AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: టంగుటూరులో విషాదం… ముగ్గురు పిల్లలను చంపి చెట్టుకు ఉరి వేసుకున్న తండ్రి

రంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ముగ్గురు పిల్లలను చంపి, ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు కన్న తండ్రి. అభం శుభం తెలియని చిన్నారుల మృతితో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం టంగుటూరు గ్రామంలో అప్పుల బాధతో యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

Telangana: టంగుటూరులో విషాదం... ముగ్గురు పిల్లలను చంపి చెట్టుకు ఉరి వేసుకున్న తండ్రి
Crime
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: Mar 04, 2024 | 11:09 AM

Share

రంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ముగ్గురు పిల్లలను చంపి, ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు కన్న తండ్రి. అభం శుభం తెలియని చిన్నారుల మృతితో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం టంగుటూరు గ్రామంలో అప్పుల బాధతో రవి (35)అనే యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు తన ముగ్గురు కుమారులు సాయికిరణ్ (13) మోహిత్ కుమార్ (10) ఉదయ్ కిరణ్ (7) ను అత్యంత దారుణంగా హతమార్చి, తానూ బలవన్మరణానికి పాల్పడ్డాడు.

గత కొంతకాలంగా గ్రామంలోని ప్రజల వద్ద ఇతర గ్రామాల ప్రజల వద్ద నుంచి మనీ స్కాం నిర్వహిస్తూ వెయ్యికి 3,000 చొప్పున, అలాగే లక్షకు 58 రోజులకు 5 లక్షలు ఇప్పిస్తానంటూ ఇరుగు పొరుగు వారిని నమ్మించాడు రవి. దీంతో పెద్ద మొత్తాల్లో డబ్బులు కట్టించాడు. తీరా డబ్బులు రాకపోవడంతోపాటు అప్పులు ఇచ్చిన జనం ఇంటికి రావడంతో అయోమయానికి గురయ్యాడు. దీంతో మనస్తాపానికి గురైన రవి దారుణానికి ఒడిగట్టాడు.

ఇంట్లో పిల్లలను చంపి తాను పంట పొలంలో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న భార్య శ్రీలత, కుటుంబీకులు సంఘటన స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న మోకిలా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. అప్పుల బాధ తట్టుకోలేక ఈ దారుణానికి పాల్పడినట్టుగా పోలీసులు తెలిపారు. పలువురి నుంచి పెద్ద ఎత్తున డబ్బులు సేకరించినట్లు వెల్లడించారు. డబ్బు తీసుకున్న వ్యక్తి తిరిగి ఇవ్వకపోవడంతో రవి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

విశ్వక్‌ గురించి అర్జున్‌ మాటలు వింటే కళ్లు చెమర్చుతాయి.. వీడియో
విశ్వక్‌ గురించి అర్జున్‌ మాటలు వింటే కళ్లు చెమర్చుతాయి.. వీడియో
10 రోజుల్లో బంగారం ధర ఎంత తగ్గిందంటే..?
10 రోజుల్లో బంగారం ధర ఎంత తగ్గిందంటే..?
తప్పుడు సమాచారంతో PF డబ్బులు పొందుతున్నారా? మీకో షాకింగ్‌ న్యూస్‌
తప్పుడు సమాచారంతో PF డబ్బులు పొందుతున్నారా? మీకో షాకింగ్‌ న్యూస్‌
క్లైమాక్స్‌కు చేరిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం.. హోరాహోరీగా నేతల..
క్లైమాక్స్‌కు చేరిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం.. హోరాహోరీగా నేతల..
మీ పాన్‌పై నల్లటి మొండి మరకలు ఉన్నాయా? ఇలా చేస్తే మెరిసిపోతాయ్
మీ పాన్‌పై నల్లటి మొండి మరకలు ఉన్నాయా? ఇలా చేస్తే మెరిసిపోతాయ్
కోహ్లీ, గంభీర్ వివాదంపై ఎట్టకేలకు మౌనం వీడిన బీసీసీఐ
కోహ్లీ, గంభీర్ వివాదంపై ఎట్టకేలకు మౌనం వీడిన బీసీసీఐ
అమెరికాతో భారత్‌ ట్రేడ్‌ డీల్‌.. బంగ్లాదేశ్‌కు డేంజర్‌ బెల్‌!
అమెరికాతో భారత్‌ ట్రేడ్‌ డీల్‌.. బంగ్లాదేశ్‌కు డేంజర్‌ బెల్‌!
ప్రపంచంలోనే అతిపెద్ద ఇల్లు.. ఎక్కడో లేదు.. మన భారతదేశంలోనే ఉంది..
ప్రపంచంలోనే అతిపెద్ద ఇల్లు.. ఎక్కడో లేదు.. మన భారతదేశంలోనే ఉంది..
నాలుకపై మచ్చ ఉంటే అన్న మాట నిజమవుతుందా..? దాన్ని వెనుక ఉన్న..
నాలుకపై మచ్చ ఉంటే అన్న మాట నిజమవుతుందా..? దాన్ని వెనుక ఉన్న..
బంగారంలో పెట్టుబడులకు ఇదే మంచి సమయమా..?
బంగారంలో పెట్టుబడులకు ఇదే మంచి సమయమా..?