Telangana: తెలంగాణలో మరో ఘోరం.. బాలికపై సెక్యూరిటీ గార్డ్ లైంగిక దాడి.. మాయమాటలతో..
కామారెడ్డి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని గుమస్తా కాలానికి చెందిన ఓ బాలిక (16) ను కామారెడ్డి పట్టణానికి చెందిన కిరణ్ అనే యువకుడు మాయమాటలతో లోబర్చుకున్నాడు.
Girl raped by security guard : దేశంలో నిర్భయ లాంటి కఠిన చట్టాలున్నప్పటికీ.. కామాంధులు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. మహిళలు, బాలికలపై దారుణానికి ఒడిగడుతున్నారు. తాజాగా.. తెలంగాణలోని కామారెడ్డి జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడు బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కామారెడ్డి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని గుమస్తా కాలానికి చెందిన ఓ బాలిక (16) ను కామారెడ్డి పట్టణానికి చెందిన కిరణ్ అనే యువకుడు మాయమాటలతో లోబర్చుకున్నాడు. అనంతరం ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు.
బాలిక శరీరంలో మార్పులు గమనించిన తల్లిదండ్రులు.. ఆమెను ప్రశ్నించారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అనంతరం బాలిక తండ్రి కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో, పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, కిరణ్ జిల్లా కలెక్టరేట్ లో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బాలికను పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి