తుమ్మినా, దగ్గినా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది.. కిషన్ రెడ్డి సంచలన కామెంట్స్
ప్రొటెం స్పీకర్ ఎంపిక విషయంలో కాంగ్రెస్ పార్టీ గత సంప్రదాయాలను, నియమాలను తుంగలో తొక్కిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. ఎంఐఎంతో ఒప్పందంలో భాగంగానే అక్బరుద్దీన్‌ను ప్రొటెం స్పీకర్‌గా నియమించారని విమర్శించారు. ఇందుకు నిరసనగా తాము ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని బహిష్కరించినట్లు కిషన్ రెడ్డి తెలిపారు.
ప్రొటెం స్పీకర్ ఎంపిక విషయంలో కాంగ్రెస్ పార్టీ గత సంప్రదాయాలను, నియమాలను తుంగలో తొక్కిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. ఎంఐఎంతో ఒప్పందంలో భాగంగానే అక్బరుద్దీన్‌ను ప్రొటెం స్పీకర్‌గా నియమించారని విమర్శించారు. ఇందుకు నిరసనగా తాము ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని బహిష్కరించినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. తుమ్మినా, దగ్గినా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని.. బొటాబొటీ మెజారిటీతోనే రేవంత్ సర్కార్ నడుస్తోందన్నారు. ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకే ఎంఐఎంతో కాంగ్రెస్ దోస్తీ చేస్తుందని ఆరోపించారు. ప్రొటెం స్పీకర్ నియామకం విషయంలో ప్రభుత్వం సరిగ్గా వ్యవహరించలేదని, సంప్రదాయాలను పాటించలేదని బీజేపీ ఎమ్మెల్యేలు గవర్నర్‌కు కలిసి ఫిర్యాదు చేశారు.
సభలో అక్బరుద్దీన్ కంటే ఐదుగురు సీనియర్ సభ్యులు ఉన్నారని బీజేపీ ఎమ్మెల్యేలు తెలిపారు. అయినా మజ్లిస్ ఎమ్మెల్యేను ప్రొటెం స్పీకర్‌గా ఎంపిక చేయడం కాంగ్రెస్, ఎంఐఎం స్నేహానికి నిదర్శనమని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం ఐదో టైర్ లాంటిదని కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి విమర్శించారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి.
పెగ్గు పడగానే పాత గొడవలు గుర్తుకొస్తాయి
ఇలాంటి సీన్ లేకుండా 31 దావత్ ఉంటుందా.. వైరల్ అవుతున్న వీడియో
కొండలా పేరుకుపోయిన అప్పు రూ.1.75 కోట్లకు రూ.147 కోట్లు
ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా తెగి పడిన చెవి.. ఆ తర్వాత
బతికున్న వ్యక్తిని చనిపోయాడంటూ పోస్టుమార్టంకు..
మొసళ్ల నదిలోకి దూకిన వానరసైన్యం ప్రాణాలకు తెగించి సాహసం
పాకిస్థాన్‌లో సూపర్ రిచ్ ఈ హిందూ మహిళ

