AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆడుకుంటూ రూ.10 కాయిన్ మింగిన బాలిక.. ఆపరేషన్‌ చేసిన నిలువని ప్రాణం..!

చిన్న పిల్లలు ఆడుకుంటూ తమ చేతిలో ఉన్న వస్తువులను నోట్లో పెట్టుకోవడం సర్వసాధారణం..! కాస్త పెద్ద అయ్యాక తర్వాత కూడా కొందరు పిల్లలు ఆ అలవాటును కొనసాగిస్తుంటారు. నోట్లో ఏదో ఒకటి పెట్టుకుని ఆడుకుంటారు. అదే కొన్ని సార్లు తీవ్ర ఇబ్బందులు తెచ్చి పెడుతుంది. వస్తువులను పొరపాటున మింగడంతోపాటు గొంతు, ఆహార నాళాల్లో ఇరుక్కుపోయి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయిన ఘటనలు సైతం ఉన్నాయి.

ఆడుకుంటూ రూ.10 కాయిన్ మింగిన బాలిక.. ఆపరేషన్‌ చేసిన నిలువని ప్రాణం..!
Girl Dies After Swallowed Rs.10 Coin
M Revan Reddy
| Edited By: |

Updated on: Sep 21, 2025 | 6:42 PM

Share

చిన్న పిల్లలు ఆడుకుంటూ తమ చేతిలో ఉన్న వస్తువులను నోట్లో పెట్టుకోవడం సర్వసాధారణం..! కాస్త పెద్ద అయ్యాక తర్వాత కూడా కొందరు పిల్లలు ఆ అలవాటును కొనసాగిస్తుంటారు. నోట్లో ఏదో ఒకటి పెట్టుకుని ఆడుకుంటారు. అదే కొన్ని సార్లు తీవ్ర ఇబ్బందులు తెచ్చి పెడుతుంది. వస్తువులను పొరపాటున మింగడంతోపాటు గొంతు, ఆహార నాళాల్లో ఇరుక్కుపోయి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయిన ఘటనలు సైతం ఉన్నాయి. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లాలో పది రూపాయల కాయిన్‌ను ఓ చిన్నారిని మింగేసింది. ఊపిరాడక తల్లడిల్లిపోయింది.

యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం భీమనపల్లికి చెందిన శేఖర్ – జ్యోతి దంప‌తుల‌కు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. దంపతుల గారాలపట్టి పదేళ్ల నిహారిక స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 5వ‌ తరగతి చదువుతోంది. సాయంత్రం పాఠశాల నుండి ఇంటికి తిరిగి వచ్చిన నిహారిక ఇంటి బయట ఆడుకుంటూ పొరపాటున పది రూపాయల నాణెం మింగింది. ఆ నాణెం గొంతులో ఇరుక్కుపోయి ఊపిరి ఆడక విలవిలలాడిపోయింది.

ఈ విషయాన్ని గమనించిన బాలిక తల్లిదండ్రులు.. ఆమెను వెంటనే హైదరాబాద్ లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆపరేషన్ చేసి బాలిక గొంతులో ఇరుక్కున్న నాణేన్ని వైద్యులు తొలగించారు. ఆ తర్వాత ఇంటికి తీసుకు వచ్చిన తర్వాత నిహారిక నిద్రపోయింది. చిన్నారిని నిద్ర లేపేందుకు తల్లిదండ్రులు ప్రయత్నించారు. అయితే బాలిక ముఖం అంతా ఆకుపచ్చ రంగుగా మారింది. దీంతో అపస్మారకస్థితిలోకి బాలిక వెళ్లిపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు ఆపరేషన్ చేసిన ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాలికను పరీక్షించిన వైద్యులు అప్పటికే బాలిక మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో బాలిక తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరయ్యారు. అయితే ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా కారణంగానే బిడ్డ మరణించిందన కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..