Telangana CM: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ నేతల శుభాకాంక్షలు..

తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎల్‎బీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక గాంధీలతో పాటు కేసీ వేణుగోపాల్, ఛత్తీస్‎గఢ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖ్, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇతర నేతలు ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు.

Telangana CM: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ నేతల శుభాకాంక్షలు..
Former Minister Harish Rao And Mayor Vijaya Lakshmi Congratulat To Telangana Chief Minister Revanth Reddy
Follow us
Srikar T

|

Updated on: Dec 07, 2023 | 8:55 PM

తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎల్‎బీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక గాంధీలతో పాటు కేసీ వేణుగోపాల్, ఛత్తీస్‎గఢ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖ్, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇతర నేతలు ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణస్వీకారం చేయగా.. తదుపరి గెలిచిన ఎమ్మెల్యేలలో 11 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి తాను రాష్ట్ర ప్రజలకు ఎలాంటి పాలన అందిస్తానో వివరించారు. అలాగే తొలి సంతకం ఆరు గ్యారెంటీలపై చేయగా.. రెండవ సంతకం వికలాంగ మహిళ రజినీకి ఉద్యోగాన్ని ఇస్తూ ఉద్యోగ నియమక పత్రం‎పై రెండో సంతకం చేశారు. ఆ తరువాత సెక్రటేరియట్‎లో పోలీసులు గౌరవవందనం స్వీకరించారు.

రేవంత్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తొలిరోజే 11 మంది మంత్రులతో కూడిన కేబినెట్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు తమ శుభాకంక్షలు తెలియజేస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి, ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన భట్టి విక్రమార్కతోపాటూ సహచర మంత్రి వర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేయాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. హరీష్ రావుతోపాటూ హైదరాబాద్ నగర మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి కూడా తన ట్విట్టర్ వేదికగా స్పందించారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి అలాగే మరో 11 మంది మంత్రులకు కూడా తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..