Hyderabad: భాగ్యనగర వాసులకు మరో బంపర్ న్యూస్.. అందుబాటులోకి రానున్న మరో టూరిస్ట్ ప్లేస్..
హైదరాబాద్‌లో మరో టూరిస్ట్ ప్లేస్ అందుబాటులోకి రాబోతోంది. అతిత్వరలోనే పర్యాటకులకు ఆహ్వాదాన్ని పంచబోతున్నాయ్ పైగా టూంబ్స్. దక్షిణ తాజ్‌మహల్‌గా పేరుగాంచిన పైగా(Paigah) టూంబ్స్ పునరుద్ధరణకు..

హైదరాబాద్‌లో మరో టూరిస్ట్ ప్లేస్ అందుబాటులోకి రాబోతోంది. అతిత్వరలోనే పర్యాటకులకు ఆహ్వాదాన్ని పంచబోతున్నాయ్ పైగా టూంబ్స్. దక్షిణ తాజ్‌మహల్‌గా పేరుగాంచిన పైగా(Paigah) టూంబ్స్ పునరుద్ధరణకు అడుగులు పడ్డాయ్. రీసెంట్‌గా పైగా టూంబ్స్‌ను సందర్శించిన యూఎస్ కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లార్సన్.. అమెరికా నిధులతో పరిరక్షణ ప్రాజెక్టును ప్రకటించారు. అద్భుతమైన స్మారక చిహ్నాలను పరిరక్షించడానికి తమ వంతు కృషి చేస్తామన్నారు జెన్నిఫర్.
హైదరాబాద్ సంతోష్‌నగర్‌లో ఉన్న అతి పురాతన సమాధుల్లో 6 పరిరక్షణకు రూ. 2.50 లక్షల డాలర్ల ఆర్ధిక సాయాన్ని అందిస్తోంది అమెరికా. ఈ నిధులతో 18, 19వ శతాబ్దాల్లో నిర్మించిన ఈ సమాధులను అందంగా తీర్చిదిద్దనున్నారు. పునరుద్ధరణ పనులను త్వరలోనే ప్రారంభించి, రెండుమూడేళ్లలో కంప్లీట్ చేస్తామంటున్నారు ఆగాఖాన్ ట్రస్ట్ ఛైర్మన్ రితీష్ నందన్.
వందల ఏళ్ల చరిత్ర ఉన్న పైగా టూంబ్స్ పునరుద్ధరణ బాధ్యతలను ఆగాఖాన్ ట్రస్ట్‌కి ఇచ్చింది ప్రభుత్వం. ప్రస్తుతం పైగా టూంబ్స్ ఆర్కిటెక్చర్‌పై పరిశోధనలు జరుగుతున్నాయి. సున్నం, మోర్టార్‌తోపాటు పాలరాతితో చేసిన ఈ సమాధుల సముదాయం.. ఆనాటి వైభవానికి, అద్భుత కళా నైపుణ్యానికి రుజువులు. దక్షిణ తాజ్‌మహల్‌గా పేరుగాంచిన ఈ పైగా టూంబ్స్.. హైదరాబాద్‌లో మోస్ట్ బ్యూటిఫుల్ టూరిస్ట్ ప్లేస్‌గా మారనుంది.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..