Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Snake Free City: ఒక్క పాము కూడా కనిపించని రాష్ట్రం ఇది..! ఎక్కడో కాదు మన దేశంలోనే.. తెలిస్తే షాక్‌ అవుతారు..

భారతదేశంలో సుమారు 350 రకాల పాములు కనిపిస్తాయి. పాములు అత్యధికంగా ఉన్న రాష్ట్రం కేరళ. దేశంలో కెల్లా అత్యంత విషపూరితమైన పాములు కేరళలో కనిపిస్తాయి. ఇక్కడ ఎన్నో జాతుల పాములు కనిపిస్తాయి. మన దేశంలో దాదాపు ప్రతిచోటా పాములు సంచరిస్తుంటాయి. అయితే, ఒక్క పాము కూడా కనిపించని రాష్ట్రం ఒకటి మన భారతదేశంలోనే ఉందని మీకు తెలుసా.?

Snake Free City:  ఒక్క పాము కూడా కనిపించని రాష్ట్రం ఇది..! ఎక్కడో కాదు మన దేశంలోనే.. తెలిస్తే షాక్‌ అవుతారు..
Snake
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 23, 2024 | 10:30 AM

ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల పాములు కనిపిస్తాయి. మనదేశంలో ఏ ప్రాంతానికి వెళ్లినా పాములు కచ్చితంగా కనిపిస్తాయి. పాములలో రకరకాల జాతులు ఉన్నాయి. లక్షల ఏళ్ల నుంచి భూమి మీద నివసిస్తున్న అతి పురాతనమైన సరీసృపాలలో పాములు ఒకటి. ప్రపంచంలోని ఇతర దేశాలలో కూడా అత్యంత ప్రమాదకరమైన, విషపూరితమైన పాములు కొన్ని చోట్ల కనిపిస్తాయి. భారతదేశంలో సుమారు 350 రకాల పాములు కనిపిస్తాయి. పాములు అత్యధికంగా ఉన్న రాష్ట్రం కేరళ. దేశంలో కెల్లా అత్యంత విషపూరితమైన పాములు కేరళలో కనిపిస్తాయి. ఇక్కడ ఎన్నో జాతుల పాములు కనిపిస్తాయి. మన దేశంలో దాదాపు ప్రతిచోటా పాములు సంచరిస్తుంటాయి. అయితే, ఒక్క పాము కూడా కనిపించని రాష్ట్రం ఒకటి మన భారతదేశంలోనే ఉందని మీకు తెలుసా.?

భారతదేశంలోని కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్‌లో ఒక్క పాము కూడా కనిపించదంటే నమ్మగలరా..? కానీ, ఇది నిజమే అంటున్నారు. దేశంలో పాములు కనిపించని ఏకైక ప్రాంతం లక్షద్వీప్. లక్షద్వీప్‌ను పాము రహిత ప్రాంతంగా ప్రకటించారు. లక్షద్వీప్‌లో ఒక్క పాము కూడా ఉండదట. ఇక్కడ మరో విశేషమేమిటంటే ఇక్కడ పాములే కాకుండా కుక్కలు కూడా కనిపించవు. అంటే ఇది పాము, కుక్క లేని రాష్ట్రంగా గుర్తింపు ఉంది. ఈ రాష్ట్రాన్ని పాము, కుక్క లేకుండా చేయాలని ఇక్కడి పరిపాలన విభాగం ఎప్పటి నుంచో ప్రయత్నిస్తుందట. ఫలితంగా ఇక్కడ పాములు, కుక్కలు పూర్తిగా కనిపించకుండా పోయాయని చెబుతారు. ఇకపోతే, లక్షద్వీప్‌లో కాకులు ఎక్కువగా కనిపిస్తాయి.

అంతే కాదు దీన్ని రేబిస్‌ రహిత రాష్ట్రంగానూ పిలుస్తుంటారు. ఇక్కడ ఏ ప్రాంతంలోనూ కుక్కలు కనిపించవు. లక్షద్వీప్‌కు వచ్చే పర్యాటకులు సైతం ఇక్కడకు కుక్కలను తీసుకురారు. ఇక లక్షద్వీప్‌లో పక్షులు ఎక్కువగా కనిపిస్తాయి. ద్వీపంలో సిరేనియా, సముద్రపు ఆవులను చూడొచ్చు. కానీ, ఇప్పుడు చాలా ప్రదేశాల్లో అవి కనిపించ‌డం లేదు.

ఇవి కూడా చదవండి

ఇకపోతే, లక్షద్వీప్‌ కేంద్రపాలిత ప్రాంతం. 36 ద్వీపాలతో కలిసి ఉంటుంది. 32 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంటుంది. లక్షద్వీప్‌లో అనేక బీచ్‌లున్నాయి. అందులో కరవత్తి, కిలాతన్‌, మినికాయ్‌, చెట్లత్‌, కద్మత్‌, అగతి, అమిని, బిత్రా, ఆందేహ్, కల్పాని బీచ్‌లున్నాయి. ఇక ఈ ప్రాంతం పాము రహిత రాష్ట్ర హోదాను కూడా పొందింది.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం క్లిక్ చేయండి..,