Telangana Budget: అసెంబ్లీలో తెలంగాణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క

తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క, అటు శాసన మండలిలో మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టారు. అయితే సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. గత పదేళ్ల అస్తవ్యస్త పాలనకు ప్రజలు చరమగీతం పాడామన్నారు.

Follow us

|

Updated on: Jul 25, 2024 | 12:41 PM

తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క, అటు శాసన మండలిలో మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టారు. అయితే సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. గత పదేళ్ల అస్తవ్యస్త పాలనకు ప్రజలు చరమగీతం పాడామన్నారు. దశాబ్దకాలంలో తెలంగాణ పురోగతి జరగలేదన్న భట్టి, అన్ని రంగాల్లో గత ప్రభుత్వం విఫలమైందన్నారు. పదేళ్లలో అప్పు పదిరెట్లు పెరిగింది తప్పా, నాణ్యతలేని పనులతో సాగునీటి ప్రాజెక్టులు ఫలితాలు ఇవ్వలేదన్నారు. రైతుల సాగునీటి సమస్యలు పరిష్కారం కాలేదని స్పష్టం చేశారు. ఒంటెద్దు పోకడలతో సొంత జాగీరులా గత పాలన సాగిందని, దీంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అప్పులకుప్పలా మారిందన్నారు.

2 లక్షల 91 వేల 159 కోట్ల రూపాయలతో తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. రెవెన్యూ వ్యయం 2 లక్షల 20 వేల 945 కోట్లు, మూలధన వ్యయం 33 వేల 487 కోట్లుగా అంచనా వేసింది ప్రభుత్వం. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని చెప్పిన మహాకవి దాశరథిని గుర్తు చేసుకుంటూ బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క. ఆర్థిక క్రమశిక్షణతో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన మొదలైందన్నారు భట్టి విక్రమార్క. ప్రతి నెల 1వ తేదీన ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు చెల్లిస్తున్నామన్నారు. 6.70 లక్షల కోట్ల అప్పులు వారసత్వంగా వచ్చాయి. ఈ అప్పులపై రూ. 48 వేల కోట్ల వడ్డీ చెల్లించామన్నారు. అప్పులు కట్టడానికి కూడా అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. 7 నెలల్లో రూ. 39 వేల కోట్లు సంక్షేమ పథకాల కోసం ఖర్చు చేశామని వివరించారు. వాస్తవానికి దగ్గరగా గత ఫిబ్రవరిలో బడ్జెట్ ప్రవేశపెట్టామన్న ఆర్థిక మంత్రి భట్టి, గత ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ విషయంలో నిర్లక్ష్యం చేసిందన్నారు. నిరుద్యోగుల ఆశలను ఏ మాత్రం పట్టించుకోకుండా వ్యవహరించారని మండిపడ్డారు.

తెలంగాణ బడ్జెట్:

తెలంగాణ పూర్తి స్థాయి బడ్జెట్ 2,91,191కోట్లు.

తెలంగాణ ఏర్పాటు నాటికి 75577కోట్ల అప్పు..

ఈ ఏడాది డిసెంబర్ 6లక్షల 71 వేల కోట్ల కు చేరింది..

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 42 వేల కోట్ల బకాయిలు చెల్లింపు..