AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: రూ. 500 అద్దె ఇంటి హోమ్‌ టూర్‌ వీడియో.. నెట్టింట తెగ వైరల్‌..

తాజాగా ముంబయికి చెందిన ఓ జొమాటో డెలివరి బాయ్‌ తాను నివసిస్తున్న అద్దె ఇంటికి సంబంధించి పోస్ట్‌ చేసిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ముంబయిలో పేద వారి జీవితాలు ఎలా ఉంటాయో చెప్పేందుకు సాక్ష్యంగా నిలుస్తోందీ వీడియో. హోమ్‌ టూర్‌ అనగానే ఇంధ్రభవనంగా భావిస్తాం. కానీ ఈ యువకుడు ఉంటున్న గది అద్దె కేవలం రూ. 500 మాత్రమే...

Viral Video: రూ. 500 అద్దె ఇంటి హోమ్‌ టూర్‌ వీడియో.. నెట్టింట తెగ వైరల్‌..
Viral Video
Narender Vaitla
|

Updated on: Jul 25, 2024 | 7:31 AM

Share

సోషల్‌ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత హోమ్‌ టూర్ వీడియోలు తెగ వైరల్‌ అవుతున్నాయి. సినీతారలు రూ. కోట్ల రూపాయలతో నిర్మించుకున్న తమ ఇంటికి సంబంధించి వీడియోలను చిత్రీకరించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. దీంతో ఈ వీడియోలు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి. లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. తమ ఇంట్లో ఇంటీరియర్‌ను, ఫర్నిచర్స్‌ను చూపిస్తూ తీసిన వీడియోలను జనాలలు సహజంగానే ఎంతో ఇంట్రెస్టింగ్‌గా చూస్తుంటారు. అలాంటిది ఓ బాత్‌రూమ్‌ సైజ్‌లో ఉన్న అద్దె ఇంటి గురించి వీడియో తీస్తే ఎవరైనా చూస్తారా.?

తాజాగా ముంబయికి చెందిన ఓ జొమాటో డెలివరి బాయ్‌ తాను నివసిస్తున్న అద్దె ఇంటికి సంబంధించి పోస్ట్‌ చేసిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ముంబయిలో పేద వారి జీవితాలు ఎలా ఉంటాయో చెప్పేందుకు సాక్ష్యంగా నిలుస్తోందీ వీడియో. హోమ్‌ టూర్‌ అనగానే ఇంధ్రభవనంగా భావిస్తాం. కానీ ఈ యువకుడు ఉంటున్న గది అద్దె కేవలం రూ. 500 మాత్రమే. ముంబయిలో మురికివాడలో ఉన్న ఈ గదికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ్‌ వైరల్‌ అవుతోంది.

ప్రంజయ్‌ బోర్గోయరీ అనే యువకుడు ముంబయికి ఉద్యోగం చేయడానికి వచ్చాడు. అయితే ఉద్యోగన్వేషణలో ఉన్న బోర్గోరయరీ ప్రస్తుతం డెలివరీ బాయ్‌గా జీవనం సాగిస్తున్నాడు. అత్యంత ఇరుకైన సంది గుండా లోపలికి వెళ్లగా. చిన్న మెట్ల మార్గం వస్తుంది. ఆ తర్వాత పైకి ఎక్కితే చిన్న గది ఉంది. ఒక విలాసవంతమైన ఇంట్లోని బాత్‌రూమ్‌ కంటే చిన్నగా ఉందీ గది. అయితే ఇందులో అతను మరో వ్యక్తితో కలిసి ఉండడం గమనార్హం. ఈ గదిని హోమ్‌ టూర్‌ వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం ట్రెండ్‌ అవుతోంది.

వైరల్ వీడియో..

View this post on Instagram

A post shared by qb_07 (@qb__.07)

అంత చిన్న గదిలో ఉంటూ తాను పడుతోన్న ఇబ్బందులను, జీవన పరిస్థితులను వివరించాడు. ఇక తాను ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నానని, కుటుంబ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలోనే ఇలా సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పుకొచ్చాడు. ఇక వీడియో ఇన్‌స్టాలో పోస్ట్ చేయగా పలువురు నెటిజన్లు స్పందిస్తున్నారు. ప్రంజయ్‌కి మంచి రోజులు రావాలని కామెంట్స్‌ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!