Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Air Conditioner: మీరు ఇలా చేస్తే ఏసీ విద్యుత్‌ బిల్లు సగానికి తగ్గించుకోవచ్చు.. కేంద్రం కీలక సూచన

Air Conditioner: ఏసీ ఫ్యాక్టరీ డిఫాల్ట్ సెట్టింగ్‌ను వినియోగదారు స్వయంగా మార్చుకోవచ్చని BEE తెలిపింది. విద్యుత్ ఆదా, దేశ అభివృద్ధి లక్ష్యాన్ని చేరుకోవడంలో ఈ చిన్న అడుగు ముఖ్యమైన పాత్ర పోషించగలదని, ప్రజలు దీన్ని చేయమని ప్రోత్సహిస్తున్నారు. ప్రతి ఇంటి ఎయిర్‌ కండీషనర్‌..

Air Conditioner: మీరు ఇలా చేస్తే ఏసీ విద్యుత్‌ బిల్లు సగానికి తగ్గించుకోవచ్చు.. కేంద్రం కీలక సూచన
Follow us
Subhash Goud

|

Updated on: Jun 08, 2025 | 1:25 PM

Air Conditioner: వేసవి కాలంలో పగటిపూట ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు చేరుకుంటుంది. అటువంటి పరిస్థితిలో ఎయిర్ కండిషనర్లు (AC) నిరంతరం పగలు, రాత్రి ఉపయోగిస్తుంటారు. కొందరైతే ఏ కాలంలోనైనా ఏసీ లేనిది నిద్రించరు. వారికి తప్పనిసరి ఏసీ కావాల్సిందే. దీని కారణంగా ప్రతి ఇంటి విద్యుత్ బిల్లు అనేక రెట్లు పెరుగుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని, భారత ప్రభుత్వం సామాన్య ప్రజలకు ఒక చిన్న మార్పు చేయాలని విజ్ఞప్తి చేసింది. ఇది విద్యుత్ వినియోగాన్ని తగ్గించడమే కాకుండా జేబుపై విద్యుత్ బిల్లు ప్రభావాన్ని కూడా తగ్గిస్తుంది.

ఇది కూడా చదవండి: Jio Offer: కేవలం రూ.895 ప్లాన్‌తో 336 రోజుల వ్యాలిడిటీ.. బెనిఫిట్స్‌ ఇవే..!

ప్రభుత్వం ఇచ్చే సలహా ఏమిటి?

బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (BEE) ప్రకారం.. మీరు మీ AC ఉష్ణోగ్రతను కేవలం 1°C పెంచితే మీరు దాదాపు 6% విద్యుత్తును ఆదా చేయవచ్చు. ప్రభుత్వం ఈ చర్యను ఖర్చుతో కూడుకున్నది. అలాగే పర్యావరణ అనుకూల పరిష్కారంగా భావిస్తుంది.

ఇవి కూడా చదవండి

AC ఉష్ణోగ్రత పెంచడం వల్ల ఎలా ప్రయోజనం ఉంటుంది?

BEE ప్రకారం.. ప్రజలు సాధారణంగా తమ ACలను 20–21°C వద్ద సెట్ చేసుకుంటారు. అయితే సౌకర్యవంతమైన ఉష్ణోగ్రత పరిధి 24–25°Cగా పరిగణిస్తారు. ఒక వ్యక్తి ACని 20°Cకి బదులుగా 24°C వద్ద నడుపుతుంటే విద్యుత్ వినియోగం 24% వరకు తగ్గుతుంది. దీనివల్ల గృహాల నెలవారీ విద్యుత్ బిల్లు చాలా వరకు తగ్గుతుంది.

భారతదేశంలోని 50% AC వినియోగదారులు మాత్రమే ఈ సలహాను పాటిస్తే, దేశంలో ప్రతి సంవత్సరం 10 బిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అవుతుందని BEE అంచనా వేసింది. దీని అర్థం సంవత్సరానికి రూ. 5,000 కోట్ల ఆదా, 8.2 మిలియన్ టన్నుల CO₂ ఉద్గారాలను తగ్గించడం. ఇది పర్యావరణానికి కూడా పెద్ద ఉపశమనం కలిగిస్తుంది.

ఇలా ఎందుకు జరుగుతుంది?

సాంకేతికంగా మీరు ACని కొంచెం ఎక్కువ ఉష్ణోగ్రతకు (ఉదాహరణకు 26°C) సెట్ చేసినప్పుడు ఆ ఉష్ణోగ్రత త్వరగా ఏర్పడుతుంది. అలాగే ఏసీ కంప్రెసర్ ఆగిపోతుంది. ఇది విద్యుత్ వినియోగాన్ని తగ్గిస్తుంది. ఉదాహరణకు గది తలుపులు, కిటికీలు మూసివేయబడి ఉంటే మీరు ACని 8 గంటలు నడిపి 26°Cకి సెట్ చేస్తే, AC కంప్రెసర్ 5 గంటలు లేదా అంతకంటే తక్కువసేపు మాత్రమే నడుస్తుంది.

మీరు ఫ్యాక్టరీ సెట్టింగ్‌లను కూడా మార్చవచ్చు

ఏసీ ఫ్యాక్టరీ డిఫాల్ట్ సెట్టింగ్‌ను వినియోగదారు స్వయంగా మార్చుకోవచ్చని BEE తెలిపింది. విద్యుత్ ఆదా, దేశ అభివృద్ధి లక్ష్యాన్ని చేరుకోవడంలో ఈ చిన్న అడుగు ముఖ్యమైన పాత్ర పోషించగలదని, ప్రజలు దీన్ని చేయమని ప్రోత్సహిస్తున్నారు. ప్రతి ఇంటి ఎయిర్‌ కండీషనర్‌ ఉష్ణోగ్రతను కొద్దిగా పెంచితే విద్యుత్ బిల్లును తగ్గించవచ్చు.

ఇది కూడా చదవండి: Brain Tumour: నిద్రపోతున్నప్పుడు ఈ 5 లక్షణాలు కనిపిస్తు బ్రెయిన్ ట్యూమర్ సంకేతాలు!

ఇది కూడా చదవండి: Lifestyle: కండోమ్ వాడిన తర్వాత కూడా HIV వస్తుందా?

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఒక్కసారిగా కుప్పకూలిన మహిళ..అరగంట తర్వాత వీడియో
ఒక్కసారిగా కుప్పకూలిన మహిళ..అరగంట తర్వాత వీడియో
మహిళలకు శుభవార్త.. అసలు విషయం ఏంటో వీడియో చూసేయ్యండి వీడియో
మహిళలకు శుభవార్త.. అసలు విషయం ఏంటో వీడియో చూసేయ్యండి వీడియో
పెళ్లి రోజు వధువు షాకింగ్‌ ట్విస్ట్‌.. బిత్తరపోయిన కుటుంబ సభ్యులు
పెళ్లి రోజు వధువు షాకింగ్‌ ట్విస్ట్‌.. బిత్తరపోయిన కుటుంబ సభ్యులు
కౌగిలించుకుంటే కాసుల పంట ఆ దేశంలో వినూత్న ట్రెండ్‌ వీడియో
కౌగిలించుకుంటే కాసుల పంట ఆ దేశంలో వినూత్న ట్రెండ్‌ వీడియో
పచ్చగడ్డిపై చెప్పుల్లేకుండా నడవండి.. ఫలితం మీరే చూడండి వీడియో
పచ్చగడ్డిపై చెప్పుల్లేకుండా నడవండి.. ఫలితం మీరే చూడండి వీడియో
బందర్‌లో దృశ్యం మార్క్‌ క్రైమ్‌ కహానీ..భర్త హత్యకు శ్రీమతి స్కెచ్
బందర్‌లో దృశ్యం మార్క్‌ క్రైమ్‌ కహానీ..భర్త హత్యకు శ్రీమతి స్కెచ్
భారత్‌కు వచ్చేసిన స్టార్‌లింక్‌... మరింత చౌకగా హైస్పీడ్‌ ఇంటర్నెట
భారత్‌కు వచ్చేసిన స్టార్‌లింక్‌... మరింత చౌకగా హైస్పీడ్‌ ఇంటర్నెట
హనీమూన్‌లో విషాదం.. రైలు ఎక్కబోతూ అనంతలోకాలకు వీడియో
హనీమూన్‌లో విషాదం.. రైలు ఎక్కబోతూ అనంతలోకాలకు వీడియో
యజమాని కోసం కుక్క ప్రాణత్యాగం.. 26 సార్లు పాముకాట్లు వీడియో
యజమాని కోసం కుక్క ప్రాణత్యాగం.. 26 సార్లు పాముకాట్లు వీడియో
70 ఏళ్లుగా సహజీవనం! ఎట్టకేలకు పెళ్లి చేసిన పిల్లలు వీడియో
70 ఏళ్లుగా సహజీవనం! ఎట్టకేలకు పెళ్లి చేసిన పిల్లలు వీడియో