Hotel Bed: హోటళ్లలో తెల్లటి బెడ్‌షీట్లనే ఎందుకు వేస్తారో తెలుసా? అసలు కారణం ఇదే!
Hotel Bed: హోటళ్లలో వైట్ బెడ్ షీట్లు ఉండటం వల్ల మనుషుల మానసిక ఆలోచన విధానంలో కూడా ఆసక్తికరమైన కారణాలు ఉన్నాయి. సాధారణంగా తెలుపు రంగును పరిశుభ్రతకు చిహ్నంగా భావిస్తారనే విషయం అందరికి తెలిసిందే. ఒక అతిథి హోటల్‌కు వచ్చినప్పుడు తెల్లటి పరుపులు..

మీరు ఎప్పుడైనా హోటల్ లేదా లాడ్జీలకు వెళ్లి రూమ్ తీసుకున్నప్పుడు బెడ్‌పై తెల్లటి బెడ్‌షీట్ ఉండటం చూసే ఉంటారు. అలాగే దిండు కవర్లు కూడా తెల్లటివి కనిపిస్తాయి. అయితే మీరు హోటల్, లాడ్జిలలె బస చేసినప్పుడు బెడ్‌పై తెల్లటి బెడ్ షీట్, తెల్లటి దిండు కవర్లు ఎందుకు ఉంటాయో మీరెప్పుడైనా గమనించారా? దీని వెనుక కూడా కారణాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.
హోటళ్లలో వైట్ బెడ్ షీట్లు ఉండటం వల్ల మనుషుల మానసిక ఆలోచన విధానంలో కూడా ఆసక్తికరమైన కారణాలు ఉన్నాయి. సాధారణంగా తెలుపు రంగును పరిశుభ్రతకు చిహ్నంగా భావిస్తారనే విషయం అందరికి తెలిసిందే. ఒక అతిథి హోటల్‌కు వచ్చినప్పుడు తెల్లటి పరుపులు, బెడ్‌షీట్లు, దిండ్లు చూసినప్పుడు, అతను పరిశుభ్రమైన వాతావరణాన్ని అనుభవిస్తాడు. తెల్లటి బెడ్‌షిట్, తెల్లటి దిండు కవర్లు కనిపించగానే మనిషి ఆలోచన విధానంలో మార్పు కనిపిస్తుంటుంది. అలాగే పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇచ్చేలా ఇలాంటివి ఏర్పాటు చేస్తారు.
మరకలు సులభంగా గుర్తించవచ్చు!
తెల్లటి వస్త్రంపై ఏదైనా మురికి, మరకలు లేదా వెంట్రుకలు సులభంగా గుర్తించవచ్చు. అందుకే శుభ్రతకు సంబంధించిన ఏ నిర్లక్ష్యం చేసినా సులభంగా కనిపిస్తుంది. అంతేకాదు.. అలా కనిపించినప్పుడు మనకే అశుభ్రంగా అనిపించి.. త్వరగా శుభ్రం చేసేస్తాము.
హోటల్‌లో తెల్లటి బెడ్ షీట్లు చూసినప్పుడు వచ్చిన అతిథులకు గది పూర్తిగా శుభ్రం ఉందనే నమ్మకం కలుగుతుంది. ఎటువంటి మరకలు లేదా పాత దుస్తులు వంటివి లేవనే అభిప్రాయం ఆ అతిథులలో కలుగుతుంది. దీంతో తెల్లటి వస్త్రాలు చూసే సరికి అతిథులకు మంచి వాతావరణం ఉన్నట్లు కనిపిస్తుంది. అలాగే ఆలోచన విధానంలో కూడా మార్పు కనిపిస్తుంటుంది. దీంతో హోటల్ గానీ, లాడ్జి గానీ చేరుకున్నప్పుడు మంచి వాతావరణం, మనస్సు ప్రశాంతత కల్పిస్తుంది.
మానసిక ప్రశాంతత:
అంతే కాకుండా.. తెలుపు రంగు ఒత్తిడిని తగ్గిస్తుంది. చాలా రోజుల ప్రయాణం తర్వాత వారు హోటల్ గదికి చేరుకున్నప్పుడు.. వారు విశ్రాంతి, సౌకర్యాన్ని కోరుకుంటారు. తెల్లటి మంచం వారికి మానసిక ప్రశాంతతను ఇస్తుంది. ఇది వారికి బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. అలాగే తెల్లటి బెడ్‌షీట్ ఉండటం వల్ల రంగులు పోతాయనే భయం కూడా ఉండదు. అన్నింటిని కూడా ఒకేసారి ఉతకవచ్చు. హోటల్ పరిశ్రమలో ఇది లాండ్రీ, నిర్వహణను సులభతరం చేయడంతో పాటు.. చౌకగా చేస్తుంది. అదనంగా, తెల్లటి బెడ్‌షీట్లను బ్లీచింగ్ చేయడం ద్వారా మరకలను సులభంగా తొలగించవచ్చు.
స్వచ్ఛతను సూచిస్తాయి:
అవి శుభ్రత, స్వచ్ఛతను సూచిస్తాయి. గది సౌందర్యాన్ని పెంచుతాయి. తెల్లని వస్త్రాలు కూడా లగ్జరీ, ఉన్నత స్థాయి వసతితో ముడిపడి ఉన్నాయి. తెల్లటి వస్త్రాలు గది ప్రశాంతతకు నిలయంగా మారుతుంది. గది విశాలంగా కనిపించేలా చేస్తుంది. చాలా మంది వినియోగదారులు తెల్లటి పరుపును లగ్జరీ, అధిక నాణ్యతకు చిహ్నంగా భావిస్తారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి