KCR: కేసీఆర్‌ను కలిసేందుకు భారీగా తరలివస్తున్న అభిమానులు.. కిక్కిరిసిన ఫామ్‌హౌస్‌

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అధికారం కోల్పోయాక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లోనే ఉంటున్నారు. దీంతో ఆయన్ను కలిసేందుకు ఆ మర్నాడు నుంచి నేతలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, చింతమడక వాసులతో పాటు రాజకీయ నేతలు, మేధావులు, వివిధ రంగాలకు చెందిన అనేక మంది వస్తున్నారు.

KCR: కేసీఆర్‌ను కలిసేందుకు భారీగా తరలివస్తున్న అభిమానులు.. కిక్కిరిసిన ఫామ్‌హౌస్‌
Kcr
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 07, 2023 | 8:56 PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అధికారం కోల్పోయాక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లోనే ఉంటున్నారు. దీంతో ఆయన్ను కలిసేందుకు ఆ మర్నాడు నుంచి నేతలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, చింతమడక వాసులతో పాటు రాజకీయ నేతలు, మేధావులు, వివిధ రంగాలకు చెందిన అనేక మంది వస్తున్నారు. కేసీఆర్‌తో ఫొటోలు, సెల్ఫీల కోసం పోటీపడుతున్నారు. అందరినీ పేరుపేరునా పలకరిస్తున్నారు కేసీఆర్‌. ఉద్యమనేతగా, తెలంగాణగా తెచ్చిన పోరాటయోధుడిగా, పదేళ్లలో తెలంగాణను అగ్రగామిగా నిలిపిన ముఖ్యమంత్రిగా తమ గుండెల్లోనే ఉంటారని చెబుతున్నారు అభిమానులు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 64 స్థానాల్లో గెలిచి అధికారం దక్కించుకుంది. గ్రేటర్‌ హైదరాబాద్‌లో భారీగా సీట్లు గెలుచుకున్న బీఆర్‌ఎస్‌ జిల్లాల్లో వెనుకబడి 39 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. పలువురు మంత్రులు, బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు ఓడిపోయారు. సీఎం కేసీఆర్‌ తన సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో గెలుపొందినా కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థి వెంకట రమణారెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు.

ఎన్నికలకు ముందు కేసీఆర్‌ రాష్ట్రవ్యాప్తంగా ఉధృతంగా పర్యటించారు. రోజుకు నాలుగు సభలు చుట్టేశారు. తప్పకుండా హ్యాట్రిక్‌ కొడతామన్న బీఆర్‌ఎస్‌ నేతలు ఫలితాలతో నిరాశపడ్డారు. ఆయా జిల్లాల్లో గ్రామీణ ఓటర్లు కాంగ్రెస్‌కు ఈ స్థాయిలో పట్టం కడతారని ఊహించలేకపోయిన బీఆర్‌ఎస్‌ నేతలు ప్రస్తుతం ఓటమికి గల కారణాలను విశ్లేషించుకుంటున్నారు.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..