Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nirmala Sitharaman: బడ్జెట్‌ వేళ.. చరిత్ర సృష్టించిన నిర్మలమ్మ.. చీరచీరకో ప్రత్యేకత..!

గత ఆరేళ్లుగా బడ్జెట్‌ సమయంలో ఆమె ధరించిన చీరలు.. దేశ సంస్కృతీ సంప్రదాయాల్ని ప్రతిబింబించేలా కనిపిస్తున్నాయి.  హుందాతనానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాయి. అందుకే నిర్మల్లమ్మ ఎంచుకునే చీరలంటే ఎంతోమంది మహిళలకు ఆసక్తి.  ఇక నిర్మలమ్మకు చేనేత చీరలంటే మక్కువ ఎక్కువ.. అందుకే ప్రతిసారి బడ్జెట్

Nirmala Sitharaman: బడ్జెట్‌ వేళ.. చరిత్ర సృష్టించిన నిర్మలమ్మ.. చీరచీరకో ప్రత్యేకత..!
Fm Nirmala Sitharaman
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 23, 2024 | 11:52 AM

Budget 2024: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి, తెలుగింటి కోడలు నిర్మలా సీతారామన్ అరుదైన ఘనత సాధించారు. వరుసగా ఏడోసారి పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టి సరికొత్త రికార్డు సృష్టించారు. అంతేకాదు.. ఎక్కువసార్లు బడ్జెట్‌ ప్రవేశపెట్టిన మహిళా ఆర్థిక మంత్రిగానూ నిర్మలమ్మ తన పేరును లిఖించుకున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన ఆర్థిక విధానాలకు మాత్రమే కాకుండా బడ్జెట్ రోజున తన విలక్షణమైన చీరలకు కూడా ప్రత్యేక ఉంది. ప్రతి ఏడాది బడ్జెట్ ప్రవేశపెట్టే రోజున నిర్మలమ్మ ధరించే చీరలపైనా అందరి దృష్టి ఉంటుంది.

గత ఆరేళ్లుగా బడ్జెట్‌ సమయంలో ఆమె ధరించిన చీరలు.. దేశ సంస్కృతీ సంప్రదాయాల్ని ప్రతిబింబించేలా కనిపిస్తున్నాయి.  హుందాతనానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాయి. అందుకే నిర్మల్లమ్మ ఎంచుకునే చీరలంటే ఎంతోమంది మహిళలకు ఆసక్తి.  ఇక నిర్మలమ్మకు చేనేత చీరలంటే మక్కువ ఎక్కువ.. అందుకే ప్రతిసారి బడ్జెట్ సందర్బంగా చేనేత చీరలోనే కనిపిస్తారు. ఈ సారి బడ్జెట్ ప్రవేశపెడుతున్న క్రమంలో కూడా హ్యాండ్లూమ్‌ శారీనే ధరించి కనిపించారు.

మెజెంటా బోర్డర్‌తో తెలుపు రంగు శారీపై బంగారు మోటిఫ్‌లతో కలగలిపిన సిల్క్‌ నిర్మలమ్మ ఎంతో ప్రశాంతంగా కనిపించారు. గోల్డెన్ బ్యాంగిల్స్, చైన్, చిన్న చెవిపోగులను ధరించారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన కాంత ఎంబ్రాయిడరీతో తయారు చేసిన టస్సార్ సిల్క్ శారీ ఇది. దాని ప్రత్యేకమైన ఆకృతి, బంగారు మెరుపుతో ఎంతో గ్రాండ్‌గా కనిపించింది. గోల్డెన్ బ్యాంగిల్స్, చైన్, చిన్న చెవిపోగులను ధరించారు. ఇది సాంప్రదాయ హస్తకళ, ప్రాంతీయ కళాత్మకత రెండింటినీ హైలైట్ చేసింది.

Budget 2024: 2024 మధ్యంతర బడ్జెట్ సందర్బంగా నీలం రంగు చీరలో కనిపించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌. నీలం రంగు డైనమిక్, ఉల్లాసభరితమైన జీవితాన్ని ఇచ్చే శక్తికి చిహ్నంగా భావిస్తారు.

Budget 2023: కేంద్ర బడ్జెట్ 2023లో ఆర్థిక మంత్రి సీతారామన్ ముదురు ఎరుపు, నలుపు రంగులతో కూడిన చీరను ధరించారు. రెండు రంగుల మిశ్రమం ధైర్యం, శక్తికి చిహ్నంగా పిలుచుకుంటారు ప్రజలు.

Budget 2022 : సాధారణ బడ్జెట్ 2022లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గోధుమ రంగు చీరలో కనిపించారు. ఈ రంగు భద్రతకు చిహ్నం.

Budget 2021 : సాధారణ బడ్జెట్ 2021 సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎరుపు రంగు చీరను ధరించారు. ఇది శక్తి, సంకల్పానికి చిహ్నం.

Budget 2020: సాధారణ బడ్జెట్ 2020 సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పసుపు రంగు చీరను ధరించారు. ఇది ఉత్సాహం, శక్తికి చిహ్నం.

Budget 2019: 2019లో నిర్మలా సీతారామన్ తొలిసారిగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆమె ముదురు గులాబీ రంగు చీరను ధరించారు. ఇది గంభీరత, స్తబ్దతకు చిహ్నంగా పరిగణిస్తారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి