CM Revanth Reddy: తొలిసారి ముఖ్యమంత్రిగా సచివాలయానికి రేవంత్ రెడ్డి.. తొలి క్యాబినెట్ భేటీ ఎప్పుడంటే..
తెలంగాణ కాంగ్రెస్ తొలి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణస్వీకారం చేసిన తొలి వేదికపైనే రెండు ఫైల్స్‌పై సంతకం చేశారు. తొలిసంతకం ఆరు గ్యారెంటీల అమలుపై చేయగా.. రజినీ అనే వికలాంగ మహిళకు ఉద్యోగ నియామకపత్రంపై రెండో సంతకం చేశారు. ఆతరువాత నేరుగా తాజ్ కృష్ణ హోటల్‌కు చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి.
తెలంగాణ కాంగ్రెస్ తొలి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణస్వీకారం చేసిన వేదికపైనే రెండు ఫైల్స్‌పై సంతకం చేశారు. తొలిసంతకం ఆరు గ్యారెంటీల అమలుపై చేయగా.. రజినీ అనే వికలాంగ మహిళకు ఉద్యోగ నియామకపత్రంపై రెండో సంతకం చేశారు. ఆ తరువాత నేరుగా తాజ్ కృష్ణ హోటల్‌కు చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక్కడ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారికి ఏఏ శాఖలు కేటాయించాలి అనేదానిపై చర్చించనున్నట్లు సమాచారం. అయితే ఈ సమావేశం తరువాత రేవంత్ కొత్తగా నిర్మించిన సెక్రటేరియట్‌కు చేరుకోనున్నారు. ఇందులో భాగంగా అక్కడ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
సెక్రటేరియట్ చేరుకున్న వెంటనే పోలీసులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గౌరవ వందనం సమర్పిస్తారు. ఆ తరువాత సెక్రటేరియట్ లోపలికి వెళ్లి భవన నిర్మాణం మొత్తం పరిశీలిస్తారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్య కార్యదర్శిగా కొనసాగుతున్న శాంతి కుమారితోపాటూ మరి కొందరు కీలక శాఖలకు చెందిన ముఖ్య కార్యదర్శులు పాల్గొంటారు. వారితో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఈ సమీక్షలో ఇతర ఐఏఎస్ అధికారులు పాల్గొంటారు. తెలంగాణలో మొత్తం 34 శాఖలు ఉంటాయి. ఈ శాఖలకు సంబంధించిన ముఖ్యకార్యదర్శులతో సమావేశం అవుతారు.
ఇప్పటి వరకూ ముఖ్యమంత్రి కార్యాలయంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఎవరినైతే సీఎంవో అధికారులుగా నియమించారో వాళ్లే ప్రస్తుతం విధుల్లో కొనసాగుతున్నారు. వారిని కొనసాగించవచ్చు.. లేకుంటే తనకు కావల్సిన అదనపు కార్యదర్శులను నియమించుకోవచ్చు. ప్రస్తుతం సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా శేషాద్రిని, తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా శివధర్ రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ముఖ్యకార్యదర్శి శాంతి కుమారి. ఈరోజు సాయంత్రం 5 గంటలకు ముఖ్యకార్యదర్శులతో సమావేశం ముగిసిన తరువాత తొలి కేబినెట్ సమావేశం కూడా జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రభుత్వ ప్రాధాన్యతలేంటి.. అమలు చేయాల్సిన అరు గ్యారెంటీలు ఏంటి అని చర్చించనున్నారు. ఇప్పటికే సచివాలయ ప్రాంగణం మొత్తం టాస్క్ ఫోర్స్, ఇంటెలిజెన్స్, లా అండ్ ఆర్ఢర్ పోలీసులు ముఖ్యమంత్రి భద్రతపై సమన్వయం చేసుకుంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..