AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jio: మరో సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతున్న అంబానీ.. జియో సర్‌ప్రైజ్‌తో మార్కెట్ షేక్!

Mukesh Ambani: ఇప్పుడు రిలయన్స్‌ జియో మార్కెట్లో సంచలన సృష్టించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈసారి లక్ష్యం భారతదేశంలో స్మార్ట్‌ఫోన్ పరిశ్రమపైనే. ఫోన్ పరిశ్రమలో ముఖ్యాంశాలుగా నిలిచిన ముఖేష్ అంబానీ నేతృత్వంలోని కంపెనీ ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ విభాగంపై దృష్టి సారించింది. కంపెనీ గతంలో..

Jio: మరో సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతున్న అంబానీ.. జియో సర్‌ప్రైజ్‌తో మార్కెట్ షేక్!
Subhash Goud
|

Updated on: Jun 09, 2025 | 9:13 AM

Share

ప్రస్తుతం స్మార్ట్‌ ఫోన్‌ ప్రపంచం కొనసాగుతోంది. రోజురోజుకు మార్కెట్లో సరికొత్త మొబైళ్లు అందుబాటులోకి వస్తున్నాయి. అత్యాధునిక ఫీచర్స్‌ను ఉపయోగించి బడ్జెట్‌ ధరల్లో విడుదల చేస్తున్నాయి మొబైల్‌ తయారీ కంపెనీలు. ఇప్పుడు రిలయన్స్‌ జియో మార్కెట్లో సంచలన సృష్టించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈసారి లక్ష్యం భారతదేశంలో స్మార్ట్‌ఫోన్ పరిశ్రమపైనే. 4G, 5G, ఫీచర్ ఫోన్ పరిశ్రమలో ముఖ్యాంశాలుగా నిలిచిన ముఖేష్ అంబానీ నేతృత్వంలోని కంపెనీ ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ విభాగంపై దృష్టి సారించింది. కంపెనీ గతంలో అనేక స్మార్ట్‌ఫోన్‌లను కూడా విడుదల చేసినప్పటికీ, జియో ఫోన్ 5G వార్తల్లో నిలుస్తోంది ఎందుకంటే ఇది సాధారణంగా రూ.30,000 లేదా అంతకంటే ఎక్కువ ధర ఉన్న ఫోన్‌లలో మాత్రమే కనిపించే ఫీచర్స్‌ కలిగి ఉంది. ఇది రూ. 2500 ధరల్లో అందుబాటులో ఉండవచ్చని తెలుస్తోంది.

200MP కెమెరా

వస్తున్న లీకుల ప్రకారం.. జియో ఫోన్ 5Gలో 200-మెగాపిక్సెల్ వెనుక కెమెరా ఉండవచ్చని తెలుస్తోంది. ఇది చాలా హై-ఎండ్ ఫోన్‌లు మాత్రమే కలిగి ఉంటుంది. దీని అర్థం జియో ఫోన్ 5G మంచి నాణ్యతతో కూడిన ఫోటోలు తీయగలదని తెలుస్తోంది. దీనికి 32MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఇది ఈ రోజుల్లో చాలా మిడ్-రేంజ్ ఫోన్‌ల కంటే ఎక్కువ. ఈ ఫోన్‌కు DSLR-లాంటి” కెమెరా ఉండవచ్చు.

ఇవి కూడా చదవండి

బ్యాటరీ కెపాసిటీ:

జియో ఫోన్ 5G 7200mAh బ్యాటరీతో వస్తుందని చెబుతున్నారు. ఇప్పుడు రూ. 10,000 లోపు ఫోన్‌లో మీరు అరుదుగా చూసే బ్యాటరీ పరిమాణం ఇది. ఇది పవర్ బ్యాంక్‌లో మీరు ఆశించే బ్యాటరీ పవర్. ఇది 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుందని వ్యాపిస్తున్న పుకార్ల ద్వారా తెలుస్తోంది. విద్యుత్ సరిగ్గా ఉండని ప్రాంతాల్లో నివాసించే వారికి, సమయానికి ఛార్జర్‌ను కూడా తీసుకెళ్లలేని వారికి ఎంతో ఉపయోగంగా ఉండవచ్చు.

మీడియాటెక్ డైమెన్సిటీ చిప్‌

ఈ జియో ఫోన్ 5G మీడియాటెక్ డైమెన్సిటీ చిప్‌తో నడుస్తుందని, ఇది రోజువారీ పనులు, యూట్యూబ్, లైట్ గేమింగ్, మల్టీ టాస్కింగ్‌కు సరిపోతుందని టెక్‌ నిపుణులు భావిస్తున్నారు. మోడల్‌ను బట్టి RAM 16GB వరకు, స్టోరేజ్ 512GB వరకు ఉండవచ్చని తెలుస్తోంది.

డిస్‌ప్లే సైజ్‌..

ఇక ఈ స్మార్ట్‌ఫోన్ 5.5-అంగుళాల డిస్‌ప్లేను 120Hz రిఫ్రెష్ రేట్‌తో కలిగి ఉండే అవకాశం ఉంది. ఇది ఈ ధర శ్రేణికి అసాధారణం. ఇందులో పూర్తి 5G సపోర్ట్, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ 5.2 మరియు రివర్స్ ఛార్జింగ్ కూడా ఉంటాయట. దీని ద్వారా మీరు ఇతర ఫోన్‌లను ఛార్జ్ చేయవచ్చు.

జియో నుంచి వచ్చే ఈ ఫోన్‌లో ఈ ఫీచర్స్‌ అన్ని ఉన్నట్లయితే స్మార్ట్‌ఫోన్ మార్కెట్ స్వరూపాన్నే మారుస్తుంది. ఇక బేస్ మోడల్ ధర రూ.4,999, రూ.5,999 మధ్య ఉండవచ్చని వినియోగదారులు భావిస్తున్నారు. కానీ రిబేట్, ఎక్స్ఛేంజ్ లేదా డేటా బండిల్ డీల్స్‌తో ఇది నిజంగా రూ.999 , రూ.1,199 మధ్య తగ్గవచ్చు. అది జియో ఫోన్ 5Gని హై-ఎండ్ స్పెక్స్‌తో చౌకైన 5G ఫోన్‌గా చేస్తుంది. ఇది భారతదేశ బడ్జెట్ ఫోన్ మార్కెట్‌ను షేక్‌ చేయవచ్చు.

ఇది కూడా చదవండి: Air Conditioner: మీరు ఇలా చేస్తే ఏసీ విద్యుత్‌ బిల్లు సగానికి తగ్గించుకోవచ్చు.. కేంద్రం కీలక సూచన

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి