Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: రైతులకు మోడీ సర్కార్‌ బంపర్‌ ఆఫర్‌.. కేవలం 4 శాతం వడ్డీకే రూ. 3 లక్షల రుణం!

PM Modi: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కార్యాలయం నుండి విడుదల చేసిన పోస్ట్‌లో ఇప్పుడు దేశంలోని లక్షలాది మంది రైతులకు ఆర్థిక జీవనాధారంగా మారిందని ఆర్థిక మంత్రి అన్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు వంటి ముఖ్యమైన వస్తువులను కొనుగోలు చేయడంలో..

PM Modi: రైతులకు మోడీ సర్కార్‌ బంపర్‌ ఆఫర్‌.. కేవలం 4 శాతం వడ్డీకే రూ. 3 లక్షల రుణం!
Follow us
Subhash Goud

|

Updated on: Jun 09, 2025 | 7:53 AM

PM Modi: దేశంలోని రైతులకు మోడీ ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతోంది. రైతులు ఆర్థికంగా ఎదిగేందుకు రకరకాల స్కీమ్‌లను అందుబాటులోకి తీసుకువస్తోంది. మోడీ సర్కార్‌ ముందుగా రైతులకు ప్రాముఖ్యతను ఇస్తుంది. ఈ నేపథ్యంలో దేశంలో లక్షలాది మంది రైతులు కిసాన్‌ క్రెడిట్‌ కార్డు పథకాన్ని ఉపయోగించుకుంటున్నారని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామ్‌ అన్నారు. ఈ పథకం ద్వారా రైతులు సకాలంలో తక్కువ వడ్డీ రేటుకే రుణ సౌకర్యాన్ని పొందుతున్నారని అన్నారు. దీనికి సంబంధించి వివరాలను ఎక్స్‌ వేదిక పోస్టు చేశారు. రైతులకు అందించే ఈ రుణాలు విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల వంటి వ్యవసాయ అవసరాలను తీర్చుకునేందుకు ఉపయోగపడుతున్నాయని అన్నారు.

కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం రైతులకు బలమైన ఆర్థిక సహాయంగా మారిందని, ఇప్పటివరకు 465 లక్షల దరఖాస్తులు ఆమోదించినట్లు చెప్పారు. వీటి పరిమితి రూ.5.7 లక్షల కోట్లకు చేరుకుందని ఆమె అన్నారు. క్రెడిట్ కార్డుల ద్వారా స్వల్పకాలిక పంట రుణాలు ఇప్పుడు సులభతరం అయ్యాయి. కెసిసి ద్వారా, వ్యవసాయ కార్యకలాపాలకు వారి ఆర్థిక అవసరాలను తీర్చడానికి కేంద్ర ప్రభుత్వం రైతులకు రుణ రూపంలో రూ.5 లక్షల వరకు సహాయం చేస్తుంది.

ఇది కూడా చదవండి: Brain Tumour: నిద్రపోతున్నప్పుడు ఈ 5 లక్షణాలు కనిపిస్తు బ్రెయిన్ ట్యూమర్ సంకేతాలు!

ఇవి కూడా చదవండి

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కార్యాలయం నుండి విడుదల చేసిన పోస్ట్‌లో కిసాన్ క్రెడిట్ కార్డ్ (కెసిసి) ఇప్పుడు దేశంలోని లక్షలాది మంది రైతులకు ఆర్థిక జీవనాధారంగా మారిందని ఆర్థిక మంత్రి అన్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు వంటి ముఖ్యమైన వస్తువులను కొనుగోలు చేయడంలో, పంట ఉత్పత్తికి సంబంధించిన నగదు అవసరాలను తీర్చడంలో కెసిసి పథకం రైతులకు గొప్ప సౌలభ్యాన్ని అందించిందని ఆమె అన్నారు. కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా స్వల్పకాలిక పంట రుణాలు ఇప్పుడు సులభతరం అయ్యాయని ఆమె అన్నారు.

సకాలంలో చెల్లింపుపై వడ్డీ తగ్గింపు:

రైతు సకాలంలో చెల్లిస్తే, రూ.3 లక్షల వరకు రుణంపై 4 శాతం వడ్డీ మాత్రమే చెల్లించాలి. దీనితో పాటు, రుణాన్ని సకాలంలో తిరిగి చెల్లించినందుకు 3 శాతం అదనపు సత్వర చెల్లింపు ప్రోత్సాహకం (PRI) కూడా అందిస్తుంది. దీని కారణంగా రైతులు ప్రతి లక్ష రూపాయలపై ప్రతి సంవత్సరం దాదాపు రూ.9,000 వడ్డీని ఆదా చేయవచ్చు.

మత్స్యకారులు, పాడి రైతులు కూడా ప్రయోజనం:

ఇదిలా ఉండగా, ప్రభుత్వం ఇప్పుడు ఈ సబ్సిడీ రుణ పరిమితిని రూ.3 లక్షల నుండి రూ.5 లక్షలకు పెంచింది. దీని వలన రైతులకు మాత్రమే కాకుండా మత్స్యకారులు, పాడి రైతులకు కూడా ప్రయోజనం చేకూరింది. ఇప్పటివరకు 7.7 కోట్లకు పైగా రైతులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందినట్లు కేంద్రం తెలిపింది.

వ్యవసాయ బడ్జెట్ కూడా పెరిగింది:

2013లో వ్యవసాయ బడ్జెట్ కేవలం రూ.21,500 కోట్లు మాత్రమేనని, 2024 నాటికి దానిని రూ.1.22 లక్షల కోట్లకు పెంచామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు.

ఇది కూడా చదవండి: Air Conditioner: మీరు ఇలా చేస్తే ఏసీ విద్యుత్‌ బిల్లు సగానికి తగ్గించుకోవచ్చు.. కేంద్రం కీలక సూచన

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి