Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Onions: ఉల్లిపాయలు కోసేటప్పుడు కంటి నుంచి నీళ్లు రావద్దంటే ఏం చేయాలి? అద్భుతమైన చిట్కాలు!

Onions: సహజంగా ఉల్లిపాయలు కోసేటప్పుడు కళ్ల నుంచి నీళ్లు రావడానికి ప్రధాన కారణంగా అందులో ఉండే ఎంజైమ్‌లు. ఉల్లిపాయను కోసినప్పుడు దానిలో ఉన్న ఈ వాయువులలో ఒకటి బయటకు వస్తుంది. దీని నుంచి దీనిని సై ప్రొపనెథియల్ ఆక్సైడ్ అంటారు. ఇది..

Onions: ఉల్లిపాయలు కోసేటప్పుడు కంటి నుంచి నీళ్లు రావద్దంటే ఏం చేయాలి? అద్భుతమైన చిట్కాలు!
Follow us
Subhash Goud

|

Updated on: Jun 09, 2025 | 7:24 AM

ప్రతి ఇంటింట్లో ఉల్లిపాయలు ఉండటం తప్పనిసరి. ఏ వంటకాల్లో ఉల్లిపాయలు తప్పనిసరి వాడుతుంటారు. అయితే ఉల్లిపాయలు కోసేటప్పుడు కంటి నుంచి నీళ్లు రావడం, కళ్లల్లో మంట ఉండటం అందరికి తెలిసిందే. ఉల్లిపాయలు కోసేటప్పుడు కంటి నుంచి నీళ్ల రావడంతో ఇబ్బందలుఉ పడుతుంటారు. మరి నీళ్లు రాకుండా, కంట్లో మంట రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? ఈ అద్భుతమైన ట్రిక్స్‌ ఉపయోగిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు.

కన్నీళ్లు ఎందుకు వస్తాయి?

సహజంగా ఉల్లిపాయలు కోసేటప్పుడు కళ్ల నుంచి నీళ్లు రావడానికి ప్రధాన కారణంగా అందులో ఉండే ఎంజైమ్‌లు. ఉల్లిపాయను కోసినప్పుడు దానిలో ఉన్న ఈ వాయువులలో ఒకటి బయటకు వస్తుంది. దీని నుంచి దీనిని సై ప్రొపనెథియల్ ఆక్సైడ్ అంటారు. ఇది కంటి పొరను ఇబ్బంది పెడుతుంది. దీని వల్ల కళ్ళ నుండి కన్నీళ్లు రావడం ప్రారంభమవుతుంది. కొన్ని హోమ్‌ రెమిడీస్‌ పాటిస్తే కంటి నీళ్లను నివారించవచ్చంటున్నారు నిపుణులు.

గాగుల్స్ వాడకం:

ఉల్లిపాయలు కోసేటప్పుడు మీరు గాగుల్స్ ఉపయోగించవచ్చు. కళ్లకు గాలి తగలకుండా ఉండే ప్రత్యేక రకం గాగుల్స్ ఇది. ఈ విధంగా వాయువు మీ కళ్ళకు చేరదు. దీని వల్ల ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్ల రావు.

ఇవి కూడా చదవండి

కాసేపు నీటిలో ఉంచడం:

ఉల్లిపాయను కోసే ముందు వాటిని నీటిలో కొంత సమయం నానబెట్టండి. దీనివల్ల సల్ఫర్ వాయువు తగ్గుతుంది. ఉల్లిపాయను కోసేటప్పుడు మీ కళ్ళు తక్కువగా ఏడుస్తాయి. కళ్లల్లో కూడా పెద్దగా మంట ఉండదు. ఉపాయ పొట్టు తీసిన తర్వాత మధ్యలో నుంచి రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత నీటిలో వేసి కాసేపు అలాగే ఉంచాలి. మీరు కనీసం 15 నుంచి 20 నిమిషాలు నీటిలో ఉంచండి. మీరు ఈ నీటిలో వైట్ వెనిగర్ కూడా వేయవచ్చు. ఇలా చేయడం వల్ల ఉల్లిపాయలోని ఎంజైమ్‌లు విడుదలై కళ్ల నుంచి నీళ్లు రావు.

ఫ్రిజ్‌లో ఉంచండి:

ఇక ఉల్లిపాయలు కోసేటప్పుడు నీళ్లు రాకుండా ఉండాలంటే వాటిని కోసే ముందు 20 నుంచి 25 నిమిషాల పాటు ఫ్రిజ్‌లో ఉంచడం ఉత్తమం. ఇలా చేయడం వల్ల ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లు రావు. ఎందుకంటే ఫ్రిజ్‌ల ఉంటే ఉల్లిపాయలు ఉండే ఎంజైమ్ ప్రభావం పెద్దగా ఉండదు. దీని కారణంగా కోసేటప్పుడు కంటి నుంచి నీళ్లు రావు.

పదునైన కత్తితో..

ఉల్లిపాయలు కోసేటప్పుడు ఎప్పుడు కూడా పదునైనా కత్తితో కోయడం మంచిది. మీరు పదునైన కత్తితో ఉల్లిపాయను కోసినప్పుడు ఉల్లిపాయ పొర కట్‌ అవుతుంది. దీంతో తక్కువ ఎంజైములు బయటకు వస్తాయి. ఉల్లి కణ గోడలు దెబ్బతిన్నప్పుడు. దాని నుంచి తక్కువ గ్యాస్ బయటకు వస్తుంది. అలాగే కళ్లు మండటం, నీళ్లు రావడం వంటి సమస్య తగ్గుతుంది. అలాగే ఉల్లిపాయలు కోసేటప్పుడు కొవ్వొత్తిని దగ్గర ఉంచుకుంటే, దాని నుంచి వచ్చే గ్యాస్ కొవ్వొత్తిలోకి వెళ్లి మీ కళ్ళు చికాకు పడవని కూడా కొందరు చెబుతారు.

ఉల్లిపాయ మీద వెనిగర్ రాయండి.

ఉల్లిపాయను కోసే ముందు దానిని వెనిగర్ లో కొంత సమయం ఉంచి, ఆపై కోయండి. వెనిగర్ లో యాసిడ్ ఉంటుంది. ఇది ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ సమ్మేళనాలను విచ్ఛిన్నం చేస్తుంది. ఇది ఉల్లిపాయ తీవ్రతను తగ్గిస్తుంది. ఉల్లిపాయను వెనిగర్ లో కనీసం 15-20 నిమిషాలు ఉంచండి.

ఇది కూడా చదవండి: Air Conditioner: మీరు ఇలా చేస్తే ఏసీ విద్యుత్‌ బిల్లు సగానికి తగ్గించుకోవచ్చు.. కేంద్రం కీలక సూచన

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కళ్ల ముందే స్నేహితుడు చనిపోయాడని పురుగుల మందు తాగాడు.. చివరకు..
కళ్ల ముందే స్నేహితుడు చనిపోయాడని పురుగుల మందు తాగాడు.. చివరకు..
ఈ విదేశీ పర్యటనతో చరిత్ర సృష్టించబోతున్న ప్రధాని మోదీ!
ఈ విదేశీ పర్యటనతో చరిత్ర సృష్టించబోతున్న ప్రధాని మోదీ!
టీమిండియా ఛీ కొట్టింది.. కట్‌చేస్తే సెంచరీతో సెలెక్టర్లకు కౌంటర్
టీమిండియా ఛీ కొట్టింది.. కట్‌చేస్తే సెంచరీతో సెలెక్టర్లకు కౌంటర్
మరో ఘోర విషాదం.. కేదార్‌నాథ్‌లో కుప్పకూలిన హెలికాఫ్టర్!
మరో ఘోర విషాదం.. కేదార్‌నాథ్‌లో కుప్పకూలిన హెలికాఫ్టర్!
పోలీసులా వచ్చి కాల్పులు జరిపిన దుండగుడు.. అమెరికాలో దారుణం..
పోలీసులా వచ్చి కాల్పులు జరిపిన దుండగుడు.. అమెరికాలో దారుణం..
రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు.. ఉరుములు, మెరుపులతో జోరు వానలు!
రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు.. ఉరుములు, మెరుపులతో జోరు వానలు!
అడవి శేష్‌కు వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ..
అడవి శేష్‌కు వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ..
భారత్ vs న్యూజిలాండ్ షెడ్యూల్ ఇదే.. అందరి చూపు ఆ ఇద్దరివైపే..!
భారత్ vs న్యూజిలాండ్ షెడ్యూల్ ఇదే.. అందరి చూపు ఆ ఇద్దరివైపే..!
ఎల్‌బీనగర్‌లో దారుణం.. స్పాట్‌లోనే ఇద్దరు సజీవదహనం
ఎల్‌బీనగర్‌లో దారుణం.. స్పాట్‌లోనే ఇద్దరు సజీవదహనం
మరికొన్ని గంటల్లోనే ఇంటర్‌ సప్లిమెంటరీ 2025 ఫలితాలు.. లింక్ ఇదే!
మరికొన్ని గంటల్లోనే ఇంటర్‌ సప్లిమెంటరీ 2025 ఫలితాలు.. లింక్ ఇదే!