Dr. Boora Narsaiah Humanity: మానవత్వం చాటుకున్న మాజీ ఎంపీ.. వ్యక్తిని కాపాడిన డాక్టర్ బూర నర్సయ్య గౌడ్

భువనగిరి మాజీ ఎంపీ, ప్రస్తుత బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ స్వయానా ఒక డాక్టర్. రాజకీయ నాయకుడిగానే కాదు డాక్టర్‌గా ఎందరికో వైద్యం అందించారు. తాజాగా ఆయనలో మరోసారి డాక్టర్ బయటికి వచ్చారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఒక వ్యక్తి ప్రాణం కాపాడి అందరిచేత ప్రశంసలు అందుకుంటున్నారు.

Dr. Boora Narsaiah Humanity: మానవత్వం చాటుకున్న మాజీ ఎంపీ.. వ్యక్తిని కాపాడిన డాక్టర్ బూర నర్సయ్య గౌడ్
Boora Narsaiah Humanity
Follow us
M Revan Reddy

| Edited By: Balaraju Goud

Updated on: Apr 27, 2024 | 10:15 AM

రోడ్డు మీద వెళ్తునప్పుడు మనం ఎన్నో సంఘటనలు చూస్తుంటాం. కొందరు మనకెందుకులే అని అక్కడే వదిలి వెళ్తారు. కొన్ని సందర్భాల్లో రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణాపాయస్థితిలో ఉన్నా మనకు ఎందకులే అంటూ అసలు పట్టించుకోరు. ఒకవేళ వారిని వారిని రక్షించి, ఆస్పత్రికి చేరిస్తే పోలీసుల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయని జనంలో భయం ఎక్కువ. కానీ కొందరు అలా కాదు.. ఎవరైనా ఇబ్బంది పడుతున్నారంటే వెంటనే స్పందిస్తారు. ప్రమాదాల బారిన పడిన వారిని వెంటనే కాపాడేందుకు ప్రయత్నిస్తుంటారు. అందునా ఒక డాక్టర్ గా ఉన్న రాజకీయ నాయకుడు అయితే.. వైద్యం కూడా అందిస్తారు. ఇప్పుడు ఇలాంటి ఘటనే జరిగింది.

భువనగిరి మాజీ ఎంపీ, ప్రస్తుత బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ స్వయానా ఒక డాక్టర్. రాజకీయ నాయకుడిగానే కాదు డాక్టర్‌గా ఎందరికో వైద్యం అందించారు. తాజాగా ఆయనలో మరోసారి డాక్టర్ బయటికి వచ్చారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఒక వ్యక్తి ప్రాణం కాపాడి అందరిచేత ప్రశంసలు అందుకుంటున్నారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం ఔషాపూర్ గ్రామ సమీపంలో బైక్ యాక్సిడెంట్ జరిగింది. అటుగా వెళుతున్న మాజీ పార్లమెంట్ సభ్యులు బూర నర్సయ్య గౌడ్ తన కాన్వాయ్‌ను ఆపి సంఘటన స్థలంలో జరిగిన ప్రమాదం గురించి ఆరా తీశారు. వెంటనే ప్రథమ చికిత్స నిర్వహించి అంబులెన్స్ పిలిపించారు. వెురుగైన వైద్యం కోసం ఉప్పల్‌లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ పంపించారు.

ఇదిగో వీడియో చూడండి…

రాజకీయ వేత్తగానే కాదు మంచి డాక్టర్‌గా పేరున్న డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ మరోసారి నిరూపించుకున్నారు. ఇంత బీజీ షెడ్యూల్‌లో ఉన్న బూర నర్సయ్య గౌడ్ సకాలంలో స్పందించి మానవత్వం చాటుకున్నందుకు స్థానికులు అభినందనలు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…