Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: దేవుని ముందు అంతా సమానమే.! మసీదుల్లోకి మహిళలను అనుమతించాలి-హైకోర్టు.

Telangana: దేవుని ముందు అంతా సమానమే.! మసీదుల్లోకి మహిళలను అనుమతించాలి-హైకోర్టు.

Anil kumar poka

|

Updated on: Dec 16, 2023 | 4:33 PM

ప్రార్థనా స్థలాల వద్ద లింగ వివక్ష చూపరాదని, దేవుని ముందు స్త్రీ పురుషులందరూ సమానమేనని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. శని శింగనాపూర్‌, హాజీ అలీ దర్గా, శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని అనుమతిస్తూ న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పుల పరంపరలో రాష్ట్ర హైకోర్టు ముస్లిం మహిళలకు సంబంధించి ఓ సంచలన తీర్పు వెలువరించింది. మసీదులు, జషన్‌లతోపాటు ప్రార్థనా మందిరాల్లోకి మహిళలను అనుమతించాలని వక్ఫ్‌ బోర్డును ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.

ప్రార్థనా స్థలాల వద్ద లింగ వివక్ష చూపరాదని, దేవుని ముందు స్త్రీ పురుషులందరూ సమానమేనని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. శని శింగనాపూర్‌, హాజీ అలీ దర్గా, శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని అనుమతిస్తూ న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పుల పరంపరలో రాష్ట్ర హైకోర్టు ముస్లిం మహిళలకు సంబంధించి ఓ సంచలన తీర్పు వెలువరించింది. మసీదులు, జషన్‌లతోపాటు ప్రార్థనా మందిరాల్లోకి మహిళలను అనుమతించాలని వక్ఫ్‌ బోర్డును ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. మసీదులు, జషన్‌లు తదితర పవిత్ర ప్రదేశాల్లోకి ప్రార్థనలు చేసుకొనేందుకు షియా ముస్లిం మహిళలను అనుమతించకపోవడాన్ని సవాలు చేస్తూ.. అంజుమన్‌ ఏ అలావి, షియా ఇమామియా ఇత్నా అసారి అక్బరీ సొసైటీ కార్యదర్శి ఆస్మా ఫాతిమా పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ నగేశ్‌ భీమపాక సోమవారం విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది వాదనలు వినిపిస్తూ ముతవలీల కమిటీ కేవలం షియా తెగకు చెందిన మహిళలను అనుమతించడంలేదన్నారు. మహిళలను ప్రార్థనా మందిరాల్లోకి అనుమతించాలని వక్ఫ్‌బోర్డుకు వినతిపత్రాలు ఇచ్చినా స్పందించడంలేదని తెలిపారు.

వక్ఫ్‌బోర్డు తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఖురాన్‌ ప్రకారమే ఎవరికైనా ప్రార్థనా మందిరాల్లోకి అనుమతి ఉంటుందని చెప్పారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ మహిళల పట్ల వివక్ష ప్రదర్శించడం తగదని, వారికి రాజ్యాంగం సమాన హకులను కల్పించిందని చెప్పారు. రాజ్యాంగం కల్పించిన హకులను హరించడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఖురాన్‌, బైబిల్‌, తోరా, భగవద్గీత, ఒక యోగి ఆత్మకథ తదితర గ్రంథాల్లోని అంశాలతోపాటు స్వామి వివేకాననంద మహిళల గురించి పేరొన్న పలు అంశాలను న్యాయమూర్తి చదివి వినిపించారు. మహిళలను ప్రార్థనలు చేసుకొనేందుకు అనుమతించకపోవడాన్ని తప్పుపట్టారు. మహిళల పట్ల వివక్ష తగదని, రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాయరాద్దని అన్నారు. షియా మహిళలను ప్రార్థనా మందిరాల్లోకి అనుమతించాలని ముతవలీ కమిటీని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. నిర్దిష్టమైన కొద్దిరోజులు మినహా మహిళలు నిరభ్యంతరంగా ప్రార్థనా స్థలాల్లోకి వెళ్లి ప్రార్థనలు చేసుకోవచ్చని స్పష్టంచేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నగేశ్‌ భీమపాక సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. మహిళలను నిషేధించడానికి గల కారణాలేమిటో పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని వక్ఫ్‌బోర్డును ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.