Fish Prasadam: ఆస్తమా పేషెంట్స్​కు అలర్ట్.. చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధం.. ప్రభుత్వం తరపున విస్తృత ఏర్పాట్లు

మృగశిరకార్తె వస్తుందంటే చాలు ఆస్తమా బాధితులు చేప మందు కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఈ నేపధ్యంలో రెండు రోజుల పాటు భాగ్యనగరంలో చేప మందు ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నారు.  ఇప్పటికే చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధమైంది. ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. చేప ప్రసాదం కోసం వచ్చే ప్రజలకు సూచనలు చేశారు బత్తిన సోదరులు.  

Fish Prasadam: ఆస్తమా పేషెంట్స్​కు అలర్ట్.. చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధం.. ప్రభుత్వం తరపున విస్తృత ఏర్పాట్లు
Fish Prasadam
Follow us
Surya Kala

|

Updated on: Jun 07, 2024 | 12:34 PM

హైదరాబాద్ లో చేప ప్రసాదం పంపిణీకి ఎంత డిమాండ్ ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. ప్రతి సంవత్సరం మృగశిరకార్తె ప్రారంభంలో ఆస్తమాతో సహా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి చేప మందు చాలా సంవత్సరాలుగా ఉచితంగా పంపిణీ చేస్తున్నారు బత్తిన కుటుంబీకులు. ఈ నెల 8, 9న హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో చేప మందు ప్రసాదం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం తరపున విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.

ఆస్తమాతో పాటు శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ చేప మందు ఉచితంగా పంపిణీ చేస్తారు. ఇందుకోసం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు తరలిరానున్నారు. చేప ప్రసాదం కోసం ఇప్పటికే మూడు రోజుల ముందే ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌కి చేరుకున్నారు ప్రజలు. చేప ప్రసాదానికి భారీగా డిమాండ్ ఉండంతో నిర్వాహకులు స్థానికులకు పలు సూచనలు చేశారు.

చేప ప్రసాదం కోసం వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా అన్ని శాఖల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని బత్తిన కుటుంబీకులు చెప్పారు. చేప మందు కోసం వచ్చే ప్రజల కోసం టీజీఎస్ ఆర్టీసీ శుభవార్త వినిపించింది. రెండు రోజుల పాటు.. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌ మార్గంలో.. 130 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది.

ఇవి కూడా చదవండి

ప్రధాన రైల్వే స్టేషన్లు సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లు, ప్రధాన బస్టాండ్లు అయిన జేబీఎస్, ఎంజీబీఎస్ నుంచి, శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌కి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ తెలిపింది. ఆర్టీసీ కల్పిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?