Gang War: గ్యాంగ్ వార్.. యువకుడిపై కత్తులతో విచక్షణా రహితంగా దాడి.. ఉలిక్కి పడిన కాలనీ వాసులు!
Gang War: అప్పటి నుంచి ఇరు వర్గాలు మధ్య తరచూ వార్ నడుస్తూనే ఉంది. గత రాత్రి ఇరు వర్గాలు మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. పోలీసులు వచ్చి చెదర గొట్టారు. మళ్ళీ ఉదయం సతీష్ ఇంటికి తన గ్యాంగ్ తో సాయిరాం..

భద్రాచలం లో ఇరు వర్గాలు మధ్య గ్యాంగ్ వార్ జరిగింది. యువకులు కత్తులతో స్వైర విహారం చేశారు. విచక్షణ కోల్పోయి కత్తులతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటన కాలనీ వాసులను ఉలిక్కిపడేలా చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో పాతకక్ష్యలతో ఇరువర్గాల మధ్య ఘర్షణ ఏర్పడింది. పట్టణంలోని ఏఎస్ఆర్ కాలనీలో కణితి సతీష్ అనే యువకుడిపై జగదీష్ కాలనికి చెందిన యువకులు కత్తులతో దాడి చేయడంతో సతీష్ అక్కడికక్కడే మృతి చెందాడు. రెండేళ్ల క్రితం ఏ ఎస్ ఆర్ కాలనీ కి చెందిన సతీష్ ,జగదీష్ కాలనీ కి చెందిన సాయిరాం కు వినాయక చవితి నిమజ్జనం సమయంలో గొడవ జరిగింది.
అప్పటి నుంచి ఇరు వర్గాలు మధ్య తరచూ వార్ నడుస్తూనే ఉంది. గత రాత్రి ఇరు వర్గాలు మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. పోలీసులు వచ్చి చెదర గొట్టారు. మళ్ళీ ఉదయం సతీష్ ఇంటికి తన గ్యాంగ్ తో సాయిరాం వెళ్లి గొడవకు దిగాడు. ఇంట్లోనే దారుణంగా కత్తులతో దాడి చేసి సతీష్ ను హత్య చేశారు. అతని అన్న రమణ అడ్డుకునే ప్రయత్నం చేయగా అతనిపై కూడా కత్తులతో దాడి చేసి గాయపరిచారు.
కత్తుల దాడితో కాలని వాసులు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. పోలీసులకు సమాచారమిచ్చి కత్తిపోట్లకు గురైన యువకుడిని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తుండగా, దాడికి పాల్పడ్డ యువకుడు సాయిరాం పోలీస్ స్టేషన్ లొంగిపొయ్యాడు. కత్తులతో దాడికి దిగిన మిగిలిన యువకుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి