Civil Supplies: కోట్ల విలువైన ప్రభుత్వ ధాన్యం మటుమాయం.. సివిల్ సప్లైస్ అధికారుల తనిఖీలు

రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని బియ్యంగా మార్చేందుకు మిల్లర్లకు వాటిని ఇస్తుంటారు. ఈ సీఎంఆర్‎కి గడువు పెడతారు. ఈ డిసెంబర్‌ 31లోపు మిల్లర్లంతా 'కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌-సీఎంఆర్'ను అప్పగించాల్సి ఉంటుంది. కొన్ని జిల్లాల్లో ఇది 80 నుంచి 90 శాతం వరకూ పూర్తయ్యింది. కొన్ని చోట్ల మిల్లర్లు సరైన లెక్కలు చెప్పకపోవడంతో సీఎంఆర్‎ టార్గెట్ చేరుకోవడం అనుమానంగానే ఉంది.

Civil Supplies: కోట్ల విలువైన ప్రభుత్వ ధాన్యం మటుమాయం.. సివిల్ సప్లైస్ అధికారుల తనిఖీలు
Civil Supplies Officials
Follow us
Srikar T

|

Updated on: Dec 16, 2023 | 1:59 PM

రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని బియ్యంగా మార్చేందుకు మిల్లర్లకు వాటిని ఇస్తుంటారు. ఈ సీఎంఆర్‎కి గడువు పెడతారు. ఈ డిసెంబర్‌ 31లోపు మిల్లర్లంతా ‘కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌-సీఎంఆర్’ను అప్పగించాల్సి ఉంటుంది. కొన్ని జిల్లాల్లో ఇది 80 నుంచి 90 శాతం వరకూ పూర్తయ్యింది. కొన్ని చోట్ల మిల్లర్లు సరైన లెక్కలు చెప్పకపోవడంతో సీఎంఆర్‎ టార్గెట్ చేరుకోవడం అనుమానంగానే ఉంది. ఈ క్రమంలోనే నిజామాబాద్‌లో సివిల్ సప్లైస్ అధికారులు మిల్లుల్లో తనిఖీలు చేస్తున్నారు. బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ బంధువుల రైస్‌ మిల్లుల్లో 70 కోట్ల రూపాయల విలువైన సీఎంఆర్‎ ధాన్యం మాయమైనట్టు గుర్తించారు.

సీఎంఆర్‎ కోసం ప్రభుత్వం ఇచ్చిన ధాన్యం ఎలా పక్కదారి పట్టిందనేదానిపై ఇప్పుడు విచారణ జరుగుతోంది. ఏకంగా 33 వేల టన్నుల ధాన్యానికి లెక్కలు లేవంటే ఏం జరిగిందనేది చర్చనీయాంశమైంది. మిల్లర్లపై కేసులు పెడతారా.. రికవరీకి ఏం చేస్తారు అనేది తెలియాల్సి ఉంది.

షకీల్‌ బంధువులకు చెందిన మిల్లులకు 2021-22 యాసింగి సీజన్‌కి 26 వేల 732 టన్నుల ధాన్యం ఇచ్చారు. 2022-23 వానాకాలం సీజన్‌లో మరో 24 వేల టన్నుల ధాన్యం కేటాయించారు. కొన్ని సమస్యల కారణంగా మిల్లులు పూర్తి స్థాయిలో నడవడం లేదని చెప్తూ.. ఆ ధాన్యాన్ని ఇతర మిల్లులకు పంపుతున్నట్టు పౌరసరఫరాల శాఖకు లేఖ పంపారు. ఐతే.. అక్కడి నుంచి కూడా సివిల్‌సప్లైస్‌కి సీఎంఆర్‎ చేరలేదు. దీంతో.. ఈ మిల్లులకు సంబంధించిన గోడౌన్లలో తనిఖీలు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..