AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad Metro Rail: ఆర్టీసీ ఉచితం ప్రయాణం అమలు వల్ల మెట్రోకు ఇంత ఎఫెక్ట్ ఉందా..?

ప్రస్తుతం నగరంలో ఎండ్ టూ ఎండ్ మెట్రో స్టేషన్స్, ఇంటర్ చేంజ్ మెట్రో స్టేషన్ వద్ద తప్ప మిగాతా స్టేసన్స్ ఖాళీలుగా దర్శనమిస్తున్నాయి. దీనికి తోడూ మెట్రో స్టేషన్స్, రైళ్లలో లేడీస్ రష్ కంటే మగవాళ్లే ఎక్కువగా కనిపిస్తున్నారు. మెట్రో స్టేషన్స్ వరకు, అలాగే మెట్రో స్టేషన్స్ నుండి ఆఫీస్ లకు వెళ్లే వారు ఆర్టీసీ ప్రీ జర్నీనీ వాడుకుంటున్నారు.

Hyderabad Metro Rail: ఆర్టీసీ ఉచితం ప్రయాణం అమలు వల్ల మెట్రోకు ఇంత ఎఫెక్ట్ ఉందా..?
Rtc Effect Onhyderabad Metro Rail
Peddaprolu Jyothi
| Edited By: Balaraju Goud|

Updated on: Dec 16, 2023 | 2:52 PM

Share

తెలంగాణా వ్యాప్తంగా ఆర్టీసీ ఉచిత ప్రయాణానికి మహిళల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. హైద్రాబాద్‌లో ఎక్కువగా స్టూడెంట్స్, ఉద్యోగస్తులతో ఆర్టీసీ బస్సుల్లో కిక్కిరిసినంత రద్దీ కనిపిస్తోంది. ఇక ఆర్టీసీల్లో ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో, ఆ ఎఫెక్ట్ కొంత మెట్రో రైళ్లపై కనిపిస్తోంది. లాంగ్ జర్నీ చేసే వాళ్లు తప్పా, ఎక్కువ మంది ఆర్టీసీ ఫ్రీ సర్వీస్‌లను వాడుకుంటున్నారు.

గ్రేటర్ హైద్రాబాద్ వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు లేడీస్ తో కిటకిటలాడుతున్నాయి. ప్రధాన రూట్లలో తిరిగే ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో రష్ కనిపిస్తోంది. షాపింగ్ ఏరియాలు, గుళ్లు, టూరిజం స్పాట్‌లు, హాస్పిటల్స్, ఆఫీస్ రూట్లలో వెళ్లే బస్సుల్లో లేడీస్ రద్దీ ఉంటోంది. ఫ్రీ స్కీమ్ అమలైనప్పటి నుండి బస్సుల్లో సీట్లు దొరకడంలేదంటున్నారు ప్రయాణికులు. ప్రధాన ఏరియాలను కలుపుతూ వెళ్లే బస్సులన్నీ మహిళా ప్రయాణికులతో రద్దీ గా కనిపిస్తున్నాయి.

ఇక హైద్రాబాద్ మహానగరంలో పబ్లిక్ నుండి మంచి ఆదరణ పొందుతున్న మెట్రో రైల్‌పై ఆర్టీసీ ఫ్రీ స్కీమ్ ప్రభావం కనిపిస్తోంది. నాన్ పీక్ అవర్స్ లో మెట్రో రైళ్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. ఉదయం, సాయంత్రం ఆఫీస్ టైమింగ్స్ లో మాత్రం మెట్రో బోలు ఫుల్ అవుతున్నాయి. అందులోనూ ఆడవాళ్ల కంటే మగవారి సంఖ్యే ఎక్కువ ఉంటోంది. గతంలో రోజు 5లక్షల వరకు మెట్రో రైడర్ షిప్ నమోదు అయ్యింది. అయితే, ఆర్టీసీలో మహిళలకు ఉచితం ఇవ్వడంతో కొంత వుమెన్ క్రౌడ్ మెట్రో కంటే ఆర్టీసీ వైపు మొగ్గు చూపుతున్నారు. దాదాపు 12 వందల నుండి 15 వందల వకు సేవ్ అవుతుందంటున్నారు. మరికొందరు మెట్రో స్టేషన్స్ వరకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితం ప్రయాణం వినియోగించుకుంటూనే, రోడ్ ట్రాఫిక్ ఇబ్బందులు ఫేస్ చేయకుండా మెట్రోను ఆశ్రయిస్తున్నారు అమ్మాయిలు. అయితే గతం కంటే కొంత లేడీస్ రష్ తగ్గిందని, కూర్చోవడానికి మెట్రో లో సీట్లు దొరుకుతున్నాయంటున్నారు ఇతర ప్రయాణికులు.

ఆర్టీసీ ఉచితం ప్రయాణం అమలు వల్ల మెట్రో కు అంత ఎఫెక్ట్ ఉండదని, మెట్రో రైళ్ల క్రౌడ్ సెపరేట్ అంటున్నారు హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు. ప్రస్తుతానికి ఆర్టీసీ రద్దీ మెట్రో రైళ్లపై ఎఫెక్ట్ చెప్పలేమని, మరో కొద్దీ రోజులు తర్వాత మెట్రో డైలీ రైడర్ షిప్‌పై క్లారిటీ వస్తుందంటున్నారు. సాధరణంగా సిటిలో ఐటీ, సాఫ్ట్ వేర్ ఎంప్లాయిస్ ఎక్కువగా మెట్రో జర్నీకి అలవాటు పడ్డారు. దీంతో లాంగ్ జర్నీ చేసే వాళ్లు, ఉప్పల్, ఎల్బీనగర్ నుండి హైటెక్ సిటి, రాయదుర్గం, కూకట్‌పల్లి ఏరియాలకు వెళ్లే వారు మెట్రోలో ప్రయాణిస్తున్నారు. ముఖ్యంగా పొల్యూషన్, ట్రాఫిక్ ఫ్రీ జర్నీ కావడం, బేగంపేట్, పంజాగుట్ట, అమీర్ పేట్, లక్డి కా పూల్, లాంటి ట్రాఫిక్ ఏరియాలను దాటుకొని రావడానికి మెట్రో నే బెటర్ అంటున్నారు. మరికొందరు లేడీస్ అయితే సొంత వాహనాలను పక్కన పెట్టి ఆర్టీస్ సర్వీస్ ను వాడుకుంటున్నారు. మెట్రో లో వెళ్లే వారు కూడా ఫ్రీ జర్నీనీ ఉపయోగించుకుంటున్నారు. అయితే పీక్ అవర్స్ లో బస్సుల సంఖ్య పెంచాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది.

ప్రస్తుతం నగరంలో ఎండ్ టూ ఎండ్ మెట్రో స్టేషన్స్, ఇంటర్ చేంజ్ మెట్రో స్టేషన్ వద్ద తప్ప మిగాతా స్టేసన్స్ ఖాళీలుగా దర్శనమిస్తున్నాయి. దీనికి తోడూ మెట్రో స్టేషన్స్, రైళ్లలో లేడీస్ రష్ కంటే మగవాళ్లే ఎక్కువగా కనిపిస్తున్నారు. మెట్రో స్టేషన్స్ వరకు, అలాగే మెట్రో స్టేషన్స్ నుండి ఆఫీస్ లకు వెళ్లే వారు ఆర్టీసీ ప్రీ జర్నీనీ వాడుకుంటున్నారు. మరో వారం పది రోజుల్లో మెట్రో రైళ్లలో డైలీ రైడర్ షిప్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…