Telangana: ఆస్తి కోసం సొంత తమ్ముడ్నే దారుణంగా హత్య చేసిన అన్న
ఆస్తి కోసం కుటుంబాలు నాశనమవుతున్న ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. వరుసలు చూడకుండానే ఒకరికొకరు దాడులు చేసుకోవడం, వీలైతే హత్య చేసుకునే ఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా అలాంటి ఘటనే కామారెడ్డి జిల్లాలో జరిగింది. ఆస్తికోసం సొంత తమ్ముడ్నే అన్న హత్య చేయడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే మద్నూర్ మండలం సోనాల గ్రామంలో విజయ్ పాటిల్ ఉంటున్నాడు.
ఆస్తి కోసం కుటుంబాలు నాశనమవుతున్న ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. వరుసలు చూడకుండానే ఒకరికొకరు దాడులు చేసుకోవడం, వీలైతే హత్య చేసుకునే ఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా అలాంటి ఘటనే కామారెడ్డి జిల్లాలో జరిగింది. ఆస్తికోసం సొంత తమ్ముడ్నే అన్న హత్య చేయడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే మద్నూర్ మండలం సోనాల గ్రామంలో విజయ్ పాటిల్ ఉంటున్నాడు. అతని సొంత అన్న రాజు హైదరాబాద్‌లో ఇంగ్లీష్ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాడు. అయితే కొంతకాలం క్రితం ఈ అన్నదమ్ముల్ల మధ్య ఆస్తి వివాదాలు మొదలయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు తరచుగా వీరిమధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి.
అయితే ఈ క్రమంలో శనివారం రోజున రాత్రి విజయ్‌పాటిల్ ఇంట్లో నిద్రిస్తున్నాడు. అదే సమయంలో అతని అన్న రాజు వచ్చాడు. తన వద్ద ఉన్న కత్తితో దాడి చేసి విజయ్‌పాల్‌ను దారుణంగా హత్య చేశాడు. విషయం తెలుసుకున్న కుటంబ సభ్యులు ఒక్కసారిగా షాకయ్యారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పది సంవత్సరాల క్రితం రాజు.. తన పెద్దన్నను కూడా మహారాష్ట్రలో హత్య చేశాడని.. ఇప్పుడు మళ్లీ తమ్ముడ్ని హత్య చేశాడని పోలీసుల విచారణలో తేలింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.