AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఇది కదా కావాల్సింది

తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల బలోపేతం పై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. పాఠశాలలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించడంతో పాటు స్కూల్స్ లో డిజిటల్ విద్యను బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు రెండు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత కంప్యూటర్ టీచర్ల (ఐసీటీ ఇన్‌స్ట్రక్టర్ల) నియామకానికి పచ్చజెండా ఊపింది.

Telangana: ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఇది కదా కావాల్సింది
Students
Vidyasagar Gunti
| Edited By: Ravi Kiran|

Updated on: Nov 18, 2025 | 8:21 PM

Share

తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల బలోపేతం పై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. పాఠశాలలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించడంతో పాటు స్కూల్స్ లో డిజిటల్ విద్యను బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు రెండు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత కంప్యూటర్ టీచర్ల (ఐసీటీ ఇన్‌స్ట్రక్టర్ల) నియామకానికి పచ్చజెండా ఊపింది. రాష్ట్రవ్యాప్తంగా కంప్యూటర్ ల్యాబ్‌లు ఉన్న పాఠశాలల్లో విద్యార్థులకు సాంకేతిక విద్యను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై హర్షం వ్యక్తం చేస్తున్నారు ఉపాధ్యయ సంఘాల నేతలు.

రాష్ట్రవ్యాప్తంగా 5 లేదా అంతకంటే ఎక్కువ కంప్యూటర్లు ఉన్న 2,837 పాఠశాలలను అధికారులు గుర్తించారు. ఈ స్కూళ్లలో ఔట్ సోర్సింగ్ విధానంలో ఐసీటీ ఇన్‌స్ట్రక్టర్లను నియమించనున్నారు. తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ (టీజీటీఎస్) ద్వారా త్వరలోనే ఈ నియామక ప్రక్రియ చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంపికైన వారికి నెలకు రూ.15,000 చొప్పున పది నెలల పాటు గౌరవ వేతనం చెల్లించనున్నారు. ఈ వ్యయాన్ని సమగ్ర శిక్షా నిధుల నుంచి భరించనున్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాంలో సుమారు 20 ఏళ్ల క్రితం 4,200 పాఠశాలల్లో కంప్యూటర్లు ఏర్పాటు చేసి, ఐదేళ్ల కాలపరిమితితో ఇన్‌స్ట్రక్టర్లను నియమించారు. అయితే, ఆ తర్వాత వారిని తొలగించడంతో కంప్యూటర్ ల్యాబ్‌లు నిరుపయోగంగా మారాయి. సరైన పర్యవేక్షణ కొరవడి చాలా కంప్యూటర్లు మూలకు చేరాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా నియమించే టీచర్ల తో ల్యాబ్‌ల నిర్వహణతో పాటు విద్యార్థులకు డిజిటల్ విద్య‌ను అందించడంలో కీలక పాత్ర పోషిస్తారు.. విద్యార్థులకు సులభంగా కంప్యూటర్ బోధన తో పాటు టెక్నాలజీ పరంగా అవగాహన వస్తుందంటున్నారు ఉపాధ్యాయ సంఘాల నేతలు. ప్రభుత్వ పాఠశాలలో కంప్యూటర్ టీచర్లను నియమించడం మంచి పరిణామం అన్నారు ఉపాధ్యాయ సంఘాల నేతలు.. ప్రభుత్వ పాఠశాలలో కంప్యూటర్ టీచర్ టీచర్ల నియామకం ద్వారా విద్యార్థులకు కంప్యూటర్ విద్య సులభతరమైతుందన్నారు.

గత కొన్ని సంవత్సరాలుగా పలు స్కూళ్లలో కంప్యూటర్స్ ఉన్న అవి నిరుపయోగంగా ఉండేవని.. ఉన్న స్కూళ్లలో ఉపాధ్యాయులే కంప్యూటర్ బోధన అందించే వారిని ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయంతో ఉపాధ్యాయులపై భారం తగ్గడంతో పాటు విద్యార్థులకు టెక్నాలజీ పరంగా సాంకేతిక విద్య కూడా అందుతుందని అయితే ఇంటర్నెట్ సదుపాయాన్ని కూడా పూర్తిస్థాయిలో గ్రామాలలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో కల్పించేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలన్నారు ఉపాధ్యాయ సంఘాల నేతలు. ప్రభుత్వ నిర్ణయంతో సర్కార్ పాఠశాలల్లోని కంప్యూటర్ ల్యాబ్‌లు తిరిగి తెరుచుకొని, డిజిటల్ విద్యాబోధనకు కొత్త ఊపు వస్తుందంటున్నారు విద్యా వేత్తలు