TRSను BRSగా గుర్తించిన ఈసీ.. అభ్యంతరాలు రాకపోవడంతో పచ్చజెండా.. రేపు ఆవిర్భావ కార్యక్రమాలు

తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత్ రాష్ట్ర సమితి గా కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదించింది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అధికారిక లేఖ పంపింది. ఈ నేపథ్యంలో డిసెంబర్....

TRSను BRSగా గుర్తించిన ఈసీ.. అభ్యంతరాలు రాకపోవడంతో పచ్చజెండా.. రేపు ఆవిర్భావ కార్యక్రమాలు
BRS Party CM KCR
Follow us

|

Updated on: Dec 08, 2022 | 6:21 PM

తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత్ రాష్ట్ర సమితి గా కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదించింది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అధికారిక లేఖ పంపింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 9 శుక్రవారం మధ్యాహ్నం 1:20 నిమిషాలకు భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ కార్యక్రమం నిర్వహించాలని, అందుకు సంబంధించిన అధికారిక కార్యక్రమాలు ప్రారంభించాలని, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. తెలంగాణ భవన్ లో రేపు (శుక్రవారం) ఒంటిగంట 20 నిమిషాలకు, తనకు అందిన అధికారిక లేఖపై రిప్లై సంతకం చేసి ఎన్నికల సంఘానికి అధికారికంగా పంపించనున్నారు. అనంతరం సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ జండాను ఆవిష్కరిస్తారు. తెలంగాణ భవన్ లో రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు, పార్టీ జిల్లాల అధ్యక్షులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కావాలని ముఖ్యమంత్రి కోరారు. వీరితోపాటు జిల్లా పరిషత్ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డీసీసీబీ అధ్యక్షులు డీసీఎంఎస్ అధ్యక్షులతో పాటు పార్టీ ముఖ్యులు అందరూ శుక్రవారం మధ్యాహ్నం లోపు తెలంగాణ భవనకు చేరుకోవాలని పార్టీ అధినేత సీఎం కేసిఆర్ పిలుపునిచ్చారు.

టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా గుర్చించిన ఈసీ.. త్వరలో నోటిఫికేషన్ జారీ చేస్తామని ప్రకటించింది. కాగా.. పార్టీ పేరును బీఆర్ఎస్ గా మార్చాలంటూ అక్టోబర్‌ 5న ఈసీకి టీఆర్ఎస్ లేఖ రాసింది. ఈసీ సూచన మేరకు పబ్లిక్‌ నోటీస్ జారీ చేసింది. ఇందులో బీఆర్ఎస్ పేరుపై అభ్యంతరాలు రాలేదు. దీంతో ఈసీ గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. ఈసీ పచ్చజెండా ఊపడంతో తెలంగాణ రాష్ట్ర సమితి కాస్తా భారత్‌ రాష్ట్ర సమితిగా మారిపోయింది. గులాబీ జెండా మధ్యలో భారతదేశం ఉండేలా నూతన జెండాను బీఆర్ఎస్ రూపొందించింది. పార్టీ పేరు మారినా కారు గుర్తే కొనసాగనుంది.

ఇవి కూడా చదవండి

కాగా.. దేశ రాజకీయాల్లోకి వెళ్లాలనే లక్ష్యంతో తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. అయితే అందుకు కొత్త పార్టీ పెట్టాలా లేక ఉన్న టీఆర్ఎస్ నే పేరు మార్చాలా అనే నిర్ణయంపై కీలక ప్రకటన చేశారు. ఓ మంచి ముహూర్తం చూసుకుని.. తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత్ రాష్ట్ర సమితిగా మార్చారు. అందుకు పార్టీ ముఖ్య నేతలు, నాయకులు, కార్యకర్తలు ఆమోదం తెలిపారు. దీంతో పార్టీ మార్పు నిర్ణయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఈసీ బీఆర్ఎస్ పేరును ఖరారు చేస్తూ సీఎం కేసీఆర్ కు సమాచారం అందించింది. దీంతో గులాబీ దళంలో కొత్త ఉత్సాహం అలుముకుంది.

17 ఏళ్ల కెరీర్‌లో 100కు పైగా ఆపరేషన్లు..
17 ఏళ్ల కెరీర్‌లో 100కు పైగా ఆపరేషన్లు..
తండ్రి మరణం తర్వాత చదువును ఆపేసి వ్యాపార సామ్రాజ్యంలోకి..
తండ్రి మరణం తర్వాత చదువును ఆపేసి వ్యాపార సామ్రాజ్యంలోకి..
21 ఏళ్ల వయసులోనే 50 సిక్సర్లు.. తెలుగోడి అరుదైన రికార్డు
21 ఏళ్ల వయసులోనే 50 సిక్సర్లు.. తెలుగోడి అరుదైన రికార్డు
నువ్వు ఎప్ప‌టికీ నాతోనే ఉంటావు.. శిఖ‌ర్ ధావ‌న్ ఎమోష‌న‌ల్ పోస్ట్‌
నువ్వు ఎప్ప‌టికీ నాతోనే ఉంటావు.. శిఖ‌ర్ ధావ‌న్ ఎమోష‌న‌ల్ పోస్ట్‌
మీ కళ్లకు పరీక్ష పెట్టే మాయా చిత్రం.. గుడ్లగూబను కనిపెట్టగలరా..?
మీ కళ్లకు పరీక్ష పెట్టే మాయా చిత్రం.. గుడ్లగూబను కనిపెట్టగలరా..?
ఆఫీసు కోసం ఇల్లు కొన్న వ్యక్తి.. 250 ఏళ్ల నాటి రహస్యం వెలుగులోకి
ఆఫీసు కోసం ఇల్లు కొన్న వ్యక్తి.. 250 ఏళ్ల నాటి రహస్యం వెలుగులోకి
అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌.. ఇక ఆన్‌లైన్‌లో కూడా నామినేషన్‌ వేయొచ్చ
అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌.. ఇక ఆన్‌లైన్‌లో కూడా నామినేషన్‌ వేయొచ్చ
ముఖేష్, నీతాలది పెద్దలు కుదిర్చిన పెళ్లే.. సినిమాకి స్టోరీనే
ముఖేష్, నీతాలది పెద్దలు కుదిర్చిన పెళ్లే.. సినిమాకి స్టోరీనే
టైమింగ్ కూడా ముఖ్యమే! ఐపీఎల్‌లో నిషేధం అంచున యంగ్ కెప్లెన్లు
టైమింగ్ కూడా ముఖ్యమే! ఐపీఎల్‌లో నిషేధం అంచున యంగ్ కెప్లెన్లు
ఈ చిన్ని కృష్ణయ్య.. ఇప్పుడు సినిమాలతో మనసులు దోచే హీరో..
ఈ చిన్ని కృష్ణయ్య.. ఇప్పుడు సినిమాలతో మనసులు దోచే హీరో..