Telangana: ఇంకా ఫైనల్ కాలేదు.. తెలంగాణ మంత్రుల పోర్ట్‌ఫోలియోలన్ని అవాస్తవాలే!
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. సీఎంతో పాటు 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శాఖలు కేటాయించినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎవరికి ఏ శాఖ కేటాయించారన్న వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. అయితే మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి శాఖలు..
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. సీఎంతో పాటు 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శాఖలు కేటాయించినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎవరికి ఏ శాఖ కేటాయించారన్న వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. అయితే మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి శాఖలు కేటాయించలేదని తెలుస్తోంది.
డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క తప్ప.. ఇతర మంత్రుల శాఖలు ప్రచారంలో ఉన్న పోర్ట్‌ఫోలియోలన్నీ అవాస్తవాలేనని తెలుస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన తర్వాతే శాఖల కేటాయింపుపై స్పష్టత వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి