AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భయపడకండి.. జ్వరం వస్తే మంచిదే..! భవిష్యత్తులో ఎదురయ్యే రోగాలకు చెక్‌ పెట్టొచ్చు- తాజా సర్వే వెల్లడి

శరీరంలో పేరుకుపోయిన విష వ్యర్థాలను ఇది బయటకు పంపించేస్తుంది. ఇది శరీరానికి మంచిదని టాక్సీకాలజీ అండ్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ అధ్యయనం పేర్కొంది. తరచూ జ్వరం రావడం వల్ల ఏ సూక్ష్మజీవి ఎలాంటి ప్రమాదాన్ని కలిగిస్తుంది.. దాన్ని ఎలా ఎదుర్కోవాలన్న ట్రైనింగ్ రోగ నిరోధక వ్యవస్థకు తెలుస్తోంది. దీంతో ఆ వ్యాధులు మళ్లీ ఎదురైనా సులభంగా ఎదుర్కొనగలదని ఎక్స్పరిమెంటల్ మెడిసిన్ అధ్యయనం తెలిపింది.

భయపడకండి.. జ్వరం వస్తే మంచిదే..! భవిష్యత్తులో ఎదురయ్యే రోగాలకు చెక్‌ పెట్టొచ్చు- తాజా సర్వే వెల్లడి
Fever
Yellender Reddy Ramasagram
| Edited By: Jyothi Gadda|

Updated on: Jul 25, 2024 | 12:16 PM

Share

అసలే వర్షాకాలం.. దోమల బెడద ఎక్కువ. ఏమాత్రం అపరిశుభ్రంగా ఉన్న వైరల్ ఫీవర్ ఎటాక్ అవుతాయి. జ్వరం వస్తే శారీరకంగా మానసికంగా ఇబ్బంది పడతాం. కానీ ఇలా జ్వరం బారిన పడడం శరీరానికి మంచిదే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అప్పుడప్పుడు జ్వరం బారిన పడడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచుకోవడంతో పాటు భవిష్యత్తులో ఎదురయ్యే ఇతర రోగాలను కూడా తప్పించుకోవచ్చు అని తాజా సర్వే రిపోర్ట్ చెబుతోంది. ప్రపంచంలోని ప్రముఖ ఆరు అధ్యయనాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అప్పుడప్పుడు జ్వరం వస్తే ఆరు లాభాలను పొందవచ్చని చెబుతున్నాయి.

జ్వరం వస్తే శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీంతో రోగా నిరోధక వ్యవస్థకు రక్షణగా ఉండే తెల్ల రక్త కణాలు అలర్ట్ అయిపోతాయి. వ్యాధిని కలిగించే బ్యాక్టీరియా వైరస్‌ల కట్టడికి ఎముకల మధ్యలో మరిన్ని తెల్ల రక్త కణాల ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. దీంతో రోగ నిరోధక శక్తి మరింత పెరుగుతుందని ఇమ్యునాలజీ అండ్ సెల్ బయాలజీ అధ్యయనం తెలిపింది. మనం తీసుకున్న ఆహారం, పీల్చే గాలి ద్వారా బ్యాక్టీరియా వైరస్ వంటి సూక్ష్మజీవులు ఎన్నో శరీరం లోపలికి ప్రవేశిస్తాయి. ఇవి చైతన్యవంతంగా ఉండాలంటే శరీర ఉష్ణోగ్రత 37°c ఉండాలి. అయితే జ్వరం వచ్చిన వ్యక్తికి శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీంతో ఇన్ఫ్లూయంజ వైరస్ వంటి సూక్ష్మజీవుల సంతాన అభివృద్ధి జరగదనీ.. దీంతో వైరస్‌లకు కట్టడి జరుగుతుందని.. వైరాలజీ అధ్యయనం తెలిపింది.

శరీర ఉష్ణోగ్రతలో పెరుగుదల సూక్ష్మ క్రిముల వృద్ధిని నిలుపుదల చేయడమే కాకుండా ఇమ్యూన్ సెల్స్ ఆక్టివిటీని పెంచుతుంది. ఉష్ణోగ్రతల్లో పెరుగుదల నమోదు అవ్వగానే సైటో కాయిన్స్ ప్రోటీన్ ఉత్తేజితమవుతుంది. ఇది యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ అణువులను శరీరంలోకి విడుదల చేస్తుంది. దీంతో వ్యాధి తీవ్రత తగ్గుతుందని కెమికల్ ఇన్వెస్టిగేషన్ అధ్యయనం తెలిపింది. జ్వరం కారణంగా శరీర ఉష్ణోగ్రత పెరగడంతో హీట్ షాక్ ప్రోటీన్స్ చైతన్యవంతం అవుతాయి. సూక్ష్మజీవుల దాడిలో నాశనమైన కణాలకు ప్రత్యేక ప్రోటీన్ సాయంతో ఇవి మరమ్మతులు చేస్తాయి. తద్వారా రోగ నిరోధక శక్తిని ఉత్తేజితం చేస్తాయని నేచర్ రివ్యూస్ మాలిక్యులర్ సెల్ బయాలజీ అధ్యయనం తెలిపింది.

ఇవి కూడా చదవండి

జ్వరం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరిగినప్పుడు జీవక్రియ రేటు పెరుగుతుంది. అంటే చెమట పట్టడం, మల, మూత్ర విసర్జన లాంటివి జరుగుతాయి. శరీరంలో పేరుకుపోయిన విష వ్యర్థాలను ఇది బయటకు పంపించేస్తుంది. ఇది శరీరానికి మంచిదని టాక్సీకాలజీ అండ్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ అధ్యయనం పేర్కొంది. తరచూ జ్వరం రావడం వల్ల ఏ సూక్ష్మజీవి ఎలాంటి ప్రమాదాన్ని కలిగిస్తుంది.. దాన్ని ఎలా ఎదుర్కోవాలన్న ట్రైనింగ్ రోగ నిరోధక వ్యవస్థకు తెలుస్తోంది. దీంతో ఆ వ్యాధులు మళ్లీ ఎదురైనా సులభంగా ఎదుర్కొనగలదని ఎక్స్పరిమెంటల్ మెడిసిన్ అధ్యయనం తెలిపింది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..