Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad Charminar: భాగ్యనగరం సిగలో మరో మణిహారం.. చార్మినార్‌ లక్క గాజులకు భౌగోళిక గుర్తింపు..

హైదరాబాద్‌లోని చార్మినార్‌లోని లాడ్‌బజార్‌లో ఈ లక్క గాజులు విక్రయిస్తారు. ఈ గాజుల తయారీ ప్రక్రియ ఎంతో క్లిష్టమైనది. రెసిన్‌ పదార్ధాన్ని కొలిమిపై కరిగిస్తే లక్క వస్తుంది. దీన్ని వృత్తాకారంలో మలిచి, దానిపై రాళ్లు, పూసలు, స్ఫటికాలు, అద్దాలను హస్తకళాకారులు అందంగా చేతులతోనే పొదుగుతారు. ఇలాంటి లక్క బ్యాంగిల్స్‌ను రూపొందించే ఈ సంప్రదాయం 500 సంవత్సరాల నాటిది. ఇది తరతరాలుగా సంక్రమించింది.

Hyderabad Charminar: భాగ్యనగరం సిగలో మరో మణిహారం.. చార్మినార్‌ లక్క గాజులకు భౌగోళిక గుర్తింపు..
Lac Bangles Get Gi Tag
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 04, 2024 | 9:17 AM

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరానికి మరో అరుదైన గౌరవం దక్కింది. భాగ్యనగరం సిగలో మరో మణిహరం చేరింది. వారసత్వం, హస్తకళకు నిదర్శనంగా చార్మినార్‌లోని లాడ్‌ బజార్‌లో లభించే లక్క గాజులకు కేంద్ర ప్రభుత్వం భౌగోళిక గుర్తింపు (జిఐ) ట్యాగ్‌ను అందజేసింది. గతంలోనే హైదరాబాద్ హలీమ్‌కు జీఐ ట్యాగ్‌ను అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు తెలంగాణ నుంచి మొత్తం 17 ఉత్పత్తులకు జీఐ ట్యాగ్‌ను మంజూరు చేసింది. 2022లో హైదరాబాద్ హలీమ్ రస్గుల్లా, బికనేరి భుజియా, రత్లామి సెవ్ వంటి ఇతర ఆహార పదార్థాలను అధిగమించి మోస్ట్ పాపులర్ GI అవార్డును కైవసం చేసుకుంది. ఇప్పుడు రాష్ట్రానికి గుర్తింపు పొందిన 17వ ఉత్పత్తిగా మన లక్క గాజులకు స్థానం దక్కింది.

జూన్ 2022లో నెలవంక హస్తకళల కళాకారుల సంక్షేమ సంఘం (CHAWA) ఒక దరఖాస్తును దాఖలు చేయడంతో 18 నెలల క్రితం GI ట్యాగ్‌ని పొందే దిశగా ప్రయాణం ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వ పరిశ్రమ, వాణిజ్య శాఖ మద్దతుతో, దరఖాస్తుకు అంగీకార చిహ్నంగా ఆమోదం లభించింది. హైదరాబాద్‌ హలీమ్‌ తర్వాత లాడ్‌ బజార్‌కు చెందిన లాక్‌ బ్యాంగిల్స్‌కు భౌగోళిక సూచిక (జీఐ) ట్యాగ్‌ వచ్చింది. త్వరలోనే ధ్రువీకరణ పత్రం రానుంది. ఇక్కడ ‘లాక్‌ గాజుల తయారీపై 6 వేల కుటుంబాలు ఆధారపడి బతుకుతున్నాయి.

హైదరాబాద్‌లోని చార్మినార్‌లోని లాడ్‌బజార్‌లో ఈ లక్క గాజులు విక్రయిస్తారు. ఈ గాజుల తయారీ ప్రక్రియ ఎంతో క్లిష్టమైనది. రెసిన్‌ పదార్ధాన్ని కొలిమిపై కరిగిస్తే లక్క వస్తుంది. దీన్ని వృత్తాకారంలో మలిచి, దానిపై రాళ్లు, పూసలు, స్ఫటికాలు, అద్దాలను హస్తకళాకారులు అందంగా చేతులతోనే పొదుగుతారు. ఇలాంటి లక్క బ్యాంగిల్స్‌ను రూపొందించే ఈ సంప్రదాయం 500 సంవత్సరాల నాటిది. ఇది తరతరాలుగా సంక్రమించింది.

ఇవి కూడా చదవండి

మరోవైపు, హైదరాబాదీ హలీమ్ అనేది మాంసం, కాయధాన్యాలు, గోధుమలు, సుగంధ ద్రవ్యాలు, ఇతర పదార్థాలతో కూడిన వంటకం. ఇది రంజాన్ మాసంలో నగరంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఫుడ్‌ ఐటమ్‌గా ఎక్కువ మంది ఇష్టపడతారు. పవిత్ర మాసంలో అనేక రెస్టారెంట్లు హలీమ్ అవుట్‌లెట్‌లను స్థాపిస్తాయి. కేవలం వ్యాపారంగా మాత్రమే కాకుండా నగరంలోని అనేక మంది నివాసితులకు ఉపాధి వనరుగా కూడా ఉంటుంది.

GI ట్యాగ్‌తో కూడిన తెలంగాణ ఉత్పత్తుల జాబితా ఇదే..

1. పోచంపల్లి ఇక్కత్ చీరలు

2. కరీంనగర్ వెండి శిల్పాలు

3. నిర్మల్ బొమ్మలు, చేతిపనులు

4. నిర్మల్ ఫర్నిచర్

5. నిర్మల్ పెయింటింగ్స్

6. గద్వాల్ చీర

7. సిద్దిపేట గొల్లబామ చీర

8. చెరియాల్ పెయింటింగ్స్

9. హైదరాబాద్ హలీమ్

10. పెంబర్తి మెటల్ క్రాఫ్ట్

11. నారాయణపేట చేనేత చీరలు

12. బనగానపల్లె మామిడి

13. ఆదిలాబాద్ డోక్రా

14. వరంగల్ దుర్రీస్

15. పోచంపల్లి ఇకత్ (లోగో)

16. తెలియా రుమల్

17. లాక్ బ్యాంగిల్స్