AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MLA Rajasingh: ఆదిలోనే హంసపాదు.. కొత్త ఎమ్మెల్యేలతో కలిసి వెళ్లని రాజాశింగ్..!

తెలంగాణ అసెంబ్లీ కొత్త సభ్యులతో కొలువుదీరింది. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు శాసనసభకు హాజరుకాలేదు. ప్రమాణం చేయలేదు. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ సమక్షంలో ఎమ్మెల్యేగా ప్రమాణం చేయవద్దని నిర్ణయించారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి నేతృత్వంలో శాసనసభా పక్షం సమావేశమై నిర్ణయం తీసుకుంది.

MLA Rajasingh: ఆదిలోనే హంసపాదు.. కొత్త ఎమ్మెల్యేలతో కలిసి వెళ్లని రాజాశింగ్..!
Rajasingh
Vidyasagar Gunti
| Edited By: Balaraju Goud|

Updated on: Dec 09, 2023 | 3:24 PM

Share

తెలంగాణ అసెంబ్లీ కొత్త సభ్యులతో కొలువుదీరింది. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు శాసనసభకు హాజరుకాలేదు. ప్రమాణం చేయలేదు. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ సమక్షంలో ఎమ్మెల్యేగా ప్రమాణం చేయవద్దని నిర్ణయించారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి నేతృత్వంలో శాసనసభా పక్షం సమావేశమై నిర్ణయం తీసుకుంది. పార్టీలో చర్చ జరగకుండానే ఎమ్మెల్యే రాజాసింగ్, ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ సమక్షంలో ఎమ్మెల్యేలుగా తాము ప్రమాణం చేయబోమని ప్రకటించడాన్ని రాష్ట్ర నాయకత్వం తప్పుపట్టింది. అదేవిధంగా అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ ఎంపిక విషయంపై కూడా సమావేశంలో చర్చించినట్లు సమాచారం. ఫ్లోర్ లీడర్ పదవిని తనకే అప్పగించాలని మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన రాజాసింగ్ పట్టుపట్టారు.

తెలంగాణ అసెంబ్లీలో ప్రమాణంపై బీజేపీ ఎమ్మెల్యేల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అలక వహించారు.బీజేఎల్పీ సమావేశం నుంచి రాజాసింగ్ బయటకు వెళ్లిపోయారు. దీంతో రాష్ట్ర సారథి కిషన్ రెడ్డి.. రాజాసింగ్‌తో విడిగా భేటీ అయ్యారు. మిగతా ఎమ్మెల్యేలతో కలిసి వెళ్లాలని రాజాసింగ్‌కు సూచించారు. అంతకుముందు ఎల్పీ సమావేశం కాగానే.. రాజాసింగ్ బయటకు వెళ్లడంతో కిషన్ రెడ్డితో పాటు మిగతా ఎమ్మెల్యేలు భాగ్యలక్ష్మీ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి నేరుగా ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత గన్ పార్క్ చేరుకుని అమరవీరుల స్థూపానికి నివాళ్ళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మితే కూలిపోతుందని, అందుకే ఎంఐఎంను మచ్చిక చేసుకుంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. రెగ్యులర్ స్పీకర్ ఎన్నిక తర్వాత బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణం చేస్తారని కిషన్ రెడ్డి వివరించారు.

మరోవైపు, ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఎంపికను వ్యతిరేకిస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు గవర్నర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. మొత్తానికి మిగతా ఎమ్మెల్యేలతో రాజాసింగ్ కలిసి నడుస్తారా? నా రూటే సపరేట్ అంటారా? ముందు ముందు చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…