Akbaruddin Owaisi: ఫ్రీ బస్ సర్వీసును స్వాగతిస్తున్నాం.. ఆ పార్టీలు ఒక్క ముస్లిం అభ్యర్థిని గెలిపించలేకపోయాయి..
తెలంగాణ శాసనసభ సమావేశాలు తొలిరోజే మాటల తూటాలు పేలాయి.. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ మధ్య వాడీవేడిగా వాదనలు జరిగాయి. ఈ క్రమంలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు ఒక్క ముస్లిం అభ్యర్థిని కూడా గెలిపించుకోలేకపోయాయంటూ విమర్శించారు అక్బరుద్దీన్.. రిజర్వేషన్ల అంశం సహా ముస్లింలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ శాసనసభ సమావేశాలు తొలిరోజే మాటల తూటాలు పేలాయి.. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ మధ్య వాడీవేడిగా వాదనలు జరిగాయి. ఈ క్రమంలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు ఒక్క ముస్లిం అభ్యర్థిని కూడా గెలిపించుకోలేకపోయాయంటూ విమర్శించారు అక్బరుద్దీన్.. రిజర్వేషన్ల అంశం సహా ముస్లింలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎంఐఎంకి ఎవరితోనూ పొత్తు లేదని స్పష్టం చేశారు. మహిళలకు ఉచిత బస్ సర్వీసును స్వాగతిస్తున్నట్లు అక్బరుద్దీన్ పేర్కొన్నారు. కాంగ్రెస్ వెంటనే 6 గ్యారంటీల అమలుకు కృషి చేయాలంటూ అక్బరుద్దీన్ సూచించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉర్ధూ ప్రస్తావన లేదని.. ఇమామ్‌లకు కాంగ్రెస్ 12 వేలు కాదు..15 వేలు ఇవ్వాలని.. అక్బరుద్దీన్ డిమాండ్ చేశారు. ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలన్నారు.
ఆరోగ్యశ్రీ పథకంపై గైడ్‌లైన్స్ చేయలేదని అక్బరుద్దీన్ వ్యాఖ్యానించారు. ఇప్పటివరకూ ఆరోగ్యశ్రీ కొత్త పథకం ఎక్కడా అమలు కాలేదన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీపై అక్బరుద్దీన్ వ్యాఖ్యలకు సీఎం రేవంత్ కౌంటర్ ఇచ్చారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంపై మొదటి కేబినెట్‌లో చర్చించామన్నారు. ఆరోగ్యశ్రీ పై అన్ని సమగ్రంగా చర్చించి నిర్ణయం తీసుకున్నామంటూ తెలిపారు.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
