PM Modi in Adilabad Live: ఆదిలాబాద్ పర్యటనలో కీలక పరిణామం.. ఒకే వేదికపై పీఎం మోదీ, సీఎం రేవంత్
PM Narendra Modi in Telangana Live Updates: ప్రధాని మోదీ మొదటిసారి తెలంగాణలో పర్యటించబోతున్నారు. సోమవారం, మంగళవారాల్లో ఆదిలాబాద్, సంగారెడ్డిలో పర్యటించి 7వేల కోట్ల రూపాయల అభివృద్ది పనులను ప్రారంభించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రధాని మోదీతో కలిసి పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొననున్నారు. ముందుగా సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ తమిళిసై ప్రధానిని అధికారికంగా స్వాగతం పలకనున్నారు. ప్రధాని వెంట ముగ్గురు కేంద్రమంత్రుల రానున్నారు.
PM Modi in Adilabad: పార్లమెంట్ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ ప్రకటించిన మొదటి జాబితాలో తెలంగాణ నుంచి 9 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. మూడు సిట్టింగ్ స్థానాలతో పాటు ఐదుస్థానాలకు అభ్యర్థులను ప్రకటించి దూకుడు మీదుంది కమలం పార్టీ. ఈ నేపథ్యంలో ఫస్ట్ లిస్టు ప్రకటించిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ మొదటిసారి తెలంగాణలో పర్యటించబోతున్నారు. సోమవారం, మంగళవారాల్లో ఆదిలాబాద్, సంగారెడ్డిలో పర్యటించి 7వేల కోట్ల రూపాయల అభివృద్ది పనులను ప్రారంభించనున్నారు. సంగారెడ్డిలో జరిగే సభలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు ప్రధాని మోదీ. బీజేపీ ప్రకటించిన మొదటి జాబితాలో సిట్టింగ్ స్థానమైన ఆదిలాబాద్‌ను పెండింగ్‌లో ఉంచారు. సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు ఉన్నా.. ఆయనకి టికెట్ దక్కలేదు. ఈ క్రమంలో ప్రధాని మోదీ ఆదిలాబాద్ నుంచే తెలంగాణలో ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నారు. ఈ వేదికపైన సోయంబాపురావ్‌కి ప్రధాని మోదీ హామీ ఇస్తారా? లేక మరొకరిని ప్రకటిస్తారా..? అనేది ఉత్కంఠ నెలకొంది. మరోవైపు తనకు టికెట్ రాకుండా రాష్ట్ర నేతలే కొందరు అడ్డుకుంటున్నారని ఆరోపించారు సోయం బాపురావ్. ఒకవేళ టికెట్ రాకపోతే తన దారి తానూ చూసుకుంటానని తెలిపారు.
ఆదిలాబాద్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..
సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రధాని మోదీతో కలిసి పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొననున్నారు. ముందుగా సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ తమిళిసై ప్రధానిని అధికారికంగా స్వాగతం పలకనున్నారు. ప్రధాని వెంట ముగ్గురు కేంద్రమంత్రుల రానున్నారు. తెలంగాణలో పలు జాతీయ రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఎన్టీపీసీ రామగుండం రెండో యూనిట్, అంబారి- ఆదిలాబాద్ పింపల్ కుట్టి ఎలక్ట్రిఫికేషన్ ప్రాజెక్టులను ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారు.
ఆదిలాబాద్‌లో హై అలర్ట్..
పీఎం, సీఎంల రాకతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఎస్పీజీ భద్రతా వలయంలో ఏరోడ్రం, ఇందిర ప్రియదర్శిని స్డేడియం, ఎనిమిది హెలిప్యాడ్ లు, 2 వేల మంది భద్రతతో పకడ్భంధీ ఏర్పాట్లు చేశారు. అగ్ర నేతల రాకతో ఆదిలాబాద్ లో హై అలర్ట్ ప్రకటించారు. 2 వేల మంది పోలీసులతో భారీ భద్రత.. 300 ఎస్పీజీ భద్రత అదనంగా కేటాయించారు.
43 ఏళ్ల తర్వాత ఆదిలాబాద్‌కు ప్రధాని
మరోవైపు 43 ఏళ్ల తర్వాత ఆదిలాబాద్ జిల్లాకు ప్రధాని హోదాలో నరేంద్రమోదీ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఘన స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు సమాయత్తం అయ్యాయి. మోదీ సభ జరిగే ఇందిరా స్టేడియంలో ఏర్పాట్లను ఎంపీ సోయంబాపురావు, ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి, పాయల్ శంకర్ పర్యవేక్షించారు. సభకు దాదాపు లక్షమందికిపైగా హాజరవుతారని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఆదిలాబాద్ సీటును గెలిచి మోదీకి గిఫ్ట్‌గా ఇస్తామంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
LIVE NEWS & UPDATES
-
దేశాభివృద్ధియే లక్ష్యం-మోదీ
15 రోజుల్లోనే ఆత్మనిర్భర్ భారత్ నుంచి వికసిత్ భారత్‌వైపు అడుగులు వేశామన్నారు ప్రధాని నరేంద్రమోదీ. దేశాన్ని ముందుకు తీసుకెళ్లడమే తన లక్ష్యమన్నారు.
-
నా జీవితం తెరిచిన పుస్తకంః మోదీ
నా జీవితం తెరిచిన పుస్తకమన్నారు ప్రధాని మోదీ. మీ కలలు నెరవేర్చడమే తన లక్ష్యమన్నారు. దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు తనను వారి కుటుంబసభ్యుడిగా చూస్తారన్నారు మోదీ.
-
-
బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఒక్కటే-మోదీ
బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిందని ప్రదాని మోదీ అన్నారు. ఈ ప్రాజెక్టు విషయంలో బీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్ కుమ్మక్కవుతోందని విమర్శించారు. కుటుంబ పార్టీల చరిత్ర ఒక్కటేనన్నారు ప్రధాని మోదీ. కుటుంబపార్టీల్లో ఉండేది రెండే ఒకటి దోచుకోవడం, రెండు అబద్ధాలు చెప్పడమేనని విమర్శించారు.
-
మోదీ గ్యారంటీ అంటే.. పూర్తి చేసే గ్యారంటీ
కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. ఈసారి బీజేపీకి 400 సీట్లు వస్తాయని తెలంగాణ నుంచి వాయిస్ వినిపిస్తుందన్నారు. మోదీ గ్యారంటీ అంటే.. పూర్తి చేసే గ్యారంటీ అని అంతా అనుకుంటున్నారని ప్రధాని చెప్పారు.
-
ఆదివాసీల అభ్యున్నతికే నిర్ణయాలు-మోదీ
ఆదివాసీలకు గౌరవం దక్కితే, కుటుంబ పార్టీలు భరించలేకపోతున్నాయని ప్రధాని మోదీ విమర్శించారు. ఆదివాసీల అభ్యున్నతి కోసం నిర్ణయాలు తీసుకుంటే, వాటిని ఈ పార్టీలు విమర్శించారని మోదీ తప్పుబట్టారు.
-
-
తెలుగులో మాట్లాడిన మోదీ
ఆదిలాబాద్‌లో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప యాత్రలో ప్రధాని మోదీ తెలుగులో మాట్లాడారు. ఈసారి 400 సీట్లు సాధించిపెట్టాలని ఆయన ప్రజలను కోరారు. మోదీ తెలుగులో మాట్లాడినపుడు చప్పట్లతో సభ హోరెత్తింది.
-
ఎన్నికల శంఖారావాన్ని పూరించిన మోదీ
ఆదిలాబాద్ కేంద్రంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పార్లమెంటు ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. అధికారిక కార్యక్రమాల అనంతరం జరిగి బీజేపీ బహిరంగ సభలో మోదీ ఒక్కరే పాల్గొని ప్రసంగించారు. గత తొమ్మిది ఏళ్లలో దేశం ఏవిధంగా అభివృద్ధి చెందతుందో వివరించారు. న్నికలు వచ్చినప్పుడు మాత్రమే రాజకీయాలు చేయాలి.. అధికారంలో ఉన్నంత సేపు దేశాభివృద్ధిపైనే దృష్టి పెట్టామన్నారు. త్వరలోనే ప్రపంచంలో అత్యుత్తమ ఆర్ధిక వ్యవస్థగా భారత్ అవతరించబోతున్నట్లు ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
-
రూ.7వేల కోట్ల విలువైన పనులకు ప్రధాని మోదీ శ్రీకారం
పలు అభివృద్ధి పనులకు వర్చువల్‌గా శ్రీకారం చుట్టిన ప్రధాని మోదీ
రూ.7వేల కోట్ల విలువైన పనులకు ప్రధాని మోదీ ప్రారంభం
రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్టును జాతికి అంకితం.
800 మెగావాట్ల రెండో దశ విద్యుత్ కేంద్రాన్ని జాతికి అంకితం చేసిన మోదీ.
పలు రైల్వే అభివృద్ధి పనులు ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ.
అంబారి- పింపల్‌కుట్టి విద్యుదీకరణ ప్రాజెక్టు, డబ్లింగ్, విద్యుదీకరించిన సనత్‌నగర్- మౌలాలి మార్గానికి శ్రీకారం.
-
తెలంగాణ అభివృద్ధికి మోదీ ప్రభుత్వం నిధులు : కిషన్ రెడ్డి
తెలంగాణ అభివృద్ధికి మోదీ ప్రభుత్వం నిధులు అందించిందని వెల్లడించారు. అమృత్ భారత్ పథకం కింద రాష్ట్రంలోని 40 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు
తెలంగాణ రూ.30వేల కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు- కిషన్‌రెడ్డి
తెలంగాణ నుంచి మూడు వందేభారత్ రైళ్లు ప్రారంభించారు- కిషన్‌రెడ్డి
తెలంగాణ అభివృద్ధికి మోదీ సర్కార్ చిత్తశుద్ధితో కృషిచేస్తోంది- కిషన్‌రడ్డి
11 సాగునీటి ప్రాజెక్టులకు కేంద్రం నిధులు అందించింది- కిషన్‌రెడ్డి
-
కేంద్రంతో ఘర్షణ వైఖరి.. అభివృద్ధికి ఆటంకమే: సీఎం రేవంత్
కేంద్రంతో ఘర్షణ వైఖరి ఉంటే రాష్ట్రాభివృద్ధికి ఆటంకం అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ఆదిలాబాద్‌లో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ‘ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేయాలి. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి ముందుకు వెళ్తాం. ఎన్టీపీసీకి కాంగ్రెస్ ప్రభుత్వం సహకరిస్తుంది. కంటోన్మెంట్ స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేసినందుకు ప్రధానికి కృతజ్ఞతలు’ అని రేవంత్‌రెడ్డి తెలిపారు.
-
పలు అభివృద్ధి పనులకు మోదీ శ్రీకారం
రామగుండంలో యూరియా ఉత్పత్తి పరిశ్రమను ప్రధాని మోదీ ప్రారంభించారు. రాష్ట్రం గుండా పరుగులు పెట్టనున్న 3 వందేభారత్ రైళ్లను మోదీ ప్రారంభించారు. తెలంగాణలో పలు జాతీయ రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఎన్టీపీసీ రామగుండం రెండో యూనిట్, అంబారి- ఆదిలాబాద్ పింపల్ కుట్టి ఎలక్ట్రిఫికేషన్ ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు ప్రధాని. అలాగే వివిధ అభివృద్ధి పనులను బటన్ నొక్కడం ద్వారా శ్రీకారం చుట్టారు ప్రధాని
-
ఘన స్వాగతం పలికిన సీఎం రేవంత్
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో ఘన స్వాగతం లభించింది. ఆదిలాబాద్ చేరుకున్న మోదీకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి సీతక్క స్వాగతం పలికారు.
-
ఆదిలాబాద్ చేరుకున్న మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ ఆదిలాబాద్ చేరుకున్నారు. ఇందిరా ప్రియదర్శిని మైదానంలో సభాస్థలి చేరుకున్న మోదీకి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఇతర నేతలు ఘన స్వాగతం పలికారు.
-
మోదీ రాక ఆలస్యం..!
ఆదిలాబాద్ జిల్లాకు రానున్న మోదీ పలు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టబోతున్నారు. రూ. 6,697 కోట్లతో అభివృద్ధి పనులకు శంకు స్థాపన చేస్తారు. ఇప్పటికే జిల్లా కేంద్రం ఎస్పిజీ, కేంద్ర బలగాల ఆధీనంలోకి తీసుకున్నాయి. అయితే మోదీ పర్యటన గంట ఆలస్యంగా ప్రారంభం కానుంది. ఉదయం 10.20 కి ప్రారంభం కావలసి ఉండగా, 11.20కి ఆదిలాబాద్ హెలిప్యాడ్‌కు మోదీ రానున్నారు. అభివృద్ది కార్యక్రమాల్లో 12:15 నిమిషాలకు పాల్గొననున్నారు మోదీ.
-
భద్రతా వలయంలో ఆదిలాబాద్
అగ్ర నేతల రాకతో ఆదిలాబాద్‌లో భద్రత కట్టుదిట్టం చేశారు పోలీసులు. దాదాపు 2 వేల మంది పోలీసులతో భారీ భద్రత కల్పిస్తున్నారు. స్థానిక పోలీసులతో పాటు 300 ఎస్పీజీ భద్రత అదనం. ఐజీ రంగనాథ్ నేతృత్వంలో 7మంది ఎస్పీలు, అడిషనల్ ఎస్పీలు -7, డీఎస్పీలు – 13, సీఐలు – 40, ఎస్సైలు – 101, మహిళా ఎస్సైలు – 20 మంది, మరో 1,100 మంది పోలీస్ సిబ్బందితో భద్రత కట్టుదిట్టం చేశారు. ఉదయం 6 గంటల నుండి మద్యాహ్నం 3 గంటల వరకు సభ ప్రాంగణం, హెలిప్యాడ్‌ల స్థలం ఏరోడ్రం వైపు నిషేదజ్ఞాల అమలులో ఉంటాయని పోలీసు శాఖ హెచ్చరించింది.
-
ఆదిలాబాద్‌లో హై అలర్ట్
పీఎం మోదీ, సీఎం రేవంత్ రెడ్డిల రాకతో భారీ భద్రత ఏర్పాట్లు చేసింది పోలీస్ శాఖ. ఎస్పీజీ భద్రతా వలయంలో ఏరోడ్రం, ఇందిర ప్రియదర్శిని స్డేడియం, ఎనిమిది హెలిప్యాడ్‌ల వద్ద 2 వేల మంది భద్రత సిబ్బందితో రక్షణ వలయం ఏర్పాటు చేశారు. ప్రదాని వెంట ముగ్గురు కేంద్రమంత్రులతోపాటు రాష్ట్ర గవర్నర్ సైతం ఆదిలాబాద్‌లో పర్యటిస్తున్నారు.
-
ఆదిలాబాద్ సీటును గెలిచి మోదీకి గిఫ్ట్
ఆదిలాబాద్ సీటును గెలిచి మోదీకి గిఫ్ట్‌గా ఇస్తామంటున్నారు బీజేపీ నేతలు. దాదాపు లక్షమందితో సభ నిర్వహించబోతున్నట్టు చెబుతున్నారు. మరోవైపు 43ఏళ్ల తర్వాత ఆదిలాబాద్ జిల్లాకు ప్రధాని వస్తుండటంతో మోదీకి ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు
-
బీజేపీ నేతలకు ఎలక్షనోపదేశం
ఆదిలాబాద్ నుంచి తెలంగాణలో ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నారు ప్రధాని మోదీ. బీజేపీ ఫస్ట్ లిస్ట్ ప్రకటించాక తొలిసారి తెలంగాణకు వస్తోన్న నరేంద్రమోదీ… పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. అధికారిక కార్యక్రమాల తర్వాత నిర్వహించే బీజేపీ బహిరంగ సభలో పాల్గొని నేతలకు ఎలక్షనోపదేశం చేస్తారు.
-
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల శంఖారావం
ఆదిలాబాద్ సభ ద్వారా తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల శంఖరావాన్ని పూరించనున్న మోడీ.. ఇటు జిల్లాపై అటు రాష్ట్రంపై భారీ వరాల జల్లు కురిపిస్తారన్న నమ్మకాన్ని పెట్టుకుంది కమల దళం. ఇంతకీ ఆదిలాబాద్ మోడీ పర్యటన ఎలా సాగనుంది. ఏ కార్యక్రమంలో ఏ సమయంలో పాల్గొనబోతున్నారు
-
రామగుండం ఎరువుల ఫ్యాక్టరీకి శంకుస్థాపన
ఆదిలాబాద్ నుంచి బేల మీదుగా రెండు రాష్ట్రాలను కలుపుతూ రూ. 450 కోట్లతో నిర్మాణం కానున్న డబుల్ లైన్ రహదారి శంకు స్థాపన చేయనున్నారు. ఆ వెంటనే అమృత్ పథకం లో భాగంగా రూ. 222 కోట్లతో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం, తాగు నీరు పైప్ లైన్ నిర్మాణం, రామగుండం ఎరువుల ఫ్యాక్టరీల అభివృద్దికి ఇక్కడి నుండే వర్చువల్ గా శంఖుస్థాపన చేయనున్నారు మోదీ
-
రూ. 6,697 కోట్ల అభివృద్ధి పనులకు మోదీ శ్రీకారం
ఉదయం డిల్లీ నుంచి నాగ్‌పూర్.. అక్కడి నుంచి ఆదిలాబాద్ చేరుకుంటారు ప్రధాని మోదీ. రాష్ట్ర ప్రభుత్వం తరుపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానికి స్వాగతం పలకనున్నారు. ఉదయం 10.30 నిమిషాలకు ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో అధికారికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారు. రూ. 6,697 కోట్ల అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేస్తారు ప్రధాని మోదీ.
-
బీజేపీ శ్రేణుల్లో ఫుల్ జోష్
ఆదిలాబాద్ జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు . ఇక ప్రధాని రాక నేపథ్యంలో బీజేపీ శ్రేణులు జోష్ మీదున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని మోదీ నిర్మల్‌లో పర్యటించారు. ఐతే గత 43 ఏళ్లలో ప్రధాని ఆదిలాబాద్‌లో పర్యటించడం ఇదే తొలిసారి.
-
వరుసగా రాష్ట్రాలను చుట్టేస్తున్న ప్రధాని మోదీ
ప్రధాని మోదీ.. వరుసగా రాష్ట్రాలను చుట్టేస్తున్నారు. ఇవాళ తెలంగాణలోని ఆదిలాబాద్‌కి వస్తున్నారు..తన రెండ్రోజుల పర్యటనలో ఆయన రూ.15వేల కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతారు. వీటిలో ఎక్కువ భాగం విద్యుత్, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఉన్నాయి. మోదీ తన పర్యటనలో బీజేపీ బహిరంగ సభల్లోఎన్నికల ప్రచారం చేస్తారు.
Published On - Mar 04,2024 8:13 AM