చలిగా ఉందని హీటర్ వాటర్​తో స్నానం చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త..! మీరు చిక్కుల్లో పడినట్టే..

అలాగే కొన్ని హీటర్లు తరచుగా రిపేర్​కి వస్తుంటాయి. దాంతో వాటిని బాగు చేయించాలన్నా లేదా కొత్తవి కొనాలన్నా ఖర్చు తప్పదు. అంతేకాదు.. నాణ్యత లేని హీటర్లు వాడడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, మీరు తప్పనిసరి పరిస్థితుల్లో హీటర్ వాడాలనుకుంటే కాస్త ధర ఎక్కువైనా మంచి క్వాలిటీ ఉన్న దాన్ని తీసుకోవడం బెటర్ అని సూచిస్తున్నారు నిపుణులు.

చలిగా ఉందని హీటర్ వాటర్​తో స్నానం చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త..! మీరు చిక్కుల్లో పడినట్టే..
Electric Heater Water
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 25, 2024 | 8:04 AM

వర్షాకాలంలో ఇంట బయట తడితో ఇబ్బందులు తప్పవు. రోజంతా కురిస్తున్న వర్షంతో స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగస్తులు సహా అందరూ అవస్థలు పడాల్సి వస్తుంది. ఇక ఉదయాన్నే స్నానం చేయాలంటే.. ఇంట్లో టాప్‌ వాటర్‌ కూడా చల్లగా వస్తుంటాయి. దీంతో చాలా మంది వేడినీటి స్నానం చేస్తుంటారు. అందుకోసం కొంతమంది గీజర్‌ ఉపయోగిస్తే, మరికొంతమంది గ్యాస్‌ స్టౌ వాడుతుంటారు.. ఇంకొందరు వాటర్‌ హీటర్‌తో నీళ్లు వేడి చేసుకుంటుంటారు. అయితే, వీటిలో చాలామంది ఇళ్లలో ఎక్కువగా వాటర్ హీటర్​నే వాడుతుంటారు. అందరికీ అందుబాటు ధరలో లభించేది హీటర్‌ ఒక్కటే, అలాగే, తక్కువ సమయంలో నీళ్లు వేడి చేసుకోవచ్చు. అయితే.. ఎలక్ట్రిక్ హీటర్ వాటర్​వాడడం వల్ల ఆరోగ్య సమస్యలతోపాటు కొన్ని ఇతర నష్టాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

ఎలక్ట్రిక్ హీటర్ వాడడం వల్ల నీరు త్వరగా వేడెక్కుతుంది. కానీ, ఆ నీటితో స్నానం చేయడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా హీటర్‌తో కాచిన వేడి నీటితో స్నానం చేయడం వల్ల దురద, పొక్కులు, ఇతర చర్మ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందంటున్నారు. అలాగే ఎలక్ట్రిక్ హీటర్లు వాడుతున్న క్రమంలో గాలిలో కార్బన్ మోనాక్సైడ్ వంటి హానికరమైన వాయువులు రిలీజ్ అవుతాయని చెబుతున్నారు. హీటర్‌ వల్ల విడుదలయ్యే ఇలాంటి వాయువుల కారణంగా తలనొప్పి, వికారం, శ్వాసకోశ సమస్యలు ఎదురవుతాయంటున్నారు. అంతేకాదు.. ఎలక్ట్రిక్ హీటర్​తో బాగా వేడెక్కిన నీటితో స్నానం చేయడం వల్ల గుండె ఆరోగ్యంపై కూడా ప్రభావం పడుతుందని చెబుతున్నారు. గుండెపోటు, స్ట్రోక్ వంటి గుండె సమస్యల ముప్పు పెరుగుతుందని సూచిస్తున్నారు.

ఎలక్ట్రిక్ హీటర్ వాడడం వల్ల ఆరోగ్య సమస్యలు మాత్రమే కాదు.. ఆర్థిక సమస్యలు కూడా తప్పవంటున్నారు నిపుణులు. ఎందుకంటే..ఎలక్ట్రిక్‌ వాటర్‌ హీటర్‌ పనిచేయాలంటూజజ ఎక్కువ విద్యుత్ అవసరం. దానికారణంగా కరెంటు బిల్లు కూడా ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే కొన్ని హీటర్లు తరచుగా రిపేర్​కి వస్తుంటాయి. దాంతో వాటిని బాగు చేయించాలన్నా లేదా కొత్తవి కొనాలన్నా ఖర్చు తప్పదు. అంతేకాదు.. నాణ్యత లేని హీటర్లు వాడడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, మీరు తప్పనిసరి పరిస్థితుల్లో హీటర్ వాడాలనుకుంటే కాస్త ధర ఎక్కువైనా మంచి క్వాలిటీ ఉన్న దాన్ని తీసుకోవడం బెటర్ అని సూచిస్తున్నారు నిపుణులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఈయన రమ్యకృష్ణకు నాన్న, అన్న, భర్తగా నటించాడా..!!
ఈయన రమ్యకృష్ణకు నాన్న, అన్న, భర్తగా నటించాడా..!!
ఊపిరితిత్తుల ఆరోగ్యం కోసం రోజూ ఈ యోగాసనాలు బెస్ట్ మెడిసిన్..
ఊపిరితిత్తుల ఆరోగ్యం కోసం రోజూ ఈ యోగాసనాలు బెస్ట్ మెడిసిన్..
స్మశానంలో బంగారం వేట.. మృతదేహాల బూడిదలో వెతుకులాట..
స్మశానంలో బంగారం వేట.. మృతదేహాల బూడిదలో వెతుకులాట..
ఏంటిది? ముస్లిం మత పెద్దను కలిసిన స్టార్ నటిపై నెటిజన్ల ఆగ్రహం
ఏంటిది? ముస్లిం మత పెద్దను కలిసిన స్టార్ నటిపై నెటిజన్ల ఆగ్రహం
కురుక్షేత్రలో ఈ నెల 28 నుంచి గీతా మహోత్సవ వేడుకలు..
కురుక్షేత్రలో ఈ నెల 28 నుంచి గీతా మహోత్సవ వేడుకలు..
మీ రైలు టికెట్‌పై మరొకరు ప్రయాణించవచ్చా? రైల్వే నిబంధనలు ఏంటి?
మీ రైలు టికెట్‌పై మరొకరు ప్రయాణించవచ్చా? రైల్వే నిబంధనలు ఏంటి?
రాశి నాథుడి అనుకూలత.. వారి జీవితాలు నల్లేరుపై బండి నడకే..!
రాశి నాథుడి అనుకూలత.. వారి జీవితాలు నల్లేరుపై బండి నడకే..!
డబుల్ ఇస్మార్ట్ బ్యూటీ నెట్టింట సెగలు రేపుతోందిగా..!
డబుల్ ఇస్మార్ట్ బ్యూటీ నెట్టింట సెగలు రేపుతోందిగా..!
రవి మీద శని దృష్టి.. ఆ రాశుల వారికి ఆదాయ, అధికార యోగాలు..!
రవి మీద శని దృష్టి.. ఆ రాశుల వారికి ఆదాయ, అధికార యోగాలు..!
'కష్టకాలంలో అండగా నిలిచారు'..వారికి థ్యాంక్స్ చెప్పిన నారా రోహిత్
'కష్టకాలంలో అండగా నిలిచారు'..వారికి థ్యాంక్స్ చెప్పిన నారా రోహిత్