Mahabubnagar: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు చిన్నారులు సహా ఐదుగురు దుర్మణం

ప్రమాదం జరిగిన సమయంలో కారులో 9 మంది ప్రయాణిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రమాదంలో మొత్తం ఐదుగురు మృతి చెందగా..మరో నలుగురు తీవ్ర గాయాలతో వనపర్తి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడిక్కడే మరణించగా..మరో చిన్నారి ఆస్పత్రికి తరలిస్తుండగా తుదిశ్వాస విడిచింది.

Mahabubnagar: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు చిన్నారులు సహా ఐదుగురు దుర్మణం
Car Accident In Wanaparthy
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 04, 2024 | 7:17 AM

అతివేగం, నిద్రమత్తు ఐదు ప్రాణాలను చిదిమేసింది. మృతుల్లో ఓ చిన్నారి ఉండడం మరో విషాదం. బళ్లారి నుంచి హైదరాబాద్‌ వస్తున్న ఓ కారు.. ఈ తెల్లవారుజామున అదుపుతప్పి ఓ చెట్టును ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడిక్కడే మరణించగా..మరో చిన్నారి ఆస్పత్రికి తరలిస్తుండగా తుదిశ్వాస విడిచింది.

వనపర్తి జిల్లా కొత్తకోట బైపాస్‌లో జరిగింది ఈ దుర్ఘటన. ప్రమాదం జరిగిన సమయంలో కారులో 9 మంది ప్రయాణిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రమాదంలో మొత్తం ఐదుగురు మృతి చెందగా..మరో నలుగురు తీవ్ర గాయాలతో వనపర్తి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదానికి అతివేగంతో పాటు కారు డ్రైవర్‌ నిద్రమత్తే కారణమని తెలుస్తోంది. ప్రమాదానికి గురైన కారు కర్నాటకలో రిజిస్టర్ అయింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..