TV9 Conclave 2024: కాంగ్రెస్ ఏడాది పాలన ఎలా ఉంది..? తెలంగాణ జనం ఏమనుకుంటున్నారు? ప్రతిపక్షాల వెర్షన్ ఏంటి?
ఎలక్షన్ ముందైనా.. ఎలక్షన్ తర్వాతైనా... ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజలు ఏం కోరుకుంటున్నారు? సమాజం మనోగతానికి అద్దం పట్టడంలో... ఆ ప్రతిబింబాన్ని మీ ముందు ఉంచడంలో టీవీ9 ఎప్పుడూ ముందుంటుంది.
ప్రస్తుతం హైదరాబాద్‌లో వాతావరణం కూల్‌గా మారిపోయింది.. చిరు జల్లులు పడుతున్నాయి. ఈ కూల్‌నెస్ ఆవిరైపోయేలా కాసేపట్లో టీవీ9లో హాట్‌హాట్ డిబేట్స్ జరగబోతున్నాయి. కాంగ్రెస్ ఏడాది పాలనపై టీవీ9 స్పెషల్ కాన్‌క్లేవ్‌కి బడా నేతలంతా రాబోతున్నారు. మంత్రులు, కాంగ్రెస్ నాయకులు ఏం చెప్తారు..? దానికి ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ లీడర్ల కౌంటర్లు ఎలా ఉండబోతున్నాయి. సరిగ్గా ఉదయం 10 గంటల నుంచి ఈ టీవీ9 స్పెషల్ కాన్‌క్లేవ్ ప్రారంభం కాబోతుంది.
గల్లీ నుంచి ఢిల్లీ దాకా… సినిమా నుంచి రాజకీయం దాకా.. అంశమేదైనా సరే, కవరేజ్‌లో అందరి కన్నా ముందుండే టీవీ9… అర్థవంతమైన చర్చలకు వేదికగానూ నిలుస్తుంది. రెండు దశాబ్దాలుగా అలాంటి ఎన్నో గ్రాండ్ ఈవెంట్స్‌ను.. దిగ్విజయంగా నిర్వహించిన టీవీ9 నెట్‌వర్క్.. మరోసారి తన మార్క్ గ్రాండ్ ఈవెంట్‌ను నిర్వహించేందుకు సిద్ధమవుతోంది.
తెలంగాణలో ప్రజాపాలన విజయోత్సవవాలు కొనసాగుతున్నాయి. ముచ్చర్లలో పర్యటించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏఐ సిటీకి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం గచ్చిబౌలిలో స్పోర్ట్స్ వర్సిటీకి శంకుస్థాపన చేస్తారు సీఎం. ఇక, కాంగ్రెస్ ఏడాది పాలన ఎలా ఉంది? తెలంగాణ జనం ఏమనుకుంటున్నారు? ప్రతిపక్షాల వెర్షన్ ఏంటి? అధికారపక్షం కౌంటరేంటి? ఇలాంటి వాటికి టీవీ9 గ్రాండ్ కాంక్లేవ్ వేదిక అవుతోంది.
ఎన్నికలు ఎప్పుడొచ్చినా.. జనం నాడిని పట్టుకునేందుకు టీవీ9 ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. బస్సు యాత్రలతో.. బుల్లెట్ యాత్రలతో… జనాల్లోకి దూసుకెళ్లి మరీ, క్షేత్రస్థాయి పరిస్థితుల్ని అంచనా వేస్తుంది. అలాచేసిన ఎన్నో ప్రయత్నాలు విజయవంతమయ్యాయి. టీవీ9 ముందు జనం చెప్పిన మాటలకు అనుగుణంగానే.. ఎన్నికల ఫలితాలు కూడా ప్రతిధ్వనించాయి.
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సైతం.. వాట్ తెలంగాణ థింక్స్ టుడే అంటూ భారీ కాంక్లేవ్ నిర్వహించింది టీవీ9 తెలుగు. పాలక, ప్రతిపక్షం నుంచి ఉద్దండ నేతల్ని ఒకే వేదిక మీదకు తీసుకొచ్చి.. ప్రజల పక్షాన ప్రశ్నించింది. గ్రాండ్ సక్సెస్ అయిన ఆ షో.. తెలుగు మీడియాలో ఓ సంచలనమైందనే చెప్పాలి. ఆ తర్వాత తెలంగాణలో ప్రభుత్వం మారింది. రాజకీయంగా ఎన్నో మార్పులు సంభవించాయి.
మరిప్పుడు, సరిగ్గా ఏడాది కాంగ్రెస్ పాలన తర్వాత.. తెలంగాణ సమాజం ఏమనుకుంటోంది? తమ పాలనపై అధికార పార్టీ ఏమంటోంది? ప్రతిపక్షం విమర్శలేంటి? ఇలాంటి అంశాలపై చర్చించేందుకు… వాట్ తెలంగాణ థింక్స్ టుడే అంటూ.. మరో గ్రాండ్ కాంక్లేవ్‌తో మీ ముందుకు వస్తోంది టీవీ9. బిగ్‌న్యూస్ బిగ్‌డిబేట్‌తో తెలుగు మీడియా సూపర్‌స్టార్‌గా నిలిచిన టీవీ9 తెలుగు మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్ ఆధ్వర్యంలో జరగబోయే ఈ గ్రాండ్ ఈవెంట్‌ను అస్సలు మిస్సవకండి మరి..!
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..