Minister Seethakka: బుల్లెట్ నుంచి బ్యాలెట్.. మంత్రిగా మాజీ నక్సలైట్.. సీతక్క ప్రయాణం ఇదే

దోపిడీని, దుర్మార్గాన్ని, పాలకుల కిరాతకత్వాన్ని భరించలేక ఉద్యమ పంథా ఎంచుకున్నారు సీతక్క. బానిసల్లా బతికేకంటే, మనుషుల్లా గౌరవ ప్రదంగా జీవించాలన్న కారణంగానే నిర్ణయాలు తీసుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనశక్తి సాయుధ పోరాటంలో మహిళా నక్సలైట్‌గా, దళం లీడర్‌గా ప్రధాన భూమిక వహించారు.

Minister Seethakka: బుల్లెట్ నుంచి బ్యాలెట్.. మంత్రిగా మాజీ నక్సలైట్.. సీతక్క ప్రయాణం ఇదే
Seethakka
Follow us
Balaraju Goud

|

Updated on: Dec 07, 2023 | 3:13 PM

ఏ పదవిలో ఉన్నా, ఎన్ని ఉన్నత శిఖరాలకు చేరుకున్నా.. తానూ మాత్రం ములుగు నియోజకవర్గ ప్రజల సేవకురాలినేనంటున్నారు మంత్రి సీతక్క. మంత్రి పదవి దక్కడంపై సంతోషం వ్యక్తం చేస్తూనే తెలంగాణ ప్రజలు తనపై మరింత పెద్ద బాధ్యతను పెట్టారన్నారు. తెలంగాణలో నియంతృత్వాన్ని తరిమికొట్టి ప్రజాస్వామ్యానికి ప్రజలు పట్టం కట్టారని తెలిపారు. ప్రజలంతా ఆశించిన సంక్షేమ రాజ్యం తీసుకొస్తామని, రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలను కూడా అభివృద్ధి చేస్తామని సీతక్క వెల్లడించారు.

ఎల్బీ స్టేడియం వేదికగా జరిగిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మంత్రిగా సీతక్క ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెతో గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ ప్రమాణస్వీకారం చేయించారు. ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. సీతక్క మూడుసార్లు ఎమ్మెల్యేగా ములుగు శాసనసభ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు.

ధనసరి అనసూయ అలియాస్ సీతక్క 1988 లో నక్సల్ పార్టీలో చేరినప్పుడు ఆమె వయస్సు 14 సంవత్సరాలు. 10 వ తరగతి చదువుతున్న సమయంలో పోరాట పటిమను గుర్తించిన నక్సల్స్ ఉద్యమ వైపు ఉపిరిపోశారు. ఫూలన్ దేవి రచనల నుండి ప్రేరణ పొంది, ఆర్థిక దోపిడీ కులవాద వివక్షతో ఆగ్రహంగా ఉన్న ఆదివాసీరాలు సీతక్క, తొలుత విప్లవోద్యమం వైపు అడుగులు వేశారు. ఆ మార్గంలో జనశక్తి (సీపీఐ) (ఎంఎల్) పార్టీలో చేరారు. ఏళ్లు గుడుస్తున్నా ఆదివాసుల మీద, అణగారిన వర్గాలమీద జరగుతున్న దౌర్జన్యాలను భరించలేకపోయారు సీతక్క. శతాబ్దాలుగా సాగిపోతున్న మెరికల్లాంటి యువతీయువకులు ఎందరో ప్రాణాలు పోగొట్టుకున్నా, ఆ మార్గానికి అంకితమయ్యారు. అడవులలో, కొండలు, గుట్టలలో నిరంతరం మృత్యువు వెన్నాడుతుండగా, నిద్రాహారాలు కరువై అత్యంత కఠోరమైన పోరాటం సాగిస్తూ ఆ ఉద్యమంలోనే ప్రయాణం సాగించారు సీతక్క.

దోపిడీని, దుర్మార్గాన్ని, పాలకుల కిరాతకత్వాన్ని భరించలేక ఉద్యమ పంథా ఎంచుకున్నారు సీతక్క. బానిసల్లా బతికేకంటే, మనుషుల్లా గౌరవ ప్రదంగా జీవించాలన్న కారణంగానే నిర్ణయాలు తీసుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనశక్తి సాయుధ పోరాటంలో మహిళా నక్సలైట్‌గా, దళం లీడర్‌గా ప్రధాన భూమిక వహించారు. చివరికి వ్యవస్థలోపల తమ సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయనే విశ్వాసాన్ని కోల్పోయి, ప్రజాస్వామిక పరిష్కారం నక్సలైటు మార్గంలో కూడ నెరవేరలేదు. నక్సలైటుపార్టీ సభ్యులలో కొన్ని సైద్ధాంతిక వివాదాలు, వ్యక్తిగత విభేదాల అప్రదిష్ట పాలయింది. చాలా సంవత్సరాలు అజ్ఞాత జీవితం గడిపారు. .

మావోయిస్టులు జన జీవన స్రవంతిలో కలవాలని నందమూరి తారక రామారావు పిలుపునిచ్చారు. తెలిసీ తెలియని వయస్సులో అమాకత్వంతో తప్పుదారి పట్టిన యువతలో కొందరు నేటికీ నిషేధిత మావోయిస్టు సంస్థలో కొన సాగుతున్నారని వారు వెంటనే జనజీవన స్ర వంతిలో కలవాలని అడవుల్లో కుటుంబాలను విడిచి అనారోగ్యాల పాలవుతూ సాధించేదేమీలేదన్నారు నందమూరి తారక రామారావు. తమ బిడ్డల జాడ కోసం తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారని మావోయిస్టులు జన జీవన స్రవంతిలో కలిసిపోయి ప్రశాంతమైన జీవనాన్ని గడపడానికి ప్రభుత్వం అనేక అవకాశాలు కల్పిస్తుందని చెప్పారు. అత్యంత స్నేహ పూరితంగా మనస్ఫూర్తిగా మీ రాక కోసం ఎదురుచూస్తుందని పేర్కొన్నారు. దీంతో పోరుబాట వదిలి లొంగిపోయారు.

వివిధ హోదాల్లో పని చేసి సీతక్క కామ్రేడ్‌గా దాదాపు రెండు దశాబ్దాలు గడిపారు. ఈ సమయంలో ఆమె దళ కమాండర్ నక్సల్ నాయకుడిని వివాహం చేసుకున్నారు. వారికి ఒక కొడుకు. ఆ సమయంలో తనకు తాను పోలీసులకు లొంగిపోయింది. ఇక ఆమె అజ్ఞాత జీవితానికి గుడ్‌బై చెప్పి జన జీవన స్రవంతిలోకి వచ్చారు. 2001లో హైదరాబాద్లో న్యాయవాదిగా మారడానికి ఎల్.ఎల్.బి చదివింది. చట్టం అధ్యయనం చేసిన తర్వాతే ఆమెకు ప్రజా విధానం, పాలనపై ఆసక్తి ఏర్పడింది. సీతక్క సామాజిక సేవలో చురుకుగా ఉండి, స్థానికంగా నాయకురాలిగా పేరుఉన్నందున, అప్పుటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమెకు టికెట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. పోరుబాటను వీడిన సీతక్క రాజకీయ రంగప్రవేశం చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. జనజీవన స్రవంతిలోకి వచ్చిన ఆమె మొదటిసారి బ్యాలెట్ పోరులో దిగారు.

2004లో తొలిసారిగా తెలుగు దేశం పార్టీ తరుఫున పోటీ చేసిన సీతక్క, కాంగ్రెస్ అభ్యర్థి పొదెం వీరయ్య చేతిలో ఓడిపోయారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుండి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి పొదెం వీరయ్ పై గెలుపొందారు. తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టింది సీతక్క. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత జరిగిన 2014 వరుసగా మూడోసారి టీడీపీ అభ్యర్థినిగా బరిలో అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి అజ్మీరా చందూలాల్ చేతిలో ఓడిపోయారు.

ఆ తరువాత తెలుగు దేశం పార్టీని వీడిన సీతక్క కాంగ్రెస్ గూటికి చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి అజ్మీరా చందులాల్ పై 22,671 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2023 ఎన్నికల్లో ములుగు నియోజకవర్గం నుంచి మరోసారి గెలిచిన ఆమె మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…