అప్‌డేట్‌.. ఆండ్రాయిడ్‌ యూజర్లకు అదిరిపోయే ఫీచర్!
శ్రీవారి భక్తులకు అలర్ట్‌..నేటినుంచి 3రోజుల పాటు పలుసేవలకు బ్రేక్
శ్రీవారి భక్తులకు అలర్ట్‌..నేటినుంచి 3రోజుల పాటు పలుసేవలకు బ్రేక్
ఇదేం రీల్స్‌ పిచ్చిరా సామి.. కొంచెం తేడా జరిగినా అంతే పరిస్థితి!
ఇదేం రీల్స్‌ పిచ్చిరా సామి.. కొంచెం తేడా జరిగినా అంతే పరిస్థితి!
ఐపీఎల్ లో కులం ప్రస్తావన.. నెటిజన్ల ఆగ్రహం
ఐపీఎల్ లో కులం ప్రస్తావన.. నెటిజన్ల ఆగ్రహం
నిశీధిలో ఉషోదయంలా అందాల రాశి..
నిశీధిలో ఉషోదయంలా అందాల రాశి..
విదేశాలకు పారిపోయిన నేరగాళ్లను వెనక్కి రప్పించేదీ ఎలా?
విదేశాలకు పారిపోయిన నేరగాళ్లను వెనక్కి రప్పించేదీ ఎలా?
క్యాన్సర్‌ పేషెంట్లకు గుడ్‌న్యూస్‌! తక్కువ ఖర్చుతోనే..
క్యాన్సర్‌ పేషెంట్లకు గుడ్‌న్యూస్‌! తక్కువ ఖర్చుతోనే..
వామ్మో.. ఇక బంగారం కొనడం కష్టమే.. ఒకేసారి భారీగా పెరిగిన ధరలు..
వామ్మో.. ఇక బంగారం కొనడం కష్టమే.. ఒకేసారి భారీగా పెరిగిన ధరలు..