Budget 2024: పెళ్లిళ్ల సీజన్‌కు ముందే శుభవార్త చెప్పిన మోదీ సర్కార్..! బడ్జెట్‌లో ఏది చౌకగా మారిందంటే..

ఈ బడ్జెట్ అభివృద్ధి చెందిన భవిష్యత్తుకు పునాది వేయగలదని.. ఇది 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి రోడ్ మ్యాప్‌ను అందిస్తుందన్నారు. ఈ యేడు బడ్జెట్‌ థీమ్‌లో తొమ్మిది అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారు..అవేంటంటే..

Budget 2024: పెళ్లిళ్ల సీజన్‌కు ముందే శుభవార్త చెప్పిన మోదీ సర్కార్..! బడ్జెట్‌లో ఏది చౌకగా మారిందంటే..
Budget 2024
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 23, 2024 | 1:57 PM

Budget 2024: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024 జూలై 23న నరేంద్ర మోదీ ప్రభుత్వ హయాంలో మూడవసారి పూర్తి స్థాయి బడ్జెట్‌ను సమర్పించారు. ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఎన్నో పెద్ద ప్రకటనలు చేశారు. ఈ సందర్బంగా పెళ్లిళ్ల సీజన్‌కు ముందే ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రజలకు శుభవార్త చెప్పింది. మంగళవారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 మొత్తం బడ్జెట్‌ను సమర్పించినప్పుడు, ఏది చౌకగా ఉంటుంది. ఏది ఖరీదైనది అని కూడా ఆమె వివరించారు.

* దేశంలో తయారయ్యే లెదర్, బట్టలు, బూట్లు తక్కువ ధరకే లభిస్తాయి. పాదరక్షలు, తోలు వస్తువుల ధరలు తగ్గుతాయి.

* బంగారం, వెండిపై ఆరు శాతం తక్కువ సుంకం విధించనున్నారు. ప్లాటినంపై సుంకం 6.4 శాతం తగ్గింది.

ఇవి కూడా చదవండి

* మొబైల్ ఛార్జర్‌పై 15 శాతం తగ్గింపు.

* మూడు క్యాన్సర్ మందులపై కస్టమ్ మినహాయింపు అందుబాటులో ఉంటుంది.

* సోలార్ ప్యానెల్స్ కూడా చౌకగా ఉంటాయి.

* ఉక్కు, ఇనుము ధరలు కూడా తగ్గుతాయి.

* క్రూజ్ ప్రయాణం కూడా చౌకగా ఉంటుంది.

* సీ ఫుడ్ ధరలు కూడా తగ్గుతాయి.

* PVC ప్లాస్టిక్ ఇప్పుడు ఖరీదైనది. అలాంటి ప్లాస్టిక్ వస్తువులపై దిగుమతి సుంకాన్ని పెంచడమే ఇందుకు కారణం.

* సిగరెట్లు కూడా ఖరీదయ్యాయి.

* విమాన ప్రయాణం కూడా మునుపటి కంటే ఖరీదుగా మారి మీ జేబులకు చిల్లుపెట్టనుంది.

* టెలికమ్యూనికేషన్ పరికరాలు కూడా ఖరీదైనవి.

* గరీబ్‌ కల్యాణో యోజనను మరో ఐదేళ్లు పొడిగిస్తున్నట్లు ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. దాంతో 80 కోట్ల మందికిపైగా పేదలు లబ్ధి పొందుతారు.

ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌.. మోదీ ప్రభుత్వం 3.0 లో తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ అభివృద్ధి చెందిన భవిష్యత్తుకు పునాది వేయగలదని.. ఇది 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి రోడ్ మ్యాప్‌ను అందిస్తుందన్నారు. ఈ యేడు బడ్జెట్‌ థీమ్‌లో తొమ్మిది అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారు..అవేంటంటే..

బడ్జెట్‌ థీమ్‌.. తొమ్మిది అంశాలు

1. వ్యవసాయంలో ఉత్పాదకత పెంచడం

2. ఉద్యోగం, నైపుణ్యాలు పెంచడం

3. మానవ వనరుల అభివృద్ధి-సామజిక న్యాయం

4. తయారీరంగం, సేవలు

5. పట్టణాల అభివృద్ధి

6. ఇంధన భద్రత

7. మౌలిక వసతుల అభివృద్ధి

8. ఆవిష్కరణలు, పరిశోధన-అభివృద్ధి

9. కొత్తతరం సంస్కరణలు

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే