BRS: ఇద్దరు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్ధులు ఖరారు.. వారెవరంటే.?
లోక్‌సభ ఎన్నికలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫోకస్ పెట్టారు. ఎంపీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. దానిలో భాగంగా.. ఇద్దరు ఎంపీ అభ్యర్థులను ఖరారు చేశారు కేసీఆర్. కరీంనగర్ అభ్యర్థిగా బోయినపల్లి వినోద్‌కుమార్, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్‌ను ఫిక్స్ చేశారు.
లోక్‌సభ ఎన్నికలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫోకస్ పెట్టారు. ఎంపీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. దానిలో భాగంగా.. ఇద్దరు ఎంపీ అభ్యర్థులను ఖరారు చేశారు కేసీఆర్. కరీంనగర్ అభ్యర్థిగా బోయినపల్లి వినోద్‌కుమార్, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్‌ను ఫిక్స్ చేశారు. మార్చి 4న నలుగురు లేదా ఐదుగురు బీఆర్ఎస్ అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటించనున్నారు కేసీఆర్. అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత లోక్‌సభ నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహిస్తున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.
తెలంగాణ భవన్‌లో కరీంనగర్, పెద్దపల్లి నియోజకవర్గాలపై సమీక్ష జరిపారు. రెండు పార్లమెంట్ నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా.. కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్‌రెడ్డి ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా ఈ నెల 12న కరీంనగర్‌లో నిర్వహించనున్న బీఆర్ఎస్ బహిరంగ సభపై చర్చించారు కేసీఆర్. బహిరంగ సభ ఏర్పాట్లు, జనసమీకరణ, సభ విజయవంతంపై బీఆర్ఎస్ నేతలకు దిశానిర్దేశం చేస్తారు.