AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amazon: అమెజాన్‌లో ఎయిర్ ఫ్రైయర్ ఆర్డర్ పెట్టిన మహిళ.. బాక్స్ తెరిచి చూడగా..

ఇది Amazon తప్పిదమా లేక క్యారియర్ తప్పిదమా అనేది తెలియదని అన్నారు. కానీ, ఊహించని సంఘటనతో ఆమె ఆశ్చర్యపోయింది. సోఫియా సమస్యకు అమెజాన్ ఇంకా పరిష్కారాన్ని అందించలేదని చెప్పింది.. ఇకపోతే, ఈ పోస్ట్‌పై నెటిజన్లు పెద్ద సంఖ్యలో స్పందించారు. రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

Amazon: అమెజాన్‌లో ఎయిర్ ఫ్రైయర్ ఆర్డర్ పెట్టిన మహిళ.. బాక్స్ తెరిచి చూడగా..
Amazon
Jyothi Gadda
|

Updated on: Jul 25, 2024 | 10:36 AM

Share

ఆన్‌లైన్ షాపింగ్ చాలా సౌకర్యవంతంగా ఉన్నప్పటికీ, ఇది కొన్నిసార్లు తప్పులు, పొరపాట్లకు కారణం అవుతుంది. కొన్ని కొన్ని సార్లు ఆర్డర్‌ ఇచ్చిన వస్తువుకు బదులుగా మరొకటి ఇంటికి వస్తుంది. ఇలాగే కస్టమర్లను నిరాశపరిచిన అనుభవాలు అనేకం సోషల్ మీడియా ద్వారా చూస్తుంటాం. అలాంటిదే ఈ ఘటన కూడా. ఇక్కడఒక మహిళకు ఎదురైన ఆన్‌లైన్ షాపింగ్ అనుభవం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది ప్రతి ఒక్కరినీ షాక్ అయ్యేలా చేస్తుంది. ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసిన ఓ మహిళకు కలలో కూడా ఊహించని సంఘటన ఎదురైంది. సదరు మహిళ అమెజాన్ నుండి ఎయిర్ ఫ్రైయర్‌ను ఆర్డర్ చేసింది. కానీ, ఆమెకు వచ్చిన ఆర్డర్‌ ప్యాకెట్‌ ఓపెన్‌ చేసి చూడగా అందులో కనిపించినది ఆమెను ఆశ్చర్యపోయేలా చేసింది. పార్శిల్‌లో డెలీవరి అయిన వస్తువు చూసి ఆ మహిళ ఒక్కసారిగా ఫ్యూజుల్‌ ఎగిరిపోయినంత పనైంది. ఇంతకీ ఆమెకు అందిన పార్శిల్‌ ఎంటీ..? అందులో ఏముంది..? పూర్తి వివరాల్లోకి వెళితే..

కొలంబియాకు చెందిన సోఫియా సెరానో అనే మహిళ తన ఇంటికి అవసరమైన ఎయిర్ ఫ్రైయర్‌ను ఆర్డర్ చేసింది. ఆర్డర్‌ ఇంటికి వచ్చింది. దాన్ని తెరిచి చూడగా, అందులోంచి ఒక బల్లి బయటకు వచ్చింది. అది చూసి సోఫియా భయపడిపోయింది. తన అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రజలతో పంచుకుంది. దాంతో ఈ ఘటన మరింత వైరల్ అవుతోంది. సోఫియా తాను అమెజాన్ నుండి ఎయిర్ ఫ్రైయర్‌ను ఆర్డర్ చేశానని, అయితే, వచ్చిన పార్శిల్‌ ఓపెన్‌ చేయగా అందులో బల్లి కనిపించటంతో తాను కంగారుపడ్డానని చెప్పింది. బల్లిని చూసి మొదలట భయపడిపోయింది. అది స్పానిష్ రాక్ బల్లిగా గుర్తించానని సోఫియా చెప్పింది. ఇది Amazon తప్పిదమా లేక క్యారియర్ తప్పిదమా అనేది తెలియదని అన్నారు. కానీ, ఊహించని సంఘటనతో ఆమె ఆశ్చర్యపోయింది. సోఫియా సమస్యకు అమెజాన్ ఇంకా పరిష్కారాన్ని అందించలేదని చెప్పింది.. ఇకపోతే, ఈ పోస్ట్‌పై నెటిజన్లు పెద్ద సంఖ్యలో స్పందించారు. రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

చాలా మంది నెటిజన్లు ఆమెకు ఉచిత సలహాలు కూడా ఇచ్చారు. సోఫియా తన ఏరియా ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌ను సంప్రదించాలని సూచించారు. ఈ బల్లిని వన్యప్రాణి అధికారులకు అప్పగించి సంరక్షించాలని కోరుతున్నారు. సెరానో ఎయిర్ ఫ్రైయర్ స్థానంలో ఒక పెద్ద బల్లిని చూసి “షాక్” అయ్యానని చెప్పారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..