Bandi Sanjay: ఇద్దరు సీఎంలు కలిసి డ్రామాలు ఆడుతున్నారు.. సజ్జల కామెంట్స్‌పై బండి సంజయ్ రియాక్షన్..

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను కలపాలనే ప్రతిపాదన వస్తే అందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయి...

Bandi Sanjay: ఇద్దరు సీఎంలు కలిసి డ్రామాలు ఆడుతున్నారు.. సజ్జల కామెంట్స్‌పై బండి సంజయ్ రియాక్షన్..
Bandi Sanjay
Follow us
Ganesh Mudavath

|

Updated on: Dec 08, 2022 | 6:02 PM

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను కలపాలనే ప్రతిపాదన వస్తే అందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఉమ్మడి రాష్ట్రం రెండుగా విడిపోయి తొమ్మిది సంవత్సరాలు అవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి కామెంట్లు చేయడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు తెలంగాణ లీడర్లు. తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డి కామెంట్లపై బండి సంజయ్ స్పందించారు. మళ్లీ సెంటిమెంట్‌ను రగిల్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇద్దరు సీఎంలు కలిసి డ్రామాలాడుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. లిక్కర్‌ స్కామ్‌పై ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ డ్రామాలు చేస్తున్నారని ఆక్షేపించారు. అవసరం వచ్చినప్పుడల్లా సెంటిమెంట్‌ను తెరపైకి తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు బీజేపీ అనుకూలంగా ఉందని బండి సంజయ్ స్పష్టం చేశారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీ ముఖ్యమంత్రితో మాట్లాడారు. అక్కడి నాయకుడితో ఈ రకమైన వ్యాఖ్యలు చేయిస్తున్నారు. ఇలా చేయడంతో మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేయొచ్చని భావిస్తున్నారు. దీంతో కవిత లిక్కర్ స్కామ్ అంశంపై ప్రజల దృష్టి మరల్చవచ్చని ప్లాన్ చేశారు.

     – బండి సంజయ్, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు

ఇవి కూడా చదవండి

కాగా.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను కలిపే ప్రతిపాదన వస్తే వాటికి పూర్తి మద్దతు ఇస్తామని ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కుదిరితే మళ్లీ ఏపీ ఉమ్మడిగా కలిసి ఉండాలన్నదే తమ విధానం అని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం సీఎం జగన్‌ ఎప్పుడూ ముందుంటారని తెలిపారు. సమైక్య రాష్ట్రాన్ని వైసీపీనే గట్టిగా కోరుకుందని గుర్తు చేశారు. తాము ఎప్పుడూ ఉమ్మడి రాష్ట్రానికే మద్దతు ఇస్తామన్నారు. కుదిరితే మళ్లీ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా కలిసి ఉండాలన్నదే తమ విధానం స్పష్టం చేశారు. ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యలు అసందర్భంగా ఉన్నాయని, కావాలనే సీఎం జగన్‌పై ఆయన కామెంట్స్ చేశారని ఫైర్ అయ్యారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..